Categories: TOP STORIES

కొల్లూరులో ప్ర‌పంచ‌స్థాయి క‌ట్ట‌డం!

  • అన్వితా గ్రూప్ ప్ర‌జంట్స్ ఇవానా
  • అంత‌ర్జాతీయ స్థాయి స‌దుపాయాలు
  • నిర్మాణ నాణ్య‌త‌కు పెద్ద‌పీట..
  • స్కైవిల్లాస్‌.. టెర్ర‌స్ ప్లే గ్రౌండ్‌..

దుబాయ్ అంటేనే గ్లోబ‌ల్ డెస్టినేష‌న్ అని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. క‌ళ్లు మిరుమిట్లుగొలిపే ఆకాశ‌హ‌ర్మ్యాలు, ల‌గ్జ‌రీ హోట‌ళ్లు, షాపింగ్ మాళ్లు వంటివి చూస్తే ఎవ‌రైనా ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. అక్క‌డ నిర్మాణ నిబంధ‌న‌ల్ని ప‌క్కాగా పాటిస్తూ.. హండ్రెడ్ ప‌ర్సంట్ నాణ్య‌త మీద ఫోక‌స్ పెట్టాల్సిందే. ఆ రెండింటి మీద ఫోక‌స్ పెట్ట‌డం వ‌ల్లే.. దుబాయ్ వంటి అంత‌ర్జాతీయ న‌గ‌రంలో సుమారు ఇర‌వై ఎనిమిదికి పైగా ల్యాండ్ మార్క్ ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణ ప‌నులు మ‌రియు ఇంటీరియ‌ర్ ఫిట‌వుట్స్ ప‌నుల్ని విజ‌య‌వంతంగా పూర్తి చేసింది. డ‌ల్లాస్‌లోనూ సుమారు మూడు ప్రాజెక్టుల కంట్రాక్ట్ ప‌నుల్ని చేప‌ట్టింది. అంతర్జాతీయ స్థాయి నిర్మాణాల్లో ఘ‌న‌మైన ట్రాక్ రికార్డు గ‌ల అన్వితా గ్రూప్‌.. హైద‌రాబాద్‌లోకి ప్ర‌వేశించి.. కొల్లూరులో అన్వితా ఇవానా అనే ల‌గ్జ‌రీ గేటెడ్ క‌మ్యూనిటీని ఆరంభించింది.

భాగ్య‌న‌గ‌రం గ్లోబ‌ల్ డెస్టినేష‌న్‌గా అవ‌త‌రిస్తోంది. అందుకే అధిక శాతం మంది హోమ్ బ‌య్య‌ర్లు అంత‌ర్జాతీయ ప్ర‌మాణాలు క‌లిగి ఉండే ప్రాజెక్టుల్ని కోరుకుంటున్నారు. మ‌రి, ప‌శ్చిమ హైద‌రాబాద్‌లో ప్ర‌పంచ స్థాయి ల‌గ్జ‌రీ స‌దుపాయాలు ఉండాల‌ని కోరుకునేవారి కోసం రూపుదిద్దుకుంటున్న ప్రాజెక్టే.. అన్వితా వివానా. గ‌చ్చిబౌలి విప్రో స‌ర్కిల్ నుంచి కేవ‌లం ఇర‌వై నిమిషాల వ్య‌వ‌ధిలో.. కొల్లూరు ఔట‌ర్ రింగ్ రోడ్డు ఫేసింగ్‌లో ఆరంభించారు. సుమారు మూడున్న‌ర ఎక‌రాల్లో ప‌దిహేను అంత‌స్తుల్లో రెండు ట‌వ‌ర్ల నిర్మాణం జోరుగా జ‌రుగుతోంది. సెకండ్ ఫేజులోనూ 13 ఎక‌రా్ల్లో 36 అంత‌స్తుల ఎత్తులో ఆరు ట‌వ‌ర్ల‌ను నిర్మించేందుకు ప్ర‌ణాళిక‌ల్ని ర‌చించింది.
ఇందులో వ‌చ్చేవి మొత్తం 390 ఫ్లాట్లు. ప‌ద్నాలుగు మ‌రియు ప‌దిహేనో అంత‌స్తులో.. దాదాపు ముప్ప‌య్ ఊబ‌ర్ ల‌గ్జ‌రీ స్కై విల్లాల‌ను డిజైన్ చేశారు. ఫోర్ బెడ్రూమ్ ఫ్లాట్ల‌తో పాటు హోమ్ థియేట‌ర్‌ను కూడా ఇందులో డిజైన్ చేశారు. రెండు ఫేజుల్లో క‌లిపి సుమారు ల‌క్ష చ‌ద‌ర‌పు అడుగుల్లో క్ల‌బ్ హౌజ్‌ను డెవ‌ల‌ప్ చేస్తున్నారు. టెర్ర‌స్ గార్డెన్‌ను న‌ల‌భై నాలుగు వేల చ‌ద‌ర‌పు అడుగుల్లో నిర్మిస్తున్నారు. రెండు ఫేజుల్లో క‌లిపి దాదాపు ప‌ద్దెనిమిది వంద‌ల ఫ్లాట్ల‌ను అన్వితా సంస్థ డెవ‌ల‌ప్ చేస్తోంది.

టెర్ర‌స్ ప్లే గ్రౌండ్‌

హైద‌రాబాద్లో అనేక మంది డెవ‌ల‌ప‌ర్లు కేవ‌లం గ్రౌండ్ లెవెల్లోనే డెవ‌ల‌ప్ చేయ‌డానికి దృష్టి పెడుతుంటారు. కానీ, అన్వితా గ్రూప్ మాత్రం.. అంత‌ర్జాతీయ స్థాయిలో ఆలోచించి.. టెర్ర‌స్‌లోనూ ఇళ్ల కొనుగోలుదారులు స‌రికొత్త జీవితాన్ని ఆస్వాదించే రీతిలో ముస్తాబు చేస్తోంది. ఈ ప్రాంతాన్ని ఒక ప్లే గ్రౌండ్ అన్న‌ట్లుగా డెవ‌ల‌ప్ చేస్తుంది. టెర్ర‌స్‌లో ఆక‌ర్ష‌ణీయ‌మైన రీతిలో ల్యాండ్ స్కేపుల‌ను, సీటింగ్ ఏరియాల‌ను తీర్చిదిద్దుతుంది. అక్క‌డే ప‌ర్గోలాకు ఏర్పాటు చేసి.. చిన్నారులు, మ‌హిళ‌లు, వృద్ధులు, యువ‌త‌.. ఇలా ప్ర‌తిఒక్క‌రూ.. మునుపెన్న‌డూ లేనిరీతిలో ఆస్వాదించే విధంగా డెవ‌ల‌ప్ చేస్తుంది. మొత్తానికి, హైద‌రాబాద్‌లో స‌రికొత్త రీతిలో జీవ‌నాన్ని ఆస్వాదించాల‌ని భావించేవారికి… కొల్లూరులో అన్వితా గ్రూప్ డెవ‌ల‌ప్ చేస్తున్న అన్వితా ఇవానా ప్రాజెక్టు ఒక చ‌క్క‌టి ఆప్ష‌న్ అని చెప్పొచ్చు. మ‌రెందుకు ఆల‌స్యం, వెంట‌నే మీ కారును బ‌య‌టికి తీసి.. మీ పిల్లాపాప‌ల‌తో ఒక‌సారి ఈ ప్రాజెక్టును విజిట్ చేయండి. మేం చెప్పేది నిజ‌మేన‌ని మీరే అంగీక‌రిస్తారు.

ఆక‌ర్ష‌ణీయం.. అన్వితా ఇవానా

  • అన్వితా వివానా ప్రాజెక్టు నుంచి కేవ‌లం ఒక్క నిమిషంలో ఓఆర్ఆర్ ఎగ్జిట్‌2 కి చేరుకోవ‌చ్చు.
  • ఐదంటే ఐదే నిమిషాల్లో నియోపోలిస్‌కు వెళ్లొచ్చు
  • కేవ‌లం ఎనిమిది నిమిషాల్లో ఎగ్జిట్ వ‌న్‌కు వెళ్లిపోవ‌చ్చు.
  • ఓఆర్ఆర్ స‌ర్వీస్ రోడ్డులో వ‌ర‌ల్డ్ క్లాస్ సోలార్ రూఫ్‌టాప్ సైకిల్ ట్రాక్‌ను కొల్లూరు వ‌ర‌కూ డెవ‌ల‌ప్ చేస్తున్నారు

This website uses cookies.