Categories: LATEST UPDATES

మై హోమ్ తర్క్ష్యకు క్యూసీఐ అవార్డు..

క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతిఏటా క్వాలిటీ అవార్డులను అందజేస్తుంది. ఇటీవల ప్రకటించిన 14వ క్యూసీఐ-డీఎల్ షా క్వాలిటీ ప్లాటినం అవార్డు మై హోమ్ తర్క్ష్యకు లభించింది. సంస్థ తరఫున రవి సాయి, పురుషోత్తం, నాగ్రెడయ్యా ఈ అవార్డును అందుకున్నారు.

కేంద్ర వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని అపెక్స్ అటానమస్ క్వాలిటీ బాడీ అయిన “క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా” ద్వారా ఈ అవార్డును అందజేస్తారు. మై హోమ్ కన్‌స్ట్రక్షన్ మూడు దశాబ్దాలకు పైగా గృహాలను నిర్మిస్తోంది. కొనుగోలుదారుల అంచనాల్ని అందుకోవడం ద్వారా హైదరాబాద్ రియల్ రంగంలో అగ్రగామిగా ఉండేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తోంది. నాణ్యత, విశ్వసనీయత మరియు సమగ్రత అనే మూడు మంత్రాల్ని సంస్థ పాటిస్తుంది. అందుకే, తాజా అవార్డును అందుకున్నది.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పియూష్ గోయల్ మాట్లాడుతూ.. మన దేశంలో చాలా పండుగలు ఉన్నప్పటికీ, నాణ్యమైన పండుగను జరుపుకోవడం కంటే గొప్ప పండుగ మరొకటి లేదని తాను నమ్ముతున్నానని తెలిపారు. దేశం స్థిరమైన భవిష్యత్తు వైపు చూస్తున్నప్పుడు, నాణ్యత మనకు చాలా సహాయపడుతుందని అభిప్రాయపడ్డారు. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ ఇనిషియేటివ్‌లో క్వాలిటీ కౌన్సిల్ ముఖ్యమైన పాత్ర పోషించిందని ప్రశంసించారు. దేశంలోని మారుమూల ప్రాంతాలకు నాణ్యత విలువను పరిచయం చేయడానికి సహాయం చేస్తున్నారని తెలిపారు.

This website uses cookies.