radhe sky at kollur hyderabad
రాధే స్కై @ కొల్లూరు
అది కేవలం ఒక అపార్టుమెంట్ కాంప్లెక్స్ మాత్రమే కాదు… సంతోషకరమైన కుటుంబాలు, చిన్నారులు, అత్యున్నత నివాసం కోసం యాభై ఎకరాల్లో రూపుదిద్దుకుంటున్న ఒక మహత్తరమైన ప్రాజెక్టు అని చెప్పాలి. హైదరాబాద్‌లోనే మొట్టమొదటిసారిగా కిడ్స్ సెంట్రిక్ గేటెడ్ కమ్యూనిటీ ఇదేనని చెప్పొచ్చు. చిన్నారుల కళలు, డ్యాన్సులను ప్రోత్సహించడం కోసం ప్రత్యేకంగా హబీ రూముల్ని ఏర్పాటు చేయడంతో పాటు ఔట్ డోర్ ప్లే ఏరియాలు, సురక్షితమైన వాతావరణం వంటివి అందజేస్తున్నారీ ప్రాజెక్టులో. అందుకే, వారి బాల్యమంతా ఆనందంగా, ఆహ్లాదకరంగా గడుస్తుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి సూపర్ ప్రాజెక్టును నిర్మిస్తుంది మరెవరో కాదు.. హైదరాబాద్ నిర్మాణ రంగంలో సుమారు ఇరవై ఐదేళ్ల అనుభవం గల రాధే కన్‌స్ట్రక్షన్స్ సంస్థ. ఇలాంటి ప్రతిష్థాత్మకమైన ప్రాజెక్టు అయిన రాధే స్కైను నిర్మించేందుకు రాధే కన్‌స్ట్రక్షన్స్ కొల్లూరు ప్రాంతాన్ని ఎంచుకుంది. మరి, రాధే స్కైను మీరు ఎందుకు ఎంచుకోవాలో పది కీలకమైన అంశాల్ని మీకు వివరిస్తాను. ఆతర్వాత మీరే తుది నిర్ణయాన్ని తీసుకోవచ్చు.
1) ప్రముఖ నిర్మాణ సంస్థ రాధే కన్ స్ట్రక్షన్స్ కు చెందిన క్లౌడ్స్ ఉడ్ కన్ష్ స్ట్రక్షన్స్ హైదరాబాద్ లో తొలి కిడ్ వెంచర్ ప్రాజెక్టు లాంచ్ చేసింది. కొల్లూరు వద్ద ఈ హైరైజ్ ప్రాజెక్టు చేపట్టింది. దాదాపు పది ఎకరాల స్థలంలో ఏడు టవర్లను నిర్మిస్తోంది. ఒక్కో టవర్ ఎత్తు 23 అంతస్తులు. మొత్తం వచ్చే ఫ్లాట్ల సంఖ్య.. సుమారు 1419. ఫ్లాట్ల విస్తీర్ణం విషయానికి వస్తే.. సుమారు 1325 నుంచి 2610 చదరపు అడుగుల్లో లభిస్తాయి. ఇందులో వచ్చేవి 2, 3, 3.5 బెడ్‌రూమ్ ఫ్లాట్లు వస్తాయి.
ప్రతి చిన్నారిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. అది డ్యాన్స్ కావొచ్చు. మ్యూజిక్ కావొచ్చు లేదా ఏదైనా స్పోర్ట్ అవ్వొచ్చు. చిత్రకళల మీద ఆసక్తి ఉండొచ్చు. ఈ ప్రాజెక్టులో నివసించే వారి చిన్నారుల్లో దాగి ఉన్న కళలను బాల్యదశ నుంచి ప్రోత్సహించేందుకు అవసరమయ్యే సమస్త సదుపాయాలు, సౌకర్యాలు రాధే స్కై ప్రాజెక్టులో పొందుపరుస్తున్నారు. అందుకే ఈ ప్రాజెక్టును చిన్నారుల కోసం డిజైన్ చేసిన వెరీ స్పెషల్ ప్రాజెక్టు అని చెప్పొచ్చు. తల్లిదండ్రులు, పిల్లలు, కుటుంబాలకు భావోద్వేగ ఆకర్షణ కలిగి ఉన్న ప్రాజెక్టు.
2) ప్రీమియం లైఫ్ స్టైల్ సౌకర్యాలతో 50,000+ చదరపు అడుగుల క్లబ్‌హౌస్ కొల్లూరు ప్రాంతంలో అతిపెద్ద వాటిలో ఒకటి. బాంకెట్ హాళ్లు, ఇండోర్ గేమ్‌లు, జిమ్, యోగా, రీడింగ్ లాంజ్‌లు ఎన్నో ఇందులో ఉన్నాయి. ప్రీమియం అనుభూతి, ఉన్నత స్థాయి కమ్యూనిటీ జీవితాన్ని కోరుకునే కొనుగోలుదారులకు ఇది సరైన ఎంపిక.
3) లొకేషన్ పరంగా కూడా ఇది వ్యూహాత్మక స్థానంలో ఉంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలికి చాలా సమీపంలో వెలిమల ఉంటుంది. అంతేకాకుండా సమష్టి ఇంటర్నేషనల్, బిర్లా ఓపెన్ మైండ్స్ వంటి ప్రముఖ విద్యాసంస్థలు, పలు ఆసుపత్రులు, ఐటీ హబ్ లకు దగ్గరగా ఉంది. ఐటీ నిపుణులు, పెట్టుబడిదారులకు ఈ ప్రాజెక్టు చక్కగా సరిపోతుంది.
4) వాస్తు సూత్రాలకు అనుగుణంగా విశాలమైన స్థలంలో ఫ్లాట్లు కావాలని కోరుకునేవారికి చక్కగా నప్పుతుంది. గాలీ, వెలుతురు ధారాళంగా ప్రసరిస్తుంది. పెద్ద కుటుంబాలకు, కాంపాక్ట్ ఇళ్ల నుంచి అప్ గ్రేడ్ అయ్యేవాళ్లకు సరిగ్గా సరిపోతుంది.
5) వేగంగా పట్టణీకరణ చెందుతున్న కొల్లూరులో పచ్చని వాతావరణంలో ప్రశాంతమైన ప్రదేశం ఇది. హైటెక్ సిటీ లేదా మాదాపూర్‌తో పోలిస్తే తక్కువ కాలుష్య జోన్. రద్దీగా ఉండే నగర కేంద్రాలకు “ప్రశాంతమైన లగ్జరీ” ప్రత్యామ్నాయ స్థానం.
6) రాధే స్కై నివాసితులకు భద్రతకు పెద్దపీట వేస్తుంది. సెక్యూరిటీ విషయంలో రాజీపడే ప్రసక్తే లేని ప్రాజెక్టు ఇది. 24/7 భద్రత, గేటెడ్ యాక్సెస్, సీసీటీవీల ఏర్పాటు, స్మార్ట్ ఇంటర్‌కామ్ వ్యవస్థలు మరింత భద్రతకు భరోసా ఇస్తాయి.
7) బిల్డర్ విషయానికి వస్తే.. రాధే కన్ స్ట్రక్షన్స్ కి 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. హైదరాబాద్ లో ఎన్నో బహుళ ప్రీమియం గేటెడ్ ప్రాజెక్టులను విజయవంతంగా డెలివరీ చేసిన ట్రాక్ రికార్డు ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఉన్నతమైన జీవనం కోరుకునేవారు రాధే స్కైని ఎంచుకోవాల్సిందే.
8) టీజీ రెరా అనుమతి గల ప్రాజెక్టు కావడం వల్ల 2026 జూన్‌లోపు ఈ ప్రాజెక్టును హ్యాండోవర్ చేస్తారు. నిర్మాణం ఆలస్యం అవుతుందని చింతించాల్సిన అవసరమే లేదు.
9) ప్రతి టవర్ 23 అంతస్తుల ఎత్తులో ఉండటం వల్ల చుటుపక్కల ప్రాంతాలు చూడచక్కగా కనిపిస్తాయి. గాలీవెలుతురు ధారాళంగా ప్రసరిస్తుంది. ప్రతిక్షణాన్ని ఆస్వాదించేందుకు వీలు కలుగుతుంది. అత్యున్నత ప్రాజెక్టులో నివసించాలని కోరుకునేవారికి ఈ ప్రాజెక్టు ఒక చక్కటి ఆప్షన్ అని చెప్పొచ్చు.
10) రాధే స్కై ప్రాజెక్టు గ్రోత్ కారిడార్‌లో ఉంది. పైగా, కొల్లూరు అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. ఇక్కడ్నుంచి మెరుగైన ఓఆర్ఆర్ కనెక్టివిటీ ఉంది. ఎంఎంటీఎస్ విస్తరణ, మెట్రో రైలు ప్రణాళికలు, మరిన్ని అంతర్జాతీయ స్కూళ్లు వంటివి ఏర్పాటయ్యే అవకాశముంది. కాబట్టి, ఫ్లాట్లు కొన్నవారికి మంచి అప్రిసీయేషన్ ఉంటుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఇందులో కొంటే అద్దెలు బాగానే గిట్టుబాటు అవుతుంది.
కాల్: 91 00 525252
This website uses cookies.