Categories: TOP STORIES

West Brook సైబర్ సిటీ వెస్ట్ బ్రూక్.. బెస్ట్ ఎందుకంటే?

హైద‌రాబాద్‌లో కోకాపేట్‌ను మించిన హాట్ లొకేష‌న్ లేద‌ని ప్ర‌తిఒక్క‌రికీ తెలిసిందే. ఈ ప్రాంతం భ‌విష్య‌త్తులో అంత‌ర్జాతీయ న‌గ‌రానికి ఏమాత్రం తీసిపోని విధంగా క‌ళ‌క‌ళ‌లాడుతుంద‌నే విష‌యాన్ని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎందుకంటే, ఈ లొకేష‌న్ ప్ర‌త్యేక‌తే వేర‌ని చెప్పొచ్చు. ఇలాంటి ఫ్యూచ‌రిస్టిక్ లొకేష‌న్‌లో.. ఒక స్ట‌న్నింగ్ ప్రాజెక్టును ఆరంభించిన ఘ‌న‌త సైబ‌ర్‌సిటీ డెవ‌ల‌ప‌ర్స్‌కే ద‌క్కుతుంది.

కోకాపేట్‌లోని ఓఆర్ఆర్ స‌ర్వీస్ రోడ్డుకు ఆనుకుని సైబ‌ర్‌సిటీ డెవ‌ల‌ప‌ర్స్ డెవ‌ల‌ప్ చేస్తున్న ప్రాజెక్టే.. సైబ‌ర్‌సిటీ వెస్ట్ బ్రూక్‌. నిర్మాణ ప‌నులు జోరుగా జ‌రుగుతున్న ఈ ప్రాజెక్టులో ఫ్లాట్ల‌ను ఎంచుకోవ‌డానికి గ‌ల ప‌ది కార‌ణాల్ని రియ‌ల్ ఎస్టేట్ గురు ప్ర‌త్యేకంగా విశ్లేషిస్తోంది. మ‌రి, అవేమిటో చూస్తే.. మీరు కూడా ఇందులో ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న టూ బెడ్‌రూమ్ ఫ్లాట్ల‌ను ఎంచ‌క్కా కొనుగోలు చేస్తార‌నే విష‌యంలో ఎలాంటి సందేహం లేదు. మ‌రి, మీరు గ‌మ‌నించాల్సిన ప‌ది అంశాలు మీ కోసం..

కోకాపేట్‌లో ప్రైమ్ లొకేషన్..
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ నుంచి కేవలం 300 మీటర్ల దూరంలో ఉన్న సైబ‌ర్‌సిటీ వెస్ట్ బ్రూక్.. గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ వంటి ప్రధాన ఐటీ హబ్‌లకు అద్భుతమైన కనెక్టివిటీని కలిగి ఉంది. అంతేకాదు..  రాజీవ్ గాంధీ ఇంట‌ర్నేష‌న్ ఎయిర్‌పోర్టు, ప్ర‌తిపాదిత హైద‌రాబాద్ మెట్రో రైల్వే లైన్‌ల‌కు ఇక్క‌డ్నుంచి సుల‌భంగా చేరుకోవ‌చ్చు. కోకాపేటలోని ప్రధాన ఐటీ పార్కులు ఇక్క‌డ్నుంచి ప‌క్క‌నే ఉంటాయి.

విస్తారమైన ఓపెన్ స్పేస్‌
సైబ‌ర్‌సిటీ వెస్ట్ బ్రూక్ ప్రాజెక్టును 82 శాతం ఓపెన్ స్పేస్‌తో రూపొందించారు. ఇందులో నివ‌సించేవారికి తగినంత పచ్చదనం, ప్రశాంతమైన వాతావరణాన్ని అందించే విధంగా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. దీని వ‌ల్ల ఇందులో మెరుగైన జీవన నాణ్యత ఉంటుంది.

ఐజీబీసీ ప్రీ-సర్టిఫైడ్ గ్రీన్ బిల్డింగ్..
సైబ‌ర్‌సిటీ డెవ‌ల‌ప‌ర్స్ ప్ర‌త్యేక‌త ఏమిటంటే.. ఏ ప్రాజెక్టు అయినా హ‌రిత సూత్రాల‌కు అనుగుణంగా డిజైన్ చేస్తుంది. సైబ‌ర్ సిటీ వెస్ట్ బ్రూక్ అనేది ఐజీబీసీ ప్రీ-సర్టిఫైడ్ గ్రీన్ బిల్డింగ్. స్థిరమైన నిర్మాణ పద్ధతులు అవలంభించడం వల్ల ఆరోగ్యకరమైన జీవన వాతావరణాన్ని అందిస్తుంది.

ఆర్కిటెక్చరల్ ఎక్సలెన్స్
దేశంలోనే టాప్ ఆర్కిటెక్ట్ అయిన హ‌ఫీజ్ కాంట్రాక్ట‌ర్ డిజైన్ చేసిన ప్రాజెక్టే.. సైబ‌ర్‌సిటీ వెస్ట్‌బ్రూక్‌. అందుకే, ఈ ప్రాజెక్టు ఆధునిక సౌందర్యం, క్రియాత్మక లేఅవుట్‌ను క‌లిగి ఉంటుంది. అటు శైలి, ఇటు సౌకర్యం రెండింటినీ సమ్మేళనంగా ఆకట్టుకుంటుంది.

సమగ్ర సౌకర్యాలు
క్లబ్‌హౌస్, స్విమ్మింగ్ పూల్, జిమ్నాజియం, స్పా, సెలూన్, బార్బీక్యూ ఏరియా,టెర్రస్ గార్డెన్, బ్యాడ్మింటన్, టెన్నిస్, స్క్వాష్ కోర్టులు వంటి వివిధ క్రీడా సౌకర్యాలతో సహా విస్తృత శ్రేణి ఆధునిక సౌకర్యాలను ఇందులో ఫ్లాట్ల‌ను కొనుక్కున్న‌వారు ఆస్వాదించొచ్చు.

కోకాపేట్ లేక్‌ సమీపంలో..
సైబ‌ర్‌సిటీ వెస్ట్ బ్రూక్ ప్రాజెక్టు కోకాపేట చెరువుకు సమీపంలో ఉండటం వల్ల ప్రకృతిపరంగా సుందరమైన దృశ్యాలను ఆస్వాదించడానికి, చక్కని వాతావరణంలో సేద తీరడానికి అనువుగా ఉంటుంది.ప్రశాంతమైన జీవన అనుభవానికి దోహదం చేస్తుంది.

జి ప్ల‌స్ 35 అంత‌స్తుల్లో క‌డుతున్న ఈ ప్రాజెక్టులో ఫ్లాట్‌ను కొనుగోలు చేస్తే.. మీరు హైరైజ్ లివింగ్‌ను ఆస్వాదించొచ్చు. పైగా, చుట్టుప‌క్క‌ల గ‌ల ప్ర‌కృతి దృశ్యాలు, హైద‌రాబాద్ స్కైలైన్‌ను మీరు క‌ళ్లారా వీక్షించొచ్చు. గొప్ప విష‌యం ఏమిటంటే.. ఇందులో టూ బీహెచ్‌కే ఫ్లాట్లు అందుబాటులో ఉండ‌ట‌మే.

స్మార్ట్ హోమ్‌కు సంబంధించిన స‌మ‌స్త ఫీచ‌ర్ల‌ను ఈ ప్రాజెక్టులో నివ‌సించేవారికి సైబ‌ర్‌సిటీ డెవ‌ల‌ప‌ర్స్ అంద‌జేసింది. కాబ‌ట్టి, భ‌ద్ర‌త గురించి చింతించ‌క్క‌ర్లేదు. కోకాపేట్‌లో ఆకాశ‌హ‌ర్మ్యం ఉండ‌టం వ‌ల్ల ఇక్క‌డి చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లో పేరెన్నిక‌గ‌ల విద్యాసంస్థ‌ల‌కు కొద‌వే లేదు. పైగా, అత్య‌వ‌స‌రాల్లో ఆస్ప‌త్రులు కూడా చేరువ‌లోనే ఉన్నాయి.

అన్నింటి కంటే చివ‌ర‌గా, సైబ‌ర్ సిటీ డెవ‌ల‌ప‌ర్స్ గురించి ప్ర‌ముఖంగా చెప్పాలి. ఈ సంస్థ నాణ్య‌మైన నిర్మాణాల‌కు, స‌మ‌యానికి డెలివ‌రి అంద‌జేయ‌డంలో పేరు సంపాదించింది. కాబ‌ట్టి, స్థిర నివాసమైనా, ఇన్వెస్ట్‌మెంట్ అయినా.. ఇందులో కొనుగోలు చేస్తే ఎలాంటి చీకూచింతా లేకుండా ప్ర‌శాంతంగా ఉండొచ్చ‌ని గుర్తుంచుకోండి.

కాల్‌: 8374 626262

This website uses cookies.