అమరావతికి కొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు కేంద్రం అంగీకరించడంతో రియల్ రంగంలో సరికొత్త జోష్ ఏర్పడింది. స్టేషన్లు వచ్చే ప్రాంతానికి చుట్టుపక్కల స్థలాల్లో.. వాణిజ్య సముదాయాలతో పాటు నివాస గృహాలు పెరగడానికి ఆస్కారముందని స్థానిక రియల్టర్లు అంటున్నారు. అమరావతి మీదుగా ఎర్రుపాలెం-నంబూరు మధ్య రూ.2,245 కోట్ల అంచనా వ్యయంతో.. 57 కిలోమీటర్ల మేర కొత్త లైనును నాలుగేళ్లలో పూర్తి చేస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 19 లక్షల పనిదినాల ప్రత్యక్ష ఉపాధిని సృష్టిస్తుందని రైల్వే శాఖ చెబుతోంది.
ఈ కొత్త రైలు మార్గం ఏపీలోని ఎర్రుపాలెం- అమరావతి- నంబూరు మీదుగా విజయవాడ, గుంటూరు, ఖమ్మం, హైదరాబాద్ వరకూ కనెక్టివిటీ ఉంటుంది. అదేవిధంగా, అటు చెన్నై ఇటు కోల్‌కతా వరకూ ఈ ప్రయాణం చేసే వీలు కలుగుతుంది. అమరలింగేశ్వర స్వామి దేవాలయం, అమరావతి స్థూపం , ధ్యాన బుద్ధ విగ్రహం మరియు ఉండవల్లి గుహలు వంటి మతపరమైన ప్రదేశాలకు ప్రవేశం కల్పిస్తుంది. మచిలీపట్నం ఓడరేవు, కృష్ణపట్నం ఓడరేవు మరియు కాకినాడ పోర్టులకు అనుసంధానాన్ని మెరుగుపరుస్తుంది . కృష్ణా నదిపై 3.2 కిలోమీటర్ల పొడవున వంతెన నిర్మిస్తారు.
This website uses cookies.