హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రస్తుతం నిలకడగా కొనసాగుతోంది. ఏడాది కాలంగా గ్రేటర్ నిర్మాణరంగం స్తబ్దుగా ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి. హైదరాబాద్ లో ఇళ్ల అమ్మకాలు ఒక్కసారిగా పడిపోకపోయినా.. గతంలోలా మాత్రం అమ్మకాలు లేవని లెక్కలు చెబుతున్నాయి. అయితే ఇదే సమయంలో స్టీల్, సిమెంట్ తదితర నిర్మాణ సామగ్రి రేట్లు, భూముల ధరలు పెరుగుతుండటంతో ఇళ్ల ధరలు పెరిగే ఛాన్స్ ఉందని రియల్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఇళ్ల ధరలు కాస్త నిలకడగా ఉన్నప్పటికీ ముందు ముందు పెరిగే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు.
ALSO READ: 5 ఏళ్లలో 30 శాతం పెరిగిన నిర్మాణ వ్యయం
హైదరాబాద్ లో ప్రాంతాన్ని, ప్రాజెక్టుని బట్టి ఇళ్ల ధరల్లో భారీ వ్యత్యాసం ఉంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి సెలబ్రిటీలు, ఉన్నత వర్గాలు ఉండే ప్రాంతాల్లో ఫ్లాట్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో కొత్త ప్రాజెక్టులు, గృహాల సరఫరా తక్కువగా ఉంటుంది. కొండాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి పశ్చిమ హైదరాబాద్‌లో అంతర్జాతీయ మౌలిక వసతులు, హైరైజ్ ప్రాజెక్ట్ లతో ఫ్లాట్ల ధరలు ఎక్కువ పలుకుతున్నాయి.
దీనికి అనుగునంగా మారుతున్న కాలం, పెరుగుతున్న అవసరాల మేరకు విశాలమైన అపార్ట్‌మెంట్లు, హైరైజ్ ప్రాజెక్ట్‌లకు డిమాండ్ పెరిగింది. దీంతో బిల్డర్లు హైరైజ్ ప్రాజెక్ట్‌లలో స్విమ్మింగ్ పూల్, జిమ్, వాకింగ్, జాగింగ్ ట్రాక్స్ వంటి ఆధునిక వసతులను కల్పిస్తున్నారు.
హైదరాబాద్ లో భారీ డిమాండ్ ఉన్న కోకాపేట, నార్సింగి, పుప్పాలగూడ, నానక్‌రాంగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాల్లో లగ్జరీ ప్రాజెక్టులు వస్తున్నాయి. వీటి పరిధిలో చదరపు అడుగుకు 10 వేల రూపాయల నుంచి 16 వేలకు పైగానే ధరలు ఉంటున్నాయి. హైదరాబాద్ లో ఏయే ప్రాంతాల్లో ఇళ్ల ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం…
నగరంలోని పలు ప్రాంతాల్లో అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ల ధరలు
నార్సింగి
8,000 నుంచి 12,000
కొండాపూర్
7,500 నుంచి 11,000
ఖాజాగూడ
7,500 నుంచి 12,000
మణికొండ
8,000 నుంచి 10,000
నానక్ రాంగూడ
9,000 నుంచి 14,000
మాదాపూర్
10,000 నుంచి 15,000
కోకాపేట్
11,000 నుంచి 15,000
జూబ్లీహిల్స్
12,000 నుంచి 15,000
బంజారాహిల్స్
12,000 నుంచి 15,000
హైటెక్ సిటీ
12,000 నుంచి 16,000
సోమాజిగూడ
12,000 నుంచి 14,000
బండ్లగూడ జాగీర్
4,500 నుంచి 5,000
అత్తాపూర్
4,800 నుంచి 7,000
ఉప్పల్
5200 నుంచి 7,000
ప్రగతినగర్
5,400 నుంచి 8,000
మియాపూర్
7,200 నుంచి 10,000
కూకట్ పల్లి
7,500 నుంచి 11,000
పటాన్ చెరు
5,200 నుంచి 6,500
ఎల్బీనగర్
5,800 నుంచి 8,500
షామీర్ పేట్
5,300 నుంచి 7,000
మేడ్చల్
4,800 నుంచి 6,000