రియల్ ఎస్టేట్ గురు (రెజ్ టీవీ) కొత్త సంవత్సరం క్యాలెండర్‌కు సర్వత్రా ప్రశంసలు లభించాయి. నగరానికి చెందిన పన్నెండు సంస్థలు ఒకతాటిపైకి తీసుకొచ్చి.. ఇలా క్యాలెండర్ రూపంలో ముద్రించడాన్ని టాప్ డెవలపర్లు హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి అనేక వినూత్న పోకడలకు రియల్ ఎస్టేట్ గురు శ్రీకారం చుట్టాలని ఆకాంక్షించారు. రియల్ ఎస్టేట్ గురు క్యాలెండర్ డిజైన్‌తో పాటు నాణ్యత కూడా మెరుగ్గా ఉందని ప్రశంసించారు. మైహోమ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్‌రెడ్డి, రాజపుష్ప ప్రాపర్టీస్ ఈడీ శ్రీనివాస్రెడ్డి, జీహెచ్ఆర్ కలిస్టో ఎండీ శ్యాంసుందర్‌రెడ్డి, ప్రత్యూష డెవలపర్స్ ఎండీ రవీందర్‌రెడ్డి, రఘురాం ఇన్‌ఫ్రా డైరెక్టర్ అరవింద్, సాస్ ఇన్‌ఫ్రా ఛైర్మన్ జీవీ రావు తదితరులు రియల్ ఎస్టేట్ గురు క్యాలెండర్ పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
This website uses cookies.