Remove TG RERA Chairman Satyanarayana
తెలంగాణ రెరా కమిటీ ఛైర్మన్ డా.ఎన్ సత్యనారాయణతో పాటు ఇతర సభ్యులను వెంటనే తొలిగించాలని కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు డా. లుబ్నా సర్వతి డిమాండ్ చేశారు. రెరా చట్టం 2016 ప్రకారం వారి నియామకం చెల్లదని.. చట్టం ప్రకారం నియామకాలు చేయాలని సూచిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాల్ని ఆమె ప్రస్తావించారు. 2016 రెరా చట్టం నిబంధనలు పాటించకుండా అప్పుడు రెరా ఛైర్మన్ సత్యనారాయణ, రెరా సభ్యులు లక్ష్మీ నారాయణ, శ్రీనివాసరావును నియమించారని లేఖలో పేర్కొన్నారు. ఎంపిక కమిటీకి సంబంధించిన విధి విధానాలు లేవని, అప్పటి ప్రభుత్వం చేసిన నియామకాలు అంతా తప్పు అని వివరించారు. ఇవన్నీ మోసపూరిత నియామకాలుగా గుర్తించాలని లేఖలో కోరారు. అంతేకాకుండా 2023, జూన్ నుంచి వారికి ఇస్తున్న వేతనాలను రికవరీ చేయాలని లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా రెరా నియామకానికి సంబంధించిన నిబంధనల పత్రాలను సీఎంకు పంపించారు. చైర్మన్‌తో పాటు ఇద్దరు సభ్యులను వెంటనే తొలిగించాలన్నారు. రిటైర్డ్ జడ్జి, సీఎస్ హోదాలో పని చేసి పదవీ విరమణ చేసి వారిని నియమించాల్సి ఉండగా.. కేవలం కలెక్ట్‌గా, కమిషనర్ గా పని చేసి రిటైరైన వారిని చైర్మన్‌గా నియమించడం నిబంధనలకు విరుద్ధమని లేఖలో ప్రస్తావించారు.
This website uses cookies.