Categories: LATEST UPDATES

ప్రాజెక్టుల గ్రేడింగ్ కు రెరా యోచన

కొనుగోలుదారులు ఓ ప్రాజెక్టులో ఇల్లు కొనాలో లేదో సరైన నిర్ణయం తీసుకునేందుకు వీలుగా ప్రాజెక్టులను గ్రేడింగ్ చేయాలని మహారాష్ట్ర రెరా యోచిస్తోంది. మహారాష్ట్రంలో 2023 జనవరి నుంచి రిజిస్టర్ అయిన అప్ని ప్రాజెక్టులకూ వచ్చేనెల నుంచి గ్రేడింగ్ ఇవ్వనున్నారు. గ్రేడింగ్ అయ్యే ప్రాజెక్టుల్లో అధిక భాగం ముంబైలోనే ఉంటాయని.. తర్వాత పుణె, నాగ్ పూర్ లలోని ప్రాజెక్టులకు గ్రేడింగ్ ఇస్తారని మహా రెరా అధికారులు తెలిపారు. నాలుగు ప్రమాణాల ఆధారంగా ఈ గ్రేడింగ్ ప్రక్రియ జరుగుతుంది. డెవలపర్లు రెరా సైట్ లో అప్ లోడ్ చేసిన సమాచారం ఆధారంగా సాంకేతిక, ఆర్థిక, చట్టపరమైన, ప్రాజెక్టు ఒవర్ వ్యూ అనే నాలుగు అంశాల ప్రాతిపదికగా ఈ గ్రేడింగ్ ఇస్తారు. ఈ గ్రేడింగ్ ను బట్టి కొనుగోలుదారులు ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కాగా, మహారాష్ట్రలో రెరా చట్టం అమల్లోకి వచ్చిన మే 2017 నుంచి ఇప్పటివరకు దాదాపు 44వేలకు పైగా ప్రాజెక్టులు రిజిస్టర్ అయ్యాయి. అందులో దాదాపు 14వేల ప్రాజెక్టులు పూర్తయ్యాయి.

This website uses cookies.