టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి గురుగ్రామ్ లో 12 ఆఫీస్ స్పేస్ లను అద్దెకు తీసుకున్నారు. గురుగ్రామ్ లోని సెక్టార్ 68లో రీచ్ కమర్సియా అనే కార్పొరేట్ టవర్ ప్రాజెక్టులో మొత్తం 18,430 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న 12 స్థలాలను ఆయన లీజుకు తీసుకున్నారు.. నెలకు రూ.8.85 లక్షల అద్దె చెల్లించాలే 9 ఏళ్ల కాలానికి ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. అద్దె ఒప్పందంలో భాగంగా 37 కారు పార్కింగులు కూడా ఉన్నాయి. ప్రారభం నెలవారీ అద్దె చదరపు అడుగుకు రూ.48 చొప్పున నిర్ణయించారు. లీజు డీడ్ లో ప్రతి ఏటా 5 శాతం అద్దె పెంపు నిబంధన పొందుపరిచారు. అలాగే నెలకు చదరపు అడుగుకు రూ.14 చొప్పున మెయింటనెన్స్ చెల్లించాల్సి ఉంటుంది. మైండ్ ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరు మీద జరిగిన ఈ లీజు ఒప్పందానికి కంపెనీ రూ.57.19 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించింది. కొహ్లి రిజిస్టర్డ్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్, ఆయన సోదరుడు వికాస్ కోహ్లి ద్వారా ఈ ఒప్పందం జరిగింది. కాగా, కోహ్లి ముంబై వర్లిలోని 4 బీహెచ్ కే అపార్ట్ మెంట్లో ఉంటున్నారు. సముద్రానికి ఎదురుగా ఉన్న 7,171 చదరపు అడుగుల ఈ అపార్ట్ మెంట్ ను 2016లో రూ.34 కోట్లకు కొనుగోలు చేసినట్టు సమాచారం.
This website uses cookies.