Categories: Celebrity Homes

అపార్ట్ మెంట్ అద్దెకు ఇచ్చిన రోహిత్ శర్మ తండ్రి..

ప్రముఖ క్రికెటర్ రోహిత్ శర్మ తండ్రి గురునాథ్ శర్మ ముంబైలోని లోయర్ పరేల్ ప్రాంతంలోని తమ అపార్ట్ మెంట్ ను అద్దెకు ఇచ్చారు. లోధా గ్రూప్ నిర్మించిన ది పార్క్ ప్రాజెక్టులోని ఓ భాగమైన లోధా మార్క్విస్ భవనంలోని 45వ అంతస్తులో ఉన్న ఈ ఫ్లాట్ విస్తీర్ణం 1,298 చదరపు అడుగులు. దీనిని నెలకు రూ.2.60 లక్షలకు అద్దెకు ఇచ్చారు. ఫ్లాట్ తోపాటు రెండు కార్ పార్కింగ్ స్థలాలు కూడా వస్తాయి. దీనికి సంబంధించిన అద్దె ఒప్పందం జనవరి 27న నమోదైంది. ఇందుకోసం స్టాంపు డ్యూటీ కింద రూ.16,300, రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.వెయ్యి చెల్లించారు.

మురళీకృష్ణన్ నాయర్ అనే వ్యక్తి దీనిని లీజుకు తీసుకున్నారు. కాగా, రోహిత్ శర్మ, ఆయన తండ్రి గురునాథ్ శర్మ 2013 జూలైలో లోధా గ్రూప్ నుంచి రూ.5.45 కోట్లకు ఈ అపార్ట్ మెంట్ కొనుగోలు చేశారు. కాగా, 2024 జనవరిలో రోహిత్ శర్మ ముంబైలోని బాంద్రా వెస్ట్ ఏరియాలోని రెండు అపార్ట్ మెంట్లను నెలకు రూ.3 లక్షల చొప్పున అద్దెకు ఇచ్చారు. ఒప్పందం ప్రకారం మొదటి సంవత్సరం నెలవారీ అద్దె రూ.3.1 లక్షలు, రెండవ సంవత్సరం రూ.3.25 లక్షలు, మూడో ఏడాది రూ. 3.41 లక్షలకు పెరుగుతుంది.

This website uses cookies.