Categories: TOP STORIES

లిక్కర్ స్కామ్ లో అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏడో నిందితుడిగా ఉన్న అరబిందో ఫార్మా డైరక్టర్ శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారు. ఈ మేరకు ఆయన చేసిన అభ్యర్థనకు సీబీఐ, ఈడీ కేసుల ప్రత్యేక కోర్టు అంగీకరించింది. ఈ కేసులో నిజానిజాలన్నీ స్వచ్ఛందంగా వెల్లడించడానికి తాను సిద్దంగా ఉన్నానని, అప్రూవర్ గా మారతానని శరత్ చంద్రారెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. దీనిని పరిశీలించిన న్యాయస్థానం ఆయనకు క్షమాభిక్ష ప్రసాదించి, అప్రూవర్ గా మారడానికి అనుమతించింది.

దీంతో ఇకపై ఆయన ఇచ్చే సమాచారం ఆధారంగా ఈ కేసు దర్యాప్తు సాగనుంది. శరత్ చంద్రారెడ్డికి అనారోగ్య కారణాలపై ఢిల్లీ హైకోర్టు ఇటీవల బెయిల్ మంజూరు చేసింది. మద్యం కుంభకోణంలో పలువురు వ్యాపారులు, రాజకీయ నాయకులతో శరత్ చంద్రారెడ్డి తెర వెనుక ఉండి అంతా నడిపించారని.. ఆప్ నేతలకు రూ.100 కోట్లు ఇచ్చి మద్యం విధానాన్ని తమకు అనుకూలంగా తయారు చేయించుకున్నారనేది ప్రధాన అభియోగం. ఈ వ్యవహారంలో మనీ ల్యాండరింగ్ జరిగిందని ఆరోపిస్తూ ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఢిల్లీ ఎక్సైజ్ స్కామ్ లో శరత్ కీలక వ్యక్తి అని, గతంలో దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది.

This website uses cookies.