ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ అనేది వివిధ కోణాల నుంచి ఆకర్షణీయంగా ఉంటోంది. వ్యక్తిగత ఉపయోగం కోసం లేదా లాభాలను ఆశించి పెట్టుబడి పెట్టడం ఇక్కడ జరుగుతుంది. రియల్ ఎస్టేట్ లో ప్రాపర్టీ కొనడం లేదా అమ్మడం అనేది ఒక సంక్లిష్టమైన నిర్ణయం. మానవ ప్రవర్తన, నిర్ణయాత్మక సామర్థ్యాల వంటి అనేక కోణాలు ఇందులో ఇమిడి ఉంటాయి. ఇది ప్రాపర్టీ భౌతిక లక్షాలను మాత్రమే కాకుండా భావోద్వేగాలు, సామాజిక స్థితి, భద్రత వంటి అంశాలను కూడా కలిగి ఉంటుంది. వ్యక్తులు నిర్ణయాలు తీసుకునే విభిన్న మార్గాలు, వారి ఎంపికలను ప్రభావితం చేసే వివిధ అంశాలు.. ఆస్తుల విలువ, డిమాండ్ ను నిర్ణయించడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. ఓ వ్యక్తి ఆస్తులను కొనుగోలు చేయడం లేదా విక్రయించడంపై ప్రభావం చూపించే విభిన్న కారకాలను అంచనా వేయడం చాలా సంక్లిష్టమైన ప్రక్రియ.
భావోద్వేగం అనేది ఇల్లు కొనుగోలు లేదా అమ్మకం నిర్ణయంపై చాలా ప్రభావం కలిగి ఉంటుంది. సంప్రదాయకంగా రియల్ ఎస్టేట్ నిర్ణయాల్లో భావోద్వేగం కీలక పాత్ర పోషిస్తుంది. కొన్నిసార్లు ఇది ఆస్తి ధరను పెంచే అవకాశం కూడా ఉంటుంది. ఓ ఇంటితో మానసికంగా అనుబంధం కలిగి ఉన్నప్పుడు దానిని విక్రయిస్తున్నవారు అధిక ధర నిర్ణయించొచ్చు. అలాగే తమ బాల్యాన్ని గుర్తుచేసే పొరుగున ఉన్న ఇంటికి ఎక్కువ ధర చెల్లించి సొంతం చేసుకోవడానికి సిద్ధంగా ఉండొచ్చు.
రియల్ ఎస్టేట్ రంగంలో మరో కీలకమైన అంశం సామాజిక పోకడలు. ప్రజలు తరచుగా తమ పొరుగున ఉన్నవారు ఏమి చేస్తున్నారో, వారి ప్రాపర్టీ విషయంలో ఎలా వ్యవహరిస్తున్నారో అనేది ఆధారం చేసుకుని వ్యవహరిస్తుంటారు. చాలామంది వ్యక్తులు ఒకే ఇంటిని కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, ఆ ప్రాపర్టీ అధిక ధరను కలిగి ఉన్నప్పుడు ఈ సామాజిక ప్రవర్తన దానిపై ప్రభావం చూపుతుంది. అలాగే ఒక ఇల్లు చాలాకాలం పాటు మార్కెట్లో అమ్మకానికి ఉన్నట్టయితే, అందులో ఏదో లోపం ఉందని భావిస్తారు. ఫలితంగా దాని ధర తగ్గుతుంది.
This website uses cookies.