రెజ్ న్యూస్, 23 జూన్: దక్షిణాదిలో పేరెన్నిక గల నిర్మాణ సంస్థ ఎస్‌ఎంఆర్ హోల్డింగ్స్.. కొండాపూర్‌లో కొత్తగా మూడు టవర్లను ప్రారంభించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మొదటి టవర్ హామిల్టన్ ఇప్పటికే 80 శాతం నిర్మాణం పూర్తయ్యింది. లోగన్ టవర్ అరవై శాతం, శివాలక్ టవర్ ముప్పయ్ శాతం పూర్తయ్యింది. కుటుంబాలు ఆనందంగా, ఆహ్లాదకరంగా నివసించడానికి అవసరమయ్యే విధంగా ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ గృహాల్ని నిర్మిస్తుందనే ఖ్యాతినార్జించింది. ఈ క్రమంలో కొండాపూర్‌లో సుమారు 22 ఎకరాల్లో పదకొండు టవర్లతో ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియాను నిర్మించింది. ఈ ప్రాజెక్టులో ఇప్పటికే రెండు దశలు పూర్తి కాగా అందులో సుమారు పదకొండు వందల ఫ్లాట్లను కొనుగోలుదారులకు అందజేశారు. అందులో సుమారు ఐదు వందలకు పైగా కుటుంబాలు ఇప్పటికే ఇందులోని ఆధునిక సదుపాయాల్ని ఆస్వాదిస్తున్నాయి. ఆకర్షణీయమైన ల్యాండ్‌స్కేప్‌తో పాటుగా దేవాలయం, ప్రత్యేకమైన క్లబ్ హౌస్‌లు, క్రీడా వసతులు మొదలైనవి అభివృద్ధి చేశారు. ఇందులో ఫ్లాట్ కొనేవారెవ్వరైనా.. అలా కొనగానే ఇలా ఇంటీరియర్స్ పనుల్ని పూర్తి చేసి గృహప్రవేశం చేయవచ్చు.
ఈ సందర్భంగా ఎస్‌ఎంఆర్ హోల్డింగ్స్ సీఎండీ ఎస్.రాంరెడ్డి మాట్లాడుతూ.. ‘‘భారతదేశ వ్యాప్తంగా నగరాలన్నీ కూడా హౌసింగ్, రెసిడెన్షియల్ ప్రోపర్టీ డిమాండ్‌ను చూస్తున్నాయి. మరీముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ప్రధాన నగరాలన్నింటిలోనూ ఈ డిమాండ్ అధికంగా కనిపిస్తుంది. భారతదేశంలో అత్యంత చురుకైన రియల్ ఎస్టేట్ మార్కెట్‌లలో రెండవదిగా హైదరాబాద్ మార్కెట్ నిలిచింది. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం గణనీయమైన వృద్ధిని నమోదుచేసింది. రాబోయే సంవత్సరాలలో ప్రతిష్టాత్మకమైన వృద్ధి ఇక్కడ జరుగనుందని అంచనా వేస్తున్నాం. ఎస్‌ఎంఆర్ హోల్డింగ్స్ వద్ద, మా వినియోగదారులకు అత్యుత్తమ జీవనం అందించేందుకు తగిన ఆవిష్కరణలను చేయడానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఎస్‌ఎంఆర్ వినయ్ ఐకానియాను ప్రకటిస్తుండటం పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. దీనికి పక్కనే సుప్రసిద్ధ సంస్థ నిర్వహణలో బొటిక్ హాల్, హాస్పిటల్ కూడా రానున్నాయి. ఇవి 1.5 లక్షల చదరపు అడుగల విస్తీర్ణంలో రానుండటం చేత కమ్యూనిటీకి అత్యంత సౌకర్యవంతంగా నిలుస్తాయి’’అని అన్నారు.