poulomi avante poulomi avante

అడ్వాన్స్ స్టేజీలో ఆవిష్క‌ర‌ణ‌!

  • న‌గ‌ర నిర్మాణ రంగంలో..
    ఎస్ఎంఆర్ స‌రికొత్త ట్రెండ్
  • నిర్మాణం చివరి దశలో..
    ప్రాజెక్టు ప్రారంభోత్సవం!
  • అట్ట‌హాసంగా.. స‌గ‌ర్వంగా..
    మూడు ట‌వ‌ర్లు ఆరంభం!

‘‘కొండాపూర్లో ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియా ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణ పనులన్నీ ఒక స్థాయికి తీసుకొచ్చాకే అధికారికంగా ఆరంభించాలనే నిర్ణయం తీసుకున్నాం. నాలుగేళ్ల నుంచి రాత్రింబవళ్లు కష్టపడ్డాం. కరోనాకు ఎదురొడ్డి మా బృంద‌మంతా శ్ర‌మించింది. అనేక ఇబ్బందుల్ని అధిగమించాం.. దాన్ని ఫ‌లితంగానే మొదటి ఫేజును కొనుగోలుదారులకు విజ‌య‌వంతంగా అప్పగించాం. రెండో ఫేజులో భాగంగా మూడు టవర్ల నిర్మాణ పనుల్ని అడ్వాన్స్ స్టేజీకి తీసుకొచ్చాం. ఐదారు నెలల త‌ర్వాత ఒక్కొక్క‌టిగా అప్ప‌గించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాం. నిర్మాణాన్ని పూర్తి చేయ‌డానికి సీరియ‌స్‌గా ఉన్నాం. స‌కాలంలో బ‌య్య‌ర్ల‌ను అందించేందుకు అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తున్నాం. మా ఈ శ్ర‌మ‌కు మార్కెట్ నుంచి చ‌క్క‌టి స్పంద‌న ల‌భిస్తుంద‌ని ఆశిస్తున్నాం. ఈ ఆనందాన్ని మీ అందరితో పంచుకోవాలన్న ఉద్దేశ్యంతో.. మూడు టవర్లను అధికారికంగా ఆరంభిస్తున్నా’మని ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ సీఎండీ సాయిరెడ్డి రాంరెడ్డి వివ‌రించారు. కొండాపూర్ సైట్‌లోని క్ల‌బ్ హౌజ్‌లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న రియ‌ల్ ఎస్టేట్ గురుతో ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించారు. సారాంశం రాంరెడ్డి మాట‌ల్లోనే..

హైద‌రాబాద్‌లో కొంతమంది బిల్డర్లు.. ప్రీలాంచ్‌లో ఫ్లాట్ల‌ను విక్ర‌యిస్తూ.. కొనుగోలుదారుల్నుంచి వందల కోట్ల రూపాయల్ని లూటీ చేస్తున్నారు. అలాంటి వాటికి మేం పూర్తిగా వ్యతిరేకం. అందుకే, స్థానిక సంస్థ‌ల నుంచి అనుమ‌తుల‌న్నీ తీసుకుని.. ప‌నుల‌న్నీ ఒక స్థాయికి తెచ్చాకే ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించాలని నిర్ణయించుకున్నాం. కొవిడ్ పీరియ‌డ్‌లో ప‌రిస్థితులు ఎలా ఉంటాయో ఎవ‌రూ అంచ‌నా వేయ‌లేని ప‌రిస్థితి. అందుకే, ఆ రెండేళ్ల కాలంలో.. అమ్మ‌కాల మీద కాకుండా.. నిర్మాణ ప‌నుల్ని చేప‌ట్ట‌డం మీదే దృష్టి పెట్టాం. అందుకే, ఇంత బ‌డా స్కై స్క్రేపర్ ప్రాజెక్టును అడ్వాన్స్ స్టేజీకి తీసుకెళ్ల‌గ‌లిగాం.

22 ఎకరాల టౌన్ షిప్..

ఎస్ఎంఆర్ విన‌య్ ఐకానియాను 22 ఎక‌రాల్లో.. 57 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల స్థ‌లాన్ని.. ఐదు ఫేజుల్లో భాగంగా ప‌ద‌కొండు ట‌వ‌ర్ల‌ను అభివృద్ధి చేస్తున్నాం. మొద‌టి ఫేజును 2019-20లో విజ‌య‌వంతంగా అప్ప‌గించాం. రెండో ఫేజులో 13.5 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల్లో నిర్మించిన ఫ్లాట్ల‌ను కొనుగోలుదారుల‌కు అప్ప‌గిస్తున్నాం. ఫేజ్ త్రీ లో భాగంగా రెండు ట‌వ‌ర్ల‌ను నిర్మిస్తున్నాం. ఫేజ్ 4లో ఒక‌టి, ఫేజ్ ఫైవ్‌లో మ‌రొక ట‌వ‌ర్‌ను క‌డుతున్నాం. 6.5 ల‌క్ష‌ల చ‌ద‌రపు అడుగుల హ్యామిల్ట‌న్ ట‌వ‌ర్‌ను ఈ డిసెంబ‌రులో అంద‌జేస్తాం. 11 ల‌క్ష‌ల చ‌.అ.ల్లో నిర్మిస్తున్న లోగాన్ ట‌వ‌ర్ అర‌వై శాతం పూర్త‌య్యింది. వ‌చ్చే ఏడాది డిసెంబ‌రులో అప్ప‌గిస్తాం. 13.5 ల‌క్ష‌ల చ‌.అ.ల శివాలిక్ ట‌వ‌ర్ ప‌నులు ముప్ప‌య్ శాతం పూర్త‌య్యాయి.

రెండు క్ల‌బ్ హౌజుల్ని ఏర్పాటు చేస్తున్నాం. 30 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల్లో పార్కింగ్ సౌక‌ర్యాన్ని ఏర్పాటు చేశాం. ఇందులో నివ‌సించే ప్ర‌తిఒక్క‌రూ త‌మ కార్ల‌ను సెల్లార్‌లోనే పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. ప్ర‌ప్ర‌థ‌మంగా క‌మ్యూనిటీ ఆస్ప‌త్రిని అభివృద్ధి చేస్తున్నాం. ఇప్ప‌టికే ప‌లు కార్పొరేట్ ఆస్ప‌త్రుల‌తో చ‌ర్చిస్తున్నాం. వ‌చ్చే ఆరు నెల‌ల్లోపు షాపింగ్ మాల్‌తో పాటు ఈ ఆస్ప‌త్రిని ఆరంభించాల‌నే నిర్ణ‌యం తీసుకున్నాం. ఇందులోనే ఒక బ్యాంకూ ఏర్పాటు కానుంది. హైప‌ర్ మార్కెట్ కోసం 15 వేల చ‌ద‌ర‌పు అడుగుల స్థ‌లాన్ని వ‌దిలేశాం. వాక్ టు వ‌ర్క్ కాన్సెప్టును ప్రోత్స‌హించేందుకు.. స్టార్ట‌ప్‌లు, ఆఫీస్ స్పేస్ నిమిత్తం కొంత స్థ‌లాన్ని కేటాయించాం.

క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు

గేటెడ్ క‌మ్యూనిటీల్లో ప్ర‌ప్ర‌థ‌మంగా క్రికెట్ గ్రౌండ్‌ని అందించిన ఘ‌న‌త మాకే ద‌క్కుతుంది. తొలుత మియాపూర్‌లోని ఎస్ఎంఆర్ విన‌య్ సిటీ, హైద‌ర్‌న‌గ‌ర్‌లోని ఫౌంటెయిన్ హెడ్‌లో ఏర్పాటు చేశాం. ప్ర‌స్తుతం ఐకానియాలో క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తున్నాం. బేస్‌మెంట్ మీద వ‌చ్చే ఈ గ్రౌండ్‌ను చాలా ప‌క‌డ్బందీగా డిజైన్ చేశాం. పుల్లెల గోపిచంద్ స్టేడియంకు ఏమాత్రం తీసిపోని విధంగా బ్యాడ్మింట‌న్ కోర్టును తీర్చిదిద్దాం. బైసైకిల్ స్టాండ్, ప్ర‌తి ట‌వ‌ర్‌లో బిజినెస్ లాంజ్‌, వెయిటింగ్ హాల్ వంటివి ఉంటాయి. మా ఈ ప్రాజెక్టుకు మార్కెట్ నుంచి మంచి ఆద‌ర‌ణ లభిస్తోంది. దాదాపు యాభై శాతం మంది ప్ర‌స్తుత బ‌య్య‌ర్లే మా వ‌ద్ద మ‌ళ్లీ కొన‌డం విశేషం.

రెండున్న‌రేళ్ల‌లో పూర్తి 

మా సంస్థ ప్ర‌త్యేక‌త ఏమిటంటే.. క్వాలిటీలో రాజీప‌డే ప్ర‌స‌క్తే లేదు. ఇన్‌హౌజ్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ టీమ్ ఉంది. మా ప్ర‌తి విభాగం క‌లిసిక‌ట్టుగా శ్ర‌మించి ప‌ని చేస్తారు. ఇప్ప‌టికే దాదాపు ఐదు వంద‌ల కుటుంబాలు ఆనందంగా నివ‌సిస్తున్నాయి. వ‌చ్చే రెండున్న‌రేళ్ల‌లోపు ఈ మొత్తం ప్రాజెక్టును పూర్తి చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాం. ఆవ‌ర‌ణ‌లో ప్ర‌త్యేకంగా వెంక‌టేశ్వ‌ర స్వామి గుడి ఏర్పాటు చేస్తున్నాం. నాలుగు స్విమ్మింగ్ పూళ్లు, నాలుగు బ్యాడ్మింట‌న్ కోర్టులు, రెండు స్వ్కాష్ కోర్టులు, చిన్నారుల‌ కోసం ప్ర‌త్యేకంగా జాగింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నాం. – పృథ్వీరాజ్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్‌, ఎస్ఎంఆర్ హోల్డింగ్స్‌.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles