తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓ చక్కటి నిర్ణయం తీసుకున్నది. గత కొంతకాలం నుంచి నిలిపివేసిన రిజిస్ట్రేషన్ల కార్యకలాపాల్ని ఆరంభించాలని నిర్ణయించింది. కొవిడ్ సడలింపు నిబంధనలను అనుసరించి ప్రభుత్వ పనిదినాల్లో స్టాంప్స్ అండ్ రిజిష్ట్రేషన్ల శాఖ పని చేస్తుంది. అంటే, భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల కార్యకలాపాల్ని సోమవారం నుంచి ఆరంభిస్తారు. ఇది తెలంగాణ రియల్ రంగానికి మేలు కలిగించే నిర్ణయమని తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు సీహెచ్ ప్రభాకర్ రావు అభిప్రాయపడ్డారు.