Categories: LEGAL

ఎఫ్ఎస్ఐ కుంభకోణం

అక్రమ నిర్మాణాల విషయంలో బాంబే హైకోర్టు కన్నెర్ర జేసింది. అలాంటి అక్రమ నిర్మాణాలకు బాధ్యులైన వ్యక్తులను గుర్తించాలని ఆదేశించింది. నవీ ముంబైలో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ) కుంభకోణం జరిగిందంటూ దాఖలైన పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టు ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. ముంబైలోని పలు ప్రాంతాల్లో సిడ్కో కేటాయించిన ప్లాట్లలో అక్రమాలు జరిగాయని.. దాదాపు 10 వేలకు పైగా ఇళ్లను అక్రమంగా నిర్మించారని ఓ విద్యార్థి పిటిషన్ దాఖలు చేశారు.

కేవలం గ్రౌండ్ ఫ్లోర్ వరకే అనుమతి ఉండగా.. ఏకంగా 90 శాతం మంది రెండేసి అంతస్తుల చొప్పున నిర్మించారని, ఇది పూర్తిగా అక్రమమని అందులో పేర్కొన్నారు. ఈ ఉల్లంఘనలను నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం.. తొలుత అక్రమ నిర్మాణాలకు బాధ్యులైనవారిని గుర్తించాలని ఆదేశించింది.

This website uses cookies.