- పూజా క్రాఫ్టెడ్ హోమ్స్ శ్రీకారం
- ఆఫీసు కార్యకలాపాల కోసం 1.6 మిలియన్ చదరపు అడుగుల స్పేస్
హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్టులో 1.6 మిలియన్ చదరపు అడుగుల గ్రేడ్-ఏ కమర్షియల్ స్పేస్ అందుబాటులోకి రాబోతున్నది. కోకాపేట చెరువు వీక్షణతో అద్భుతమైన డిజైన్ తో పూజా క్రాఫ్టెడ్ హోమ్స్ సంస్థ 35 అంతస్తుల్లో ‘ది హార్వెస్ట్‘ను నిర్మిస్తోంది. 3.5 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్టులో 1.6 మిలియన్ చదరపు అడుగుల గ్రేడ్-ఎ కమర్షియల్ స్పేస్ ఉంటుంది.
నాలుగు బేస్ మెంట్లు, రెండు పొడియంలు, 29 అంతస్తుల్లో ప్రఖ్యాత ఆర్కిటెక్టులతో ఈ భవనాన్ని డిజైన్ చేయించారు. పూర్తి స్థాయి అగ్నిమాపక వ్యవస్థతో పాటు సురక్షితమైన లిఫ్టులు, 24 గంటల నీటి సరఫరా, చక్కని ల్యాండ్ స్కేపులు కూడా ఉన్నాయి. ఇక నాలుగు బేస్ మెంట్లలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. పౌడర్ కోటెడ్ అల్యూమినియం విండోలు, పవర్ బ్యాకప్ కోసం అధిక సామర్థ్యం కలిగిన డీజీ సెట్, యూపీఎస్, ప్రతి ఫ్లోర్ యూనిట్ వరకు టెలిఫోన్ అండ్ ఫైబర్ కేబుల్స్ ఉన్నాయి. లొకేషన్ పరంగా కూడా ఇది చాలా అనువైన ప్రదేశం. పలు పాఠశాలలు, ఆస్పత్రులు, హోటళ్లు, వాణిజ్య, రిటైల్ సంస్థలు 10 నిమిషాల దూరంలోనే ఉన్నాయి. అలాగే గచ్చిబౌలి, మణికొండ, నల్లగండ్ల, తెల్లాపూర్, నార్సింగి, కోకాపేట నివాస ప్రాంతాలకు 15 నిమిషాల కంటే తక్కువ సమయంలోనే చేరుకోవచ్చు.