poulomi avante poulomi avante

వంద మంది బ‌య్య‌ర్ల‌కు ఎస్ఎంఆర్ సువ‌ర్ణావ‌కాశం

Smr Holdings Offers Sub Vention Scheme at an advance stage of construction. Pay 20% now and balance at the time of flat handover, 12- 24 months. This scheme offers for Smr Vinay Iconia and Boulder woods projects.

  • మొద‌ట్లో 20 శాతం సొమ్ము క‌డితే చాలు
  • 12-24 నెల‌ల పాటు వ‌డ్డీ క‌ట్ట‌క్కర్లేదు
  • గృహప్ర‌వేశం త‌ర్వాతే ఈఎంఐ క‌ట్టొచ్చు
  • అడ్వాన్స్ స్టేజీలో స‌బ్‌వెన్ష‌న్ స్కీము
  • తెలుగు రాష్ట్రాల్లోనే ప్ర‌ప్ర‌థ‌మం
  • చివ‌రి తేది: జ‌న‌వ‌రి 31, 2022

(కింగ్ జాన్స‌న్ కొయ్య‌డ‌)

తెలుగు రాష్ట్రాల్లోనే ప్ర‌ప్ర‌థ‌మంగా.. అడ్వాన్స్ స్టేజీలో స‌బ్ వెన్ష‌న్ స్కీమును ఆరంభించి.. ఎస్ఎంఆర్ హోల్డింగ్స్‌.. స‌రికొత్త రికార్డును సృష్టించింది. దీని వ‌ల్ల హైద‌రాబాద్‌లో సొంతింటి క‌ల‌ను సాకారం చేసుకోవాల‌ని భావించే వారికి సువ‌ర్ణావ‌కాశ‌మ‌ని చెప్పొచ్చు. ఎందుకంటే, ఆరంభంలో కేవ‌లం ఇర‌వై శాతం సొమ్ము క‌ట్టి ఫ్లాట్ బుక్ చేస్తే చాలు.. ఏడాది దాకా గృహ‌రుణంపై వ‌డ్డీ క‌ట్ట‌క్క‌ర్లేదు. ఆ త‌ర్వాత ఫ్లాట్ మీ చేతికొచ్చేస్తుంది కాబ‌ట్టి ఎంచ‌క్కా న‌చ్చిన‌ట్లుగా ఇంటీరియ‌ర్స్ చేసుకుని.. క‌ల‌ల గృహంలోకి ప్ర‌వేశించొచ్చు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో బ‌య్య‌ర్ల‌కు ఇదో బంప‌ర్ ఆఫ‌ర్ అని చెప్పొచ్చు. కొండాపూర్‌- గ‌చ్చిబౌలిలోని ఎస్ఎంఆర్ విన‌య్ ఐకానియా, టీఎస్పీఏ జంక్ష‌న్‌లోని ఎస్ఎంఆర్ విన‌య్ బౌల్డ‌ర్ వుడ్స్ ప్రాజెక్టుల్లో ఫ్లాట్ల‌ను కొనేవారికీ స్కీమ్ వ‌ర్తింప‌జేస్తామ‌ని సంస్థ చెబుతోంది.

12 నెలల్లో పూర్తి కానున్న ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియాలోని లోగాన్ టవర్

బ‌య్య‌ర్లకు ఎలా ఉప‌యోగం?

కొండాపూర్- గ‌చ్చిబౌలిలోని ఎస్ఎంఆర్ విన‌య్ ఐకానియాలోని లోగాన్ ట‌వ‌ర్ సుమారు డెబ్బ‌య్ శాతం పూర్త‌య్యింది. ఏడాదిలోపు పూర్త‌వుతుంది. ఫ్లాట్ ధ‌ర‌లో ఇర‌వై శాతం మార్జిన్ మనీ మీ ద‌గ్గ‌ర లేక‌పోయినా ఫ‌ర్వాలేదు.. తొలుత ప‌ది శాతం చెల్లించి ఫ్లాట్ ను బుక్ చేస్తే.. మిగ‌తా ప‌ది శాతం సొమ్మును క‌ట్టేందుకు మ‌రో మూడు నాలుగు నెల‌లు స‌మ‌యాన్ని తీసుకోండి. ప‌న్నెండు నెల‌ల ఈఎంఐ మాత్రం ఠంచ‌నుగా సంస్థ‌నే చెల్లిస్తుంది.

  • మీరు అమెరికాలోనో.. లండ‌న్లోనో ఉద్యోగం చేస్తున్నారు.. రెండేళ్ల త‌ర్వాత హైద‌రాబాద్ వ‌చ్చేదామ‌ని నిర్ణ‌యించుకున్నారు.. అలాంట‌ప్పుడు మీరు ఐకానియా న‌ల‌భై శాతం నిర్మాణం పూర్త‌యిన శివాలిక్ ట‌వ‌ర్లో ఫ్లాట్ బుక్ చేస్తే చాలు.. 24 నెల‌ల్లో నిర్మాణం పూర్త‌య్యాక‌.. ఇంటీరియ‌ర్స్ పూర్తి చేసుకుని.. నేరుగా మీ సొంతింట్లోకి అడుగుపెట్టొచ్చు. ఎందుకంటే, ఈ ట‌వ‌ర్ నిర్మాణం అంత కంటే ముందే పూర్త‌య్యే అవ‌కాశ‌ముంది.
  • పెద్ద‌గా అప్రిసియేష‌న్ లేని ప్రాంతాల‌కు వెళ్లి.. ల‌క్ష‌లు పెట్టి ప్లాట్లు కొని.. ధ‌ర ఎప్పుడు పెరుగుతుందేమోన‌ని ఎదురు చూడ‌కుండా.. టీఎస్‌పీఏ జంక్ష‌న్‌లోని ఎస్ఎంఆర్ విన‌య్ బౌల్డ‌ర్ వుడ్స్ ప్రాజెక్టులో ఫ్లాట్ కొనుక్కుంటే.. రెండేళ్లలో పూర్త‌వుతుంది. ఆత‌ర్వాత మీరు అందులో నివ‌సించొచ్చు. లేదా ఆయా ఫ్లాటునూ అద్దెకు ఇవ్వొచ్చు. ఇక్క‌డ మీరు ఫ్లాట్ విలువ‌లో చెల్లించేది కేవ‌లం ఇర‌వై శాతం సొమ్మే. ఫ్లాట్ పూర్త‌య్యేవ‌ర‌కూ న‌యా పైసా అద‌నంగా క‌ట్ట‌క్క‌ర్లేదు. నిర్మాణం పూర్త‌య్యాకే.. మీరు చెల్లించాల్సిన నెల‌స‌రి ఈఎంఐ ఆరంభ‌మ‌వుతుంది.
  • బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌లు, ప్రైవేటు వ్య‌క్తుల‌కు వ‌డ్డీల రూపంలో అధిక మొత్తాన్ని చెల్లించ‌డం బ‌దులు.. కొనుగోలుదారుల‌కే ప్ర‌యోజ‌నం క‌లిగించాల‌నే ఒక చ‌క్క‌టి ఉద్దేశ్యంతో.. ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ సంస్థ తాజా స్కీమును ప్ర‌క‌టించింది. మ‌రి, ఇంకెందుకు ఆల‌స్యం.. వెంట‌నే మీకు న‌చ్చిన ప్రాజెక్టును సంద‌ర్శించండి.. అన్నివిధాల న‌ప్పే ఫ్లాటును ఎంచుకోండి.. ఎంచ‌క్కా క‌ల‌ల గృహాన్ని సాకారం చేసుకోండి.

24 నెలల్లో పూర్తి కానున్న ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియాలోని శివాలిక్ టవర్

నిర్మాణ సంస్థ‌ల‌కెంతో ఉప‌యోగం!

  • నిర్మాణాల్లో వేగం పెరుగుతుంది
  • ఆరంభంలో కొన్న‌వారు స‌కాలంలో చెల్లింపులు
  • పెరిగే కార్మిక‌, నిర్మాణ సామాగ్రి వ్య‌యం త‌గ్గుతుంది
  • బ‌య్య‌ర్ల‌కే ఆ ప్ర‌యోజ‌నం అంద‌జేత
  • సాధార‌ణంగా ఏ ప్రాజెక్టును పూర్తి చేయాల‌న్నా.. డెవ‌ల‌ప‌ర్లు ఏం చేస్తారో తెలుసు క‌దా.. తొలుత బ్యాంకు రుణాల మీద ఆధార‌ప‌డ‌తారు. త‌ర్వాత ప్రైవేటు ఈక్విటీ పెట్టుబ‌డుల‌పై దృష్టి సారిస్తారు. పెరిగే నిర్మాణ వ్య‌యాన్ని త‌ట్టుకునేందుకు త‌రుచూ ప్రైవేటు వ్య‌క్తుల నుంచి అధిక వ‌డ్డీల‌కు అప్పులు తీసుకుంటారు. ఫ‌లితంగా, ప్రాజెక్టు ఫైనాన్స్ కాస్ట్ గ‌ణ‌నీయంగా పెరుగుతుంది. వీరికి వ‌డ్డీలు చెల్లించ‌డం బ‌దులు.. నేరుగా బయ్య‌ర్ల‌కే వ‌డ్డీ ప్ర‌యోజ‌నాన్ని అందించొచ్చ‌ని ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ భావించింది. దీని వ‌ల్ల అంతిమంగా కొనుగోలుదారుల‌కే ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది.
  • ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ ప్ర‌స్తుతం నిర్మిస్తున్న ట‌వ‌ర్ల మీద ఎలాంటి బ్యాంకు రుణాల్లేవు. అయితే, లోగాన్ ట‌వ‌ర్ నిర్మాణ‌మో 70 శాతం పూర్త‌య్యింది. తాజాగా సంస్థ‌ ప్ర‌క‌టించిన స‌బ్ వెన్ష‌న్ స్కీము ప్ర‌యోజ‌నాన్ని అర్థం చేసుకున్న బ‌య్య‌ర్లు.. ఫ్లాట్ల‌ను కొనుగోలు చేస్తారు. ఆయా సొమ్మును అపార్టుమెంట్‌ని వేగంగా పూర్తి చేయ‌డానికి సంస్థ వెచ్చిస్తుంది. దీంతో, నిర్ణీత గ‌డువు కంటే ముందే ట‌వ‌ర్ నిర్మాణ ప‌నులు పూర్త‌వుతాయి.
  • నిర్థారిత ల‌క్ష్యం కంటే ముందే ప్రాజెక్టు పూర్త‌యితే.. ఆరంభంలో ఫ్లాట్లు కొన్న‌వారూ.. నిర్మాణ పురోగ‌తిని బ‌ట్టి సంస్థ‌కు సొమ్ము చెల్లిస్తారు. ఫ‌లితంగా.. కంట్రాక్ట‌ర్లు, వెండార్లకూ పేమెంట్లు సులువౌతుంది.
  • నిర్మాణ ప‌నుల్లో వేగం పెరిగితే.. భ‌విష్య‌త్తులో పెరిగే నిర్మాణ వ్య‌యాన్ని త‌గ్గించుకోవ‌చ్చు. లేబ‌ర్ కాస్ట్‌, మెటీరియ‌ల్స్ కాస్ట్ త‌గ్గుతుంది. చేతిలో న‌గ‌దు ఉంటే, ప‌లు వెండార్ల‌ను పిలిచి.. కొటేష‌న్లు తీసుకుని.. ఎవ‌రు త‌క్కువ కోట్ చేస్తే వారికే ఆర్డ‌ర్ ఇస్తారు. ఇలా నిర్మాణ సామ‌గ్రిని కొనుగోలు చేస్తే.. మార్కెట్ రేటు కంటే త‌క్కువ ఖ‌ర్చుతోనే ప‌ని పూర్త‌వుతుంది.

టీఎస్పీఏ జంక్షన్లోని ఎస్ఎంఆర్ వినయ్ బౌల్డర్ వుడ్స్ ప్రాజెక్టు

వీరికి ఉప‌యోగం

  • భార్యాభ‌ర్త‌లిద్దరూ ఎప్పుడో ప‌ది, ప‌దిహేనేళ్ల క్రితం ఫ్లాటు కొని ఉంటారు. వారి పిల్ల‌లు పెరిగి పెద్ద‌గ‌య్యాక‌.. క్ర‌మం త‌ప్ప‌కుండా త‌ల్లీదండ్రుల రాక‌పోక‌లు ఉండ‌టం వ‌ల్ల ఇప్పుడున్న ఫ్లాట్ కాస్త చిన్న‌గా క‌నిపిస్తుంది. ఇలాంటి వారు అతిపెద్ద సైజు ఫ్లాటులోకి మారేందుకు ఈ స‌బ్ వెన్ష‌న్ స్కీము ఉప‌యోగ‌ప‌డుతుంది. ఎలాగంటే, ముందుగా ప‌ది నుంచి ఇర‌వై శాతం సొమ్ము చెల్లిస్తే.. మిగ‌తా సొమ్మును క‌ట్టేందుకు అవ‌స‌ర‌మ‌య్యే సొమ్మును ఇరువైపు గ‌ల త‌ల్లీదండ్రులు స‌ర్దుబాటు చేసే అవ‌కాశం ఉంటుంది. ఎలాగూ ఏడాది గ‌డువు ఉంటుంది కాబ‌ట్టి, ఊర్లో ఉన్న పొల‌మో ఇల్లో అమ్ముకుంటారు. ఆ సొమ్మును ఫ్లాట్ కోసం క‌ట్టేందుకు వీలు దొరుకుతుంది.
  • భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ ఉద్యోగులైతే.. ఒక ఏడాది దాకా సొమ్ము చెల్లించేందుకు గ‌డువును ఇవ్వడం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నం ఏమిటంటే.. ఏడాది త‌ర్వాత ఇద్ద‌రికీ ఇంక్రిమెంట్ వ‌స్తుంది కాబ‌ట్టి.. పెరిగిన సొమ్ముతో నెల‌స‌రి ఈఎంఐ సులువుగా క‌ట్టొచ్చు.
  • ఎవ‌రైనా ఉద్యోగులు.. ఒక కంపెనీ నుంచి మ‌రో కంపెనీకి మారిపోతే.. ఫ్లాట్ కొనేందుకు ఆలోచిస్తారు. అలాంటి వారు.. కొత్త కంపెనీలో సెటిల్ అవ్వ‌డానికి కొంత సమ‌యం ప‌డుతుంది. వీరికి ఈ స‌బ్ వెన్ష‌న్ స్కీము చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది. కుటుంబ స‌భ్యులు లేదా అన్న‌ద‌మ్ముల‌ మ‌ధ్య ఆస్తుల పంప‌కం ఉన్న‌ట్ల‌యితే.. అలాంటి వారు ఇక్క‌డ ఫ్లాటును కొనుగోలు చేసి.. మిగ‌తా సొమ్మును క‌ట్టేందుకు ఏడాది
  • గ‌డువు ఉంటుంది. ఈలోపు వ‌చ్చిన సొమ్మును ఫ్లాటు నిమిత్తం కొంత చెల్లిస్తే.. భ‌విష్య‌త్తులో వ‌డ్డీ భారం కూడా త‌గ్గుతుంది.
  • ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ ప్ర‌త్యేకత ఏమిటంటే.. నిర్మాణం ఆరంభ స‌మ‌యంలో ఈ స్కీమును ఆరంభించ‌లేదు. ట‌వ‌ర్ల నిర్మాణాన్ని అడ్వాన్స్ స్టేజీలోకి తీసుకొచ్చాకే తాజా ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించింది.
  • ఎవ‌రైనా తొలుత ఈ స్కీములో ఫ్లాట్లు కొనుగోలు చేసినా.. త‌ర్వాత కొంత సొమ్ము అద‌నంగా చెల్లించి.. రెగ్యుల‌ర్ స్కీములోకి వెళ్లేందుకూ అనుమ‌తిని మంజూరు చేస్తాం.

అప్రిసీయేష‌న్ ఎంత‌లేద‌న్నా చ‌దర‌పు అడుక్కీ.. రూ.2100..

గ‌తవారం ఆరంభించిన ఈ ప‌థ‌కానికి మంచి స్పంద‌న ల‌భిస్తుంది. ప్రాజెక్టును సంద‌ర్శించేవారి సంఖ్య పెరిగింది. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ఎస్ఎంఆర్ విన‌య్ ఐకానియాలో ఫ్లాట్ ధ‌ర‌.. చ‌ద‌ర‌పు అడుక్కీ ఎంత‌లేద‌న్నా రూ.9400కి చేరుకుంటుంది. మొత్తం ప్రాజెక్టు పూర్త‌య్యే లోపు సుమారు రూ.10,500 దాకా అవుతుంద‌నే న‌మ్మ‌కముంది.

విన్ విన్ సిచ్యుయేష‌న్‌..

కొండాపూర్‌- గ‌చ్చిబౌలిలోని ఎస్ఎంఆర్ విన‌య్ ఐకానియా.. టీఎస్‌పీఏ జంక్ష‌న్‌లోని ఎస్ఎంఆర్ విన‌య్ బౌల్డ‌ర్ వుడ్స్‌లో.. వ‌చ్చే 12 నుంచి 13 నెల‌ల్లో పూర్తి కావాల్సిన నిర్మాణ ప‌నుల్ని ఏడెనిమిది నెల‌ల్లో పూర్తి చేయాల‌న్న‌దే మా లక్ష్యం. ఈ స‌మ‌యంలో దాదాపు 25 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల బిల్ట‌ప్ ఏరియాను నిర్మిస్తాం. అడ్వాన్స్ స్టేజీలో ఉన్న నాలుగు ట‌వ‌ర్ల‌లో మొత్తం 1250 ఫ్లాట్లు ఉంటాయి. ఇందులో కేవ‌లం వంద మంది ఫ్లాట్ల‌ను మాత్ర‌మే స‌బ్ వెన్ష‌న్ స్కీమును అందిస్తాం.

మేం అనుకున్నట్టుగా నిధులు స‌మ‌కూరితే.. ఆర్థిక సంస్థ‌ల వైపు చూడాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. ఎందుకంటే, ఈ స్కీము ద్వారా చ‌ద‌ర‌పు అడుక్కీ రూ.600 నుంచి రూ.700 దాకా మాపై అధిక భారం ప‌డుతుంది. అయినా కూడా భ‌రించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే.. ఆర్థిక సంస్థ‌లు, రియాల్టీ కన్స‌ల్టెంట్లు, ప్రాసెసింగ్ ఫీజులు వంటి వాటి కోస‌మే 18 శాతం దాకా వ‌డ్డీలు క‌డ‌తాం. అంతంత సొమ్మును ఖ‌ర్చు చేయ‌డం కంటే.. ఆర్థిక ప్ర‌యోజ‌నాన్ని నేరుగా బ‌య్య‌ర్ల‌కే అందించాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చాం.
– ఎస్‌. రాంరెడ్డి, ఎండీ, ఎస్ఎంఆర్ హోల్డింగ్స్

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles