కరోనా వల్ల అతలాకుతలమైన నిర్మాణ రంగం క్రమక్రమంగా కోలుకుంటోంది. కొన్ని ప్రాజెక్టుల్లో అమ్మకాలు జోరుగా జరుగుతుండగా, మరికొన్నింట్లో ఆశించినంత స్థాయిలో జరగడం లేదు. సెకండ్ వేవ్ వల్ల తాత్కాలికంగా కొంత ఇబ్బందులు ఏర్పడినా, ఆ తర్వాత పుంజుకునే అవకాశం ఉందని నిర్మాణ నిపుణులు అంటున్నారు. మరి, కొవిడ్‌తో సంబంధం లేకుండా, మన దేశంలో టాప్ టెన్ బిల్డర్లు ఎవరో తెలుసా? ఏయే సంస్థలు టాప్ టెన్‌లో నిలిచాయో తెలుసా?
భారతదేశంలో అత్యంత సంపన్న బిల్డర్‌గా ఖ్యాతినార్జించారు.. మంగళ్ ప్రభాత్ లోధా. అతని నెట్ వర్త్ సుమారు రూ.44,270 కోట్లు. సంస్థ పేరు.. మ్యాక్రోటెక్ డెవలపర్స్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అతని సంపద 39 శాతం పెరిగింది. ఈ సంస్థ కరోనా సమయంలోనూ ఆశించిన దానికంటే మెరుగైన స్థాయిలో రియల్ లావాదేవీల్ని నిర్వహించింది. కరోనాతో ఏమాత్రం సంబంధం లేకుండా.. దాన్ని ప్రభావం పెద్దగా పడకుండానే.. ఈ సంస్థ యజమాని దేశంలోనే అత్యంత సంపన్న బిల్డర్‌గా ఖ్యాతినార్జించారు.
డీఎల్ఎఫ్ బ్రాండ్ గురించి అందరికీ తెలిసిందే. ఈ సంస్థకు చెందిన రాజీవ్ సింగ్ మొత్తం సంపద ఎంతలేదన్నా రూ.36,430 కోట్లు కలిగి ఉంటుంది. తన సంపద ఈ ఏడాది ఎంతలేదన్నా 45 శాతం పెరిగింది. డీఎల్ ఎఫ్ షేర్ ధర కూడా గణనీయంగా పెరగమూ ప్రధాన కారణం.
3. మూడో స్థానంలో నిలిచారు చంద్రూ రహేజా. అతని రహేజా కార్ప్ గణనీయంగా అభివృద్ధి చెందుతోంది. సంపద విలువ 70 శాతం పెరగ్గా.. ప్రస్తుతం సంపద కనీసం రూ.26,260 కోట్లుగా నిర్థారణ అయ్యింది.
4. ఎంబసీ ఆఫీస్ పార్క్స్ కు చెందిన జితేంద్ర విర్వానీ రూ.23,220 కోట్ల సంపదతో నాలుగో స్థానంలో ఉన్నారు.
5. హీరానందానీ కమ్యూనిటీస్ అధినేత నిరంజన్ హీరానందానీ ఐదో స్థానంలో నిలిచారు. ఈ సంస్థ వ్యాపార విలువ ఎంతలేదన్నా రూ. 20,600 కోట్ల దాకా ఉంటుంది.
6. ఒబెరాయ్ రియాల్టీ అధినేత వికాస్ ఒబెరాయ్ ఆరో స్థానంలో నిలిచింది. 13 శాతం సంపద పెరిగి ఈ సంస్థ విలువ రూ.15,770 కోట్లు.
7. రాజా బాగ్‌మనే రూ.15,590 కోట్లతో ఏడో స్థానంలో నిలిచారు. ఈ సంస్థ ఆదాయం 57 శాతం దాకా పెరిగింది.
8. రున్ వాల్ డెవలపర్స్ కు చెందిన సుభాష్ రున్ వాల్ రూ.11,450 కోట్లతో ఎనిమిదో స్థానంలో ఉన్నారు.
9. పిరమల్ రియాల్టీకి చెందిన అజయ్ పిరమల్ రూ.6,560 కోట్లతో తొమ్మిది స్థానంలో నిలిచారు.
10. రూ.6,340 కోట్లతో ఫినీక్స్ మిల్స్ డెవలపర్ అతుల్ రుహీయా పదో సంపన్న బిల్డర్‌గా అవతరించారు.
చందక్ గ్రూపునకు చెందిన 36 ఏళ్ల ఆదిత్య చందక్ రూ.280 కోట్ల తో నవ యువ బిల్డర్‌గా అవతరించారు. ఈస్ట్ ఇండియా హోటల్స్ కు చెందిన 91 ఏళ్ల పీఆర్ఎస్ ఒబెరాయ్ రూ.2,170 కోట్ల సంపదతో అధిక వయసు గల బిల్డర్‌గా అవతరించారు. మొత్తానికి, భారతదేశానికి చెందిన ప్రప్రథమ వంద బిల్డర్ల ఆస్తి విలువ దాదాపు రూ.3,48,660 కోట్లు ఉంటుంది.