poulomi avante poulomi avante

4 జిల్లాల్లో పెరిగిన పట్టణ జనాభా

  • టాప్ 3లో.. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి
  • తర్వాత.. హన్మకొండ, మంచిర్యాల్, పెద్దపల్లి
  • ప‌ట్ట‌ణాల్లో మౌలిక స‌దుపాయాలు పెర‌గాలి
  • పుర‌పాల‌క శాఖ‌కు బ‌డ్జెట్లో పెద్ద‌పీట వేయాలి

కింగ్ జాన్స‌న్ కొయ్య‌డ‌: తెలంగాణ రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో జనాభా పెరుగుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి స‌మీపంలోని పట్టణ ప్రాంతాలకు వ‌ల‌స‌లు గ‌ణ‌నీయంగా పెరుగుతున్నాయని తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ విభాగం విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. జ‌నాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల్ని ప్రభుత్వమే అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. దీంతో, ఆయా ప్రాంతాల్లో కొత్త‌గా గృహ నిర్మాణ ప్రాజెక్టుల్ని చేప‌ట్టేందుకు ప‌లువురు డెవ‌ల‌ప‌ర్లు ముందుకొస్తారు.

హైదరాబాద్తో పాటు మేడ్చల్- మల్కాజిగిరి, రంగారెడ్డి, హన్మకొండ, మంచిర్యాల్, పెద్దపల్లి, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, జగిత్యాల వంటి ప్రాంతాల్లో పట్టణ జనాభా గణనీయంగా పెరిగింది. ఉదాహరణకు హైదరాబాద్ అంటేనే మెట్రోనగరం. సుమారు 39, 43,323 మంది ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా విషయానికొస్తే.. ఇక్కడి మొత్తం 24.60 లక్షల జనాభాలో 22.50 లక్షల మంది పట్టణ ప్రాంతంలోనే నివసిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మొత్తం జనాభా 24.26 లక్షలు కాగా పట్టణ ప్రాంతంలో నివసించేది నేటికీ 14 లక్షల మందే. హన్మకొండలో 53.1 శాతం ప్రజలు పట్టణ ప్రాంతంలోనే నివసిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో పట్టణ జనాభా విషయానికొస్తే.. కొత్త ప్రాంతాలు టాప్ టెన్ జాబితాలో చేరాయి. అందులో ముఖ్యమైనవి మంచిర్యాల్, పెద్దపల్లి, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం వంటి జిల్లాలు. వీటి తర్వాత స్థానంలో వరంగల్, కరీంనగర్ వంటివి నిలిచాయి. మంచిర్యాల్ మొత్తం జనాభా 8.07 లక్షలు కాగా.. ఇందులో 3.54 లక్షల మంది పట్టణ ప్రాంతంలోనే నివసిస్తున్నారు. ఆతర్వాతి స్థానం పెద్దపల్లిది. ఇందులో దాదాపు 3.04 లక్షల మంది, సంగారెడ్డిలో 5.29 లక్షలు, భద్రాద్రి కొత్తగూడెంలో 3.39 లక్షల మంది ప్రజలు పట్టణాల్లోనే నివసిస్తున్నారు.

హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరంగా భావించే వరంగల్ మొత్తం జనాభా 7.37 లక్షలు కాగా.. ఇందులో కేవలం 2.27 లక్షల మంది మాత్రమే పట్టణాల్లో నివసిస్తున్నారు. కరీంనగర్ జనాభా మొత్తం 10 లక్షలు కాగా 3.08 లక్షల మంది పట్టణంలో నివసిస్తున్నారు. ఖమ్మంలో 3.16 లక్షల మంది పట్టణాల్లో నివసిస్తుండగా, జగిత్యాల్ లో 2.21 లక్షలు, నిర్మల్ లో 1.51 లక్షలు, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 1.16 లక్షల మంది పట్టణాల్లో జీవనం కొనసాగిస్తున్నారు.

రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో జనాభా పెరుగుతున్నారు కాబట్టి, వీరికి మౌలిక సదుపాయాల్ని పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం అధిక మొత్తం నిధుల్ని వెచ్చించాల్సిన అవసరం ఉంది. 2022-2023 బడ్జెట్లో పురపాలక శాఖకు అధిక నిధుల్ని వెచ్చించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప‌ట్ట‌ణాల్లో ర‌హ‌దారులు, తాగునీరు, విద్యుత్తు, డ్రైనేజీ వంటి మౌలిక స‌దుపాయాల్ని అభివృద్ధి చేయాలి. అప్పుడే, ఆయా ప్రాంతాల్లో సొంతిల్లు క‌ట్టుకోవ‌డానికి ప్ర‌జ‌లు ముందుకొస్తారు. లేక‌పోతే, ప‌ట్ట‌ణ ప్రాంతాల‌న్నీ మురికివాడ‌లుగా త‌యార‌య్యే ప్ర‌మాద‌ముంది.

వ్యవసాయం కంటే రియాల్టీ ఎక్కువ

భారతదేశం గ్రోత్ రేటు మైనస్ 3 శాతం నమోదు కాగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం 2.4 శాతం నమోదైంది. 2020-21 సంవత్సరంలో తెలంగాణ జీఎస్డీపీ 9,80,407 కోట్లుగా నమోదైంది. అదే మొత్తం భారతదేశంలో జీడీపీ 1,97, 45,670 కోట్లుగా నమోద‌వ్వ‌డం గ‌మ‌నార్హం. అంటే దేశీయ జీడీపీలో మన రాష్ట్రం వాటా దాదాపు ఐదు శాతానికి చేరింది. ఇది 2011-12లో 4.1 శాతం ఉండటం గమనార్హం.

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం నమోదైన జీఎస్డీపీని లెక్కిస్తే.. రూ.6,44,599 కోట్లు. ఈ మొత్తాన్ని శాఖల వారీగా జీఎస్డీపీని విభజిస్తే.. 2020-21లో వ్యవసాయ రంగం వాటా రూ. 98,809 (అగ్రికల్చర్, లైవ్ స్టాక్, ఫారెస్ట్రీ, ఫిషింగ్) కోట్లుగా నమోదు అయ్యింది. ఇదే సంవత్సరంలో రియల్ ఎస్టేట్ రంగం వాటా రూ.1,18,330 కోట్లుగా నమోదైంది. అంటే, తెలంగాణ రాష్ట్రలో వ్యవసాయం కంటే రియల్ ఎస్టేట్ రంగం ద్వారానే ఎక్కువ వాటా నమోదు కావడం గమనార్హం. ఎందుకంటే, తెలంగాణ రాష్ట్రంలో దాదాపు పాతిక శాతం కంటే అధికంగా యువ‌త రియ‌ల్ ఎస్టేట్ మీద దృష్టి సారించారు. ప్ర‌తి గ్రామం, మండ‌లం, తాలూకా, జిల్లాల స్థాయిలో భూముల క్ర‌య‌విక్ర‌యాల మీదే ఎక్కువ‌గా యువ‌త దృష్టి కేంద్రీక‌రిస్తోంది. ముఖ్యంగా, తెలంగాణ ఏర్ప‌డిన‌ప్ప‌ట్నుంచి ఈ పోక‌డ పెరిగిన‌ప్ప‌టికీ, 2017 నుంచి మాత్రం ఊహించిన స్థాయి కంటే అధికంగా పెరిగింది.

ఐటీ 13 శాతం వృద్ధి

తెలంగాణ రాష్ట్రంలో ఐటీ రంగం 2020-21లో 13 శాతం చొప్పున అభివృద్ధి చెందింది. ఐటీ ఎగుమతుల విలువ సుమారు 1,45,522 కోట్లుగా నమోదైంది. అంతకంటే ముందు సంవత్సరం ఈ సంఖ్య 1,28,807 కోట్లుగా నమోదు కావడం గమనార్హం. అదేవిధంగా, తెలంగాణ ఐటీ రంగంలో కొత్త ఉద్యోగులు ఎనిమిది శాతం పెరిగారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles