Categories: PROJECT ANALYSIS

వావ్‌మ‌నిపించే.. వ‌సంత విల్లాస్‌!

  • ప్రాజెక్ట్ బై హ‌రిహ‌ర ఎస్టేట్స్‌
  • 6 ఎక‌రాలు..
  • 187 – 223 గ‌జాలు.. 69 విల్లాలు
  • ఫోర్‌ బీహెచ్‌కే ట్రిపులెక్స్‌ విల్లాల

హైద్రాబాద్‌లో డెవలప్మెంట్‌ అంటే వెస్ట్‌జోన్‌ ఒక్కటే అన్న భ్రమ నుంచి బయటికొస్తున్నారు బయ్యర్లు. నగరం చుట్టుపక్కలతో పాటు తూర్పు వైపు కనిపిస్తోన్న డిమాండే ఇందుకు సాక్ష్యం. ఇండస్ట్రియల్‌ అండ్‌ రెసిడెన్షియల్‌ జోన్‌గా ఉన్న ఈ ఏరియా కొత్త ప్రాజెక్ట్‌లు.. భారీ నిర్మాణాలతో ఇప్పుడు అల్ట్రా మోడ్రన్‌ వర్షన్‌లో కనిపిస్తోంది. కస్టమర్ల డిమాండ్‌కి తగ్గట్టు ఈస్ట్‌ హైద్రాబాద్‌లో విల్లా ప్రాజెక్ట్‌లు కూడా పెరిగిపోయాయ్‌. ఇక వినియోగదారుల అభిరుచితో పాటు.. వారు ఊహించని సౌకర్యాలతో అత్యంత అధునాతన విల్లాలు నిర్మిస్తోంది హరిహర ఎస్టేట్స్‌. కీసరలో నిర్మిస్తోన్న వసంత విల్లాస్‌ ప్రాజెక్ట్‌ను చూస్తే రాయల్టీ అనే పదం చాలా చిన్నదేమో అనిపించడం ఖాయం. అసలన్ని ప్రత్యేకతలు ఏమున్నాయ్‌..? ప్రాజెక్ట్‌ ఫీచర్సేంటో ఓ సారి చూద్దాం.

కస్టమర్ల కొనుగోలు కెపాసిటీ రేంజ్‌ పెరిగే కొద్దీ వాళ్లు ఛూజ్‌ చేసుకుంటున్న ప్రాజెక్ట్‌లు కూడా మారిపోతున్నాయ్‌. లగ్జరీ, ఇండివిడ్యువల్‌ ప్రయార్టీ, స్టేటస్‌ సింబల్‌, ప్రశాంతత, లష్‌ గ్రీనరీ అంటూ అనేక ప్రాధాన్యతలు చూస్తున్నారు. ఇలా సెలక్టివ్‌గా ఉన్నవారంతా ప్రాపర్టీ విషయంలో విల్లాస్‌కే ఓటేస్తున్నారు. అందుకే ఇన్నర్‌ అండ్‌ ఔటర్‌ హైద్రాబాద్‌లో విల్లా ప్రాజెక్ట్‌లు పెరిగిపోయాయ్‌. ఇక లగ్జరీ అండ్‌ టాప్‌ క్లాస్‌ అమెనిటీస్‌ అంటే వెస్ట్‌ హైద్రాబాద్‌దే ఇప్పటికీ డామినేషన్‌. అందుకే ఇక్కడ ఆస్థి సొంతం చేసుకోవాలంటే కోట్లు కురిపించాలి. మరి అవే వరల్డ్‌ క్లాస్‌ సదుపాయాలతో కస్టమర్లను అస్సలు డిజాప్పాయింట్‌ చేయకుండా విల్లాలు అందిస్తే..! వెస్ట్‌ హైద్రాబాద్‌కు ధీటుగా అభివృద్ధి చెందుతోన్న తూర్పు హైద్రాబాద్‌లో అత్యంత విలాసమైన.. కళ్లు తిప్పుకోనివ్వని అద్భుత సదుపాయాలతో లగ్జరీ విల్లాస్‌ను అందిస్తోంది హరిహర ఎస్టేట్స్‌.

డెవలప్మెంట్‌తో పాటు ఇప్పుడు రియాల్టీ జోరంతా ఈస్ట్‌ హైద్రాబాద్‌లోనే కనిపిస్తోంది. అలాంటి తూర్పు హైద్రాబాద్‌లో వసంత్‌ విల్లాస్‌ ప్రాజెక్ట్‌ను చేపట్టింది హరిహర ఎస్టేట్స్‌. కీసర సమీపంలో 6 ఎకరాల్లో డెవలప్‌ చేస్తోన్న ఈ విల్లా గేటెడ్‌ కమ్యూనిటీ స్వర్గానికి మారుపేరులా ఉంటుందంటే అతిశయోక్తి కాదేమో..! 187 నుంచి 223 చదరపు గజాల విస్తీర్ణంలో కేవలం 69 ఫోర్‌ బీహెచ్‌కే ట్రిపులెక్స్‌ విల్లాలను మాత్రమే నిర్మిస్తోంది హరిహర కంపెనీ. అత్యంత భద్రత మధ్య.. పచ్చని బయళ్ల మధ్య ఉండే ఈ విల్లాల ఆర్కిటెక్చర్‌ స్టైల్‌.. కన్‌స్ట్రక్షన్‌ మోడల్‌.. సైట్‌ ప్లాన్‌.. ఫ్లోర్‌ ప్లాన్‌.. స్పెసిఫికేషన్స్‌.. ఇలా అడుగడుగునా రాజసం ప్రతిబింబించేలా ఉంటుంది.

హెచ్‌ఎండీఏ, రెరా అప్రూవ్‌ పొందిన వసంత విల్లాస్‌లో లివింగ్‌, డైనింగ్‌ ఏరియా, స్టెయిర్‌ కేస్‌లకు ఇంపోర్టెడ్‌ మార్బుల్స్‌ని వాడారు. ఫ్యామిలీ లాంజ్‌, పూజ గది, కిచెన్‌, బెడ్రూమ్స్‌, డ్రెసింగ్‌ ఏరియాస్‌కి విట్రిఫైడ్‌ టైల్స్‌, ఉడెన్‌ లామినేటెడ్‌ ఫ్లోరింగ్‌తో మల్టీ పర్పస్‌ హాల్‌, బాత్రూమ్‌, బాల్కనీ- డెక్‌ ఏరియాల్లాంటి చోట్ల యాంటీ స్కిడ్‌ టైల్స్‌ వినియోగించారు. వాల్స్‌, డోర్స్‌, బాత్రూమ్స్‌ పెయింటింగ్స్‌, విండోస్‌ అండ్‌ గ్రిల్స్‌ అన్నింటిని స్మార్ట్‌ హోమ్‌ ప్రావిజన్స్‌తో ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. టీఎస్‌ రెరా P02200005914 రిజిస్ట్రేషన్‌ నంబర్‌ను కేటాయించింది.

అపార్ట్‌మెంట్‌ యూనిట్స్‌కి పోటీగా విల్లా ప్రాజెక్ట్‌లు సైతం పెద్ద ఎత్తున నిర్మాణంలో ఉన్నాయ్‌. అనేక కంపెనీలు విల్లా ప్రాజెక్ట్‌లను డెవలప్‌ చేస్తున్నాయి.. మరి అవన్నీ వదిలేసి హరిహర ఎస్టేట్స్‌ నిర్మిస్తోన్న వసంత విల్లాస్‌నే బయ్యర్స్‌ ఎందుకు కొనాలి..? వాటిల్లో ఏముంది అంత స్పెషాల్టీ..? కంపెనీ బ్యాగ్రౌండ్‌ నుంచి విల్లాస్‌ కన్‌స్ట్రక్ట్‌ చేసిన విధానం వరకు అన్నీ ప్రత్యేకమనే చెప్పాలి. హరిహర ఎస్టేట్స్‌ సంస్థ విషయానికే వస్తే- ఇంత డెవలప్మెంట్‌ జరిగిన తర్వాత అందరూ ఈస్ట్‌ హైద్రాబాద్‌ వైపు చూస్తున్నారు. కానీ హరిహర ఎస్టేట్స్‌ మొదటి నుంచి తూర్పు హైద్రాబాద్‌ బేస్‌ చేసుకునే నిర్మాణరంగంలో తనకంటూ బ్రాండ్‌ క్రియేట్‌ చేసుకొంది. ఇప్పటి వరకు 28 లక్షల చదరపు అడుగులకి పైనే డెవలప్మెంట్‌. 34 ప్రాజెక్ట్‌ల డెలివరీ.. 1700 కి పైగా హ్యాపీ కస్టమర్లు లాంటి ట్రాక్‌ రికార్డ్‌ హరిహర ఎస్టేట్స్‌ సొంతం. నిర్మాణ కంపెనీకి ఇంత ఘనమైన చరిత్ర ఉన్నప్పుడు కస్టమర్లకి ఆటోమోటిగ్గా భరోసా దొరికినట్టే.

లొకేషన్‌ అడ్వాంటేజెస్‌?

జనరల్‌గా విల్లాస్‌ను ప్రిఫర్‌ చేసేది నగరానికి దూరంగా ప్రశాంతంగా జీవించడానికే. కస్టమర్ల మైండ్‌సెట్‌కు తగ్గట్టే డెవలపర్లు ఆలోచిస్తారు కాబట్టి సిటీకి అవతలే ఉంటుంటాయి ఈ నిర్మాణాలు. హరిహరాస్‌ వసంత విల్లాలు మాత్రం మరీ ఎక్కడో విసిరేసినట్టు కాకుండా.. అలాగని హైద్రాబాద్‌ నడిబొడ్డులో కాకుండా సుమారు గంట సేపు జర్నీ చేస్తే రీచ్‌ అయ్యేలా రీజనబుల్‌ డిస్టెన్స్‌లో ఉన్నాయ్‌. ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌ నంబర్‌-8 దగ్గర్లో కీసర సమీపంలో ఉంటుంది ఈ ప్రాజెక్ట్‌. కీసర నుంచి కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఉప్పల్‌కి అరగంటలో.. ఉప్పల్‌ మెట్రోకి 20 నిమిషాల్లో రీచ్‌ అవ్వొచ్చు.

అలాగే ఓఆర్‌ఆర్‌ షామీర్‌పేట్‌ సైడ్‌ 10 నిమిషాలు.. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కి 40 నిమిషాలు.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కి ఫార్టీ మినిట్స్‌లో చేరుకునేంత దూరంలోనే ఉన్నాయ్‌. ఇక 20 నిమిషాలు జర్నీ చేస్తే రీచ్‌ అయ్యేంత డిస్టెన్స్‌లో ప్రముఖ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూట్స్‌.. ఈసీఐఎల్‌ క్రాస్‌ రోడ్స్‌, ఏఎస్‌ రావు నగర్‌, సైనిక్‌పురి, నేరెడ్‌మెట్‌, యాప్రాల్‌, షామీర్‌పేట్‌ లాంటి ప్రాంతాలు.. ఈఎస్‌ఐ సహా పేరొందిన ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ సహా ఎక్కడికి వెళ్లాలన్నా పెద్దగా ఇబ్బంది పడక్కర్లేదు. ఈసీఐఎల్‌, హిందూస్తాన్‌ కేబుల్స్‌ లిమిటెడ్‌, కుషాయిగూడ ఇండస్ట్రీయల్‌ ఏరియా, ఉప్పల్‌ ఇండస్ట్రీయల్‌ ఏరియాల్ని సైతం 40 నిమిషాల్లో చేరుకోవచ్చు.

This website uses cookies.