poulomi avante poulomi avante

ప్రీలాంచ్ దొంగ‌ల్ని ప‌ట్టుకోవాలిలా!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల ఏలుబడిలో.. హైదరాబాద్లో మతఘర్షణలు జరిగినప్పుడు.. ముష్కరుల దాడిని ఎదుర్కొనేందుకు.. కొన్ని కాలనీల ప్రజలు రాత్రిపూట పహారా కాసేవారు. యువకులంతా కలిసి లట్లు, కట్టెలు పట్టుకుని బస్తీలు, కాలనీల్లో రాత్రంతా జాగారం చేసేవారు. యువకులంతా కలిసికట్టుగా ముష్కరుల దాడిని తిప్పి కొట్టారు. అలాంటి అనుభవాలు భాగ్యనగరంలో ఎంతమందికి ఉన్నాయో తెలియదు కానీ.. ప్రస్తుతం ప్రజలందరూ కలిసి మళ్లీ కాపలా కాయాల్సిన రోజులొచ్చేశాయి. కాకపోతే ఈసారి ముష్కరుల బదులు.. యూడీఎస్, ప్రీలాంచ్ అక్రమార్కులను పట్టుకోవాలి.

తెలంగాణలోని ప్రతి నగరం.. ప్రతి ప్రాంతంలో.. రెరా నిబంధనల్ని అనుసరించి ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాల్ని అభివృద్ధి చేసే బిల్డ‌ర్లు, డెవ‌ల‌ప‌ర్లు ఉన్న విష‌యం తెలిసిందే. వీరంతా క‌లిసి స్థానిక సంస్థ‌లు, రెరా నుంచి అనుమ‌తి తీసుకుని ప్రాజెక్టుల్ని చేప‌డుతున్నారు. కాక‌పోతే, అదే ప్రాంతంలో ఎలాంటి అనుమ‌తుల్లేకుండా అపార్టుమెంట్లు క‌ట్టే రియ‌ల్ట‌ర్లు రాత్రికి రాత్రే పుట్టుకొస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు చెందిన అనేక మంది రియ‌ల్ట‌ర్లు, పెట్టుబడిదారులు.. హైద‌రాబాద్‌లో ఇలాంటి అక్ర‌మాల‌కు తెర‌లేపారు. వీరంతా రేటు త‌క్కువ అంటూ బ‌య్య‌ర్ల‌ను మ‌భ్య‌పెడుతూ.. త‌ప్ప‌కుండా క‌డ‌తామంటూ మాయ‌మాట‌లు చెబుతూ.. వంద శాతం సొమ్మును ముందే వ‌సూలు చేస్తున్నారు. ఇలా, మూడేళ్ల క్రితం సొమ్ము వ‌సూలు చేసి.. నేటికీ నిర్మాణ ప‌నులు ఆరంభం కాని అపార్టుమెంట్లు అనేకం ఉన్నాయి. కాక‌పోతే, అందులో సొమ్ము పెట్టి బ‌య్య‌ర్లు అడ్డంగా బుక్క‌య్యారు. బ‌య‌టికొచ్చి పోలీసు కేసు లేదా ఎవ‌రికైనా ఫిర్యాదు చేస్తే.. సొమ్ము వెన‌క్కి ఇవ్వ‌ర‌నే భ‌యంతో వీరంతా వెన‌క‌డుగు వేస్తున్నారు. ప‌లువురు రియ‌ల్ట‌ర్లు, బిల్డ‌ర్లు ఇప్ప‌టికే వంద‌ల కోట్ల రూపాయ‌ల్ని ఇలా కొనుగోలుదారుల్నుంచి వ‌సూలు చేశార‌ని స‌మాచారం. ఇందులో కొత్త డెవ‌ల‌ప‌ర్ల‌తో పాటు అనుభ‌వ‌జ్ఞులైన బిల్డ‌ర్లూ ఉన్నారు.

నియంత్రించాలి!

యూడీఎస్‌, ప్రీలాంచ్ అమ్మ‌కాల్ని అరిక‌ట్ట‌డంలో తెలంగాణ రెరా అథారిటీ అనుకున్నంత‌గా విజ‌యం సాధించ‌ట్లేదు. కాబ‌ట్టి, ఇలాంటి అక్ర‌మార్కుల్ని అరిక‌ట్టేందుకు.. ప్ర‌తి ప్రాంతంలోని బిల్డ‌ర్లు, డెవ‌ల‌ప‌ర్లే ముందుకు రావాలి. ఈ అక్ర‌మ బిల్డ‌ర్ల వ‌ల్ల ఇప్ప‌టికే వీరి అమ్మ‌కాలు గ‌ణ‌నీయంగా త‌గ్గాయి. కాబ‌ట్టి, ఇలాగే కొన‌సాగితే భ‌విష్య‌త్తులో అమ్మ‌కాలు పెరుగుతాయ‌నే గ్యారెంటీ లేదు. కాబ‌ట్టి, ఏదైనా ప్రాంతంలో యూడీఎస్‌, ప్రీలాంచ్‌లో బిల్డ‌ర్లు ప్లాట్లు కానీ ఫ్లాట్లు కానీ అమ్ముతుంటే.. వారిని అక్క‌డే నియంత్రించాలి. ప్రధానంగా, రెరా నిబంధ‌న‌ల ప్ర‌కారం నిర్మాణాలు చేప‌ట్టేవారు ఈ ప‌నికి ఉప‌క్ర‌మించాలి. ఆయా వెంచ‌ర్లు, అపార్టుమెంట్లు నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా క‌డుతున్నార‌ని ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాలి. ఇలా, ప్ర‌తి న‌గ‌రం, ప్ర‌తి ప్రాంతంలో సిస‌లైన డెవ‌ల‌ప‌ర్లు వ్య‌వ‌హ‌రిస్తేనే యూడీఎస్‌, ప్రీలాంచులు చేయ‌డానికి ఎవ‌రూ ముందుకు రారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles