సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. సొంత ఇల్లు ఉంటే భద్రత, స్థిరత్వం, విజయం అనే అంశాల సాక్షాత్కారానికి ప్రతీక. ఇంటి యాజమాన్యం గర్వాన్ని సూచిస్తుంది. అంతేకాకుండా సాంస్కృతిక, భావోద్వేగ, ఆర్థిక విలువలను కలిగి ఉంటుంది. వాస్తవానికి భారతీయ హౌసింగ్ మార్కెట్ గమనాన్ని పరిశీలిస్తే.. సొంతిల్లు కలిగి ఉండలనే సెంటిమెంట్ ఎప్పటికీ క్షీణించలేదని స్పష్టంగా తెలుస్తుంది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో భారతీయ రెసిడెన్షియల్ ప్రాపర్టీ మార్కెట్ గణనీయంగా వృద్ధి చెందింది.
దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో దాదాపు 1,20,280 యూనిట్లు అమ్ముడయ్యాయని, 2022 క్యూ3తో పోలిస్తే ఇది 36 శాతం ఎక్కువని అనరాక్ నివేదిక వెల్లడించింది. ఇక ఢిల్లీలో కొత్త లాంచింగులలో 45 శాతం పెరుగుదల ఉంది. ఇవన్నీ ప్రజల్లో గృహ యాజమాన్య శాశ్వత ప్రాముఖ్యతను చాటి చెబుతున్నాయి. కరోనా మహమ్మారి తర్వాత ఇంటి యాజమాన్యంపై అందరికీ మక్కువ పెరిగింది. ముఖ్యంగా మిలీనియల్స్ లో సొంతింటి కోరిక బాగా పెరిగింది. భారతీయ మిలీనియల్స్ లో దాదాపు 70 శాతం మంది సొంత ఇళ్లను కలిగి ఉండాలని కోరుకుంటుండగా.. 44 శాతం మంది భారతీయ యువకులు రెండేళ్లలోనే ఇల్లు కొనాలనుకుంటున్నట్టు ఓ సర్వేలో తేలింది. అలాగే 52 శాతం మంది మిలీనియల్స్ రియల్ ఎస్టేట్ ను అసెట్ క్లాస్ గా ఇష్టపడుతున్నారు.
స్థిరత్వం: ఇంటిని సొంతం చేసుకోవడం స్థిరత్వం అనే భావన కలిగిస్తుంది. యాజమాన్యం అకాల లీజు రద్దు భయం, అద్దె ఒప్పందాలను పునరుద్ధరించడం, అద్దెకు పదేపదే చర్చలు జరపడం వంటి ఇబ్బందులను కూడా తొలగిస్తుంది.
ఆర్థిక భద్రత: ఇంటిని సొంతం చేసుకోవడం ఒక ఆస్తి. ఇది కాలక్రమేణా సంపదను పెంచుతుంది. అయితే అద్దెకు నెలవారీ ఖర్చులు మాత్రమే ఉంటాయి. గృహ ఈక్విటీలో నిరంతర పెరుగుదల ఒకరి దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వాన్ని భద్రపరచడానికి గణనీయమైన సాధనంగా ఉపయోగపడుతుంది.
భవిష్యత్ తరాలకు భద్రత: ఇంటిని సొంతం చేసుకోవడం తక్షణ ప్రయోజనాలను అందించడమే కాకుండా మీ కుటుంబం, భవిష్యత్ తరాల ఆర్థిక భవిష్యత్తును సురక్షితంగా ఉంచడానికి పునాదిగా కూడా పనిచేస్తుంది. ఆస్తిలో పెట్టుబడి పెట్టడం ద్వారా, మీరు మీ వారసులకు స్థిరత్వం మరియు ఆర్థిక భద్రతను అందించే విలువైన ఆస్తిని వారసత్వంగా అందించవచ్చు.
This website uses cookies.