Categories: LATEST UPDATES

రియల్లో కొత్త ఒరవడి షాప్ కమ్ ఆఫీస్ స్పేసెస్

భారత రియల్ ఎస్టేట్ రంగంలో షాప్ కమ్ ఆఫీస్ (ఎస్సీవో) స్పేసెస్ కీలకపాత్ర పోషిస్తున్నాయి. మన రియల్ రంగ ముఖచిత్రాన్ని మార్చే దిశగా ముందుకెళ్తున్నాయి. ఒకే భవనంలో అటు రిటైల్, ఇటు ఆఫీస్ స్పేస్ ఏర్పాటు చేస్తూ తీసుకొచ్చిన ఈ నూతన విధానం పలువురిని ఆకట్టుకుంటోంది. వైవిధ్యం, సమర్థత, వ్యూహాత్మక ఫలితాల వంటి అంశాలతో ఈ ఎస్సీవో స్పేసెస్ ఆకర్షణీయంగా మారాయి. ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో వీటికి డిమాండ్ బాగా పెరుగుతోంది. ఇవి పలు వ్యాపార సంస్థలకు చక్కని ఎంపికగా కనిపిస్తున్నాయి. ప్రాపర్టీ వినియోగాన్ని ఆప్టిమైజ్ చేయడం, కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం, ఖర్చులు తగ్గించడం, సహకారం, ఆవిష్కరణలకు ఓ మంచి వాతావరణ సృష్టించడం వంటి అంశాల నేపథ్యంలో ఎస్సీవో స్పేసెస్ కు డిమాండ్ పెరుగుతోంది.

గుర్గావ్ లోని సెక్టార్ 62లో ఏర్పాటు చేసిన రిటైల్, వాణిజ్య ప్రాజెక్టులో అటు వ్యాపార సంస్థలు, ఇటు ఆఫీసులు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇంకా డైనింగ్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. షాప్ కమ్ ఆఫీస్ స్పేసెస్ భారత రియల్ రంగాన్ని గణనీయంగా మార్చాయని, తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారాలు అందిస్తున్నాయని ఆల్ఫా కార్స్ ఈడీ, సీఎఫ్ఓ సంతోష్ అగర్వాల్ పేర్కొన్నారు. ఈ స్థలాలు పట్టణ అభివృద్ధిని ప్రోత్సహించడంలోనూ, వాణిజ్య రియల్ రంగాన్ని వైవిధ్యం చేయడంలోనూ కీలకపాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. కాగా, ఉద్యోగాల కల్పన, 8 నంచి 9 శాతం వృద్ధిని అంచనా వేయడం, స్టాక్ మార్కెట్లు కోలుకోవడం వంటి కారణాలతో భారత రియల్ రంగం వృద్ధిని కొనసాగిస్తుందని అంచనా. ఈ క్రమంలోనే ఎస్సీవోలకు మరింత డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నారు.

This website uses cookies.