-
- 28 ఏళ్లుగా నాణ్యమైన నిర్మాణాలు
- హైదరాబాద్‌లో ప్రప్రథమంగా..
- యూరోపియన్ తరహా లగ్జరీ విల్లాలు
- నలగండ్లలో 40 ఎకరాల్లో
- వర్టెక్స్ కింగ్‌స్టన్ పార్క్
- శరవేగంగా నిర్మాణ పనులు
- 2023లో బయ్యర్లకు అప్పగింత
- ఇబ్రహీంపట్నలో 500 ఎకరాల శాటిలైట్ టౌన్‌షిప్
వర్టెక్స్ హోమ్స్.. హైదరాబాద్‌లో దాదాపు 28 ఏళ్లుగా నాణ్యమైన నిర్మాణాల్ని చేపడుతోంది. ఒక ప్రాజెక్టు అంటూ ప్రారంభిస్తే పూర్తి చేసే దాకా విశ్రమించదు. అలాగనీ ఎక్కడా పెద్దగా హడావిడి చేయదు. కొనుగోలుదారులకు నాణ్యమైన గృహాల్ని అందిస్తున్నామా? లేదా? అనే అంశం మీదే దృష్టి సారిస్తుంది తప్ప.. మార్కెటింగ్ కోసం పెద్దగా ఖర్చు చేసిన దాఖలాల్లేవు. ఎందుకంటే.. నాణ్యమైన నిర్మాణాల్ని కడితే కొనుగోలుదారులే తమ ఫ్లాట్లను విక్రయిస్తారని సంస్థ ఎండీ వెంకటరాయవర్మ, జేఎండీ మురళీమోహన్‌రావులు బలంగా నమ్ముతారు. అందుకే, వర్టెక్స్ హోమ్స్ ఎక్కడ ప్రాజెక్టును ఆరంభించినా అందులో ప్లాట్లు కానీ ఫ్లాట్లు కానీ హాట్‌కేకుల్లా అమ్ముడవుతుంటాయి.
ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. వర్టెక్స్ హోమ్స్ సంస్థలోకి సెకండ్ జనరేషన్ కూడా రంగప్రవేశం చేసింది. వర్టెక్స్ హోమ్స్ ఎండీ వీవీఆర్ వర్మ పెద్ద కుమారుడు వి.ఫణీంద్ర వాసు బీటెక్‌లో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. అనంతరం లండన్‌లో ఎంబీఏ పూర్తి చేశాక వర్టెక్స్ హోమ్స్‌లో కీలక బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నాడు. కోర్ కన్‌స్ట్రక్షన్ పనుల్ని చేపడుతున్నారు.
సింహంలాంటి లైఫ్ స్టయిల్..
జీవితంలో విజయవంతమైన వ్యక్తులు సింహంలా జీవించాలని కోరుకుంటారు. వీరు ఏ విషయంలోనూ రాజీ పడరు. హైదరాబాద్‌లో అతిపెద్ద లగ్జరీ కమ్యూనిటీ, తివాచీపర్చిన పచ్చదనం, ఆధునిక సదుపాయాలు వంటివి ఉండాలని భావిస్తారు. అసలెవరూ ఊహించిన జీవనశైలిని ఆస్వాదించాలని అనుకుంటారు. మరి, ఇలాంటి వారికోసమే హైదరాబాద్‌లో ప్రప్రథమంగా.. అతిపెద్ద లగ్జరీ లైఫ్ స్టయిల్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు ఆరంభమైంది. అదే వర్టెక్స్ కింగ్ స్టన్ పార్క్ @ నలగండ్ల.
యూరోపియన్ డిజైన్స్..
విల్లాల ఎలివేషన్ యూరోపియన్ తరహాలో వర్టెక్స్ హోమ్స్ డిజైన్ చేసింది. ప్రతి విల్లా డబుల్ హైట్ లో ఉండటం.. ఎల్ఈడీ ఆధారిత లైటింగ్ గల బాల్కనీలు.. అతిపెద్ద టెర్రస్ కలిగి ఉండటం వల్ల.. అక్కడ్నుంచి ఎదురుగా కనిపించే పచ్చటి పరిసరాల్ని ఆనందంగా ఆస్వాదించొచ్చు. విల్లాలో డిజైనర్ ఫిటింగులు, ఆకట్టుకునే కలర్ స్కీములు.. ప్రకృతిలో నివసించాలని కోరుకునేవారికి వర్టెక్స్ కింగ్‌స్టన్ పార్కు చక్కగా నప్పుతుంది. ప్రతి విల్లాను ఇటాలియన్ మార్బుల్ తో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. చూడచక్కగా చెక్కిన జీఆర్సీ ప్యానెల్స్ వల్ల విల్లా సరికొత్త రీతిలో కనిపిస్తుంది. ఇందులోని రహదారులు, దానిపక్కనే ముచ్చటగొలిపేలా ల్యాండ్ స్కేపింగ్‌ను తీర్చిదిద్దడం వల్ల.. హైదరాబాద్‌లోనే టాప్ విల్లా కమ్యూనిటీలో నివసిస్తున్నామన్న అనుభూతి ప్రతిఒక్కరికీ కలుగుతుంది.
నిత్య సంతోషమే..
వర్టెక్స్ హోమ్స్.. ఇందులో ఫ్లాట్లు కొనేవారిలో ఎప్పుడూ సంతోషంగా గడిపేస్తుంటారు. ఇప్పటిదాకా దాదాపు పదివేల మంది హ్యాపీ కస్టమర్లు కలిగి ఉన్నారు. ప్రకృతిలో మమేకం అవుతూ.. ప్రతిరోజు జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని భావించే వారి కోసం.. పశ్చిమ హైదరాబాద్‌లో అతిపెద్ద లగ్జరీ విల్లా గేటెడ్ కమ్యూనిటీ ఆరంభమైంది. విలాసవంతమైన విల్లాలు.. అద్భుతమైన సదుపాయాలు.. మదిని దోచే ఆర్కిటెక్చర్.. ఇలాంటివన్నీ కోరుకునే చూడచక్కటి కుటుంబాల కోసమే వర్టెక్స్ హోమ్స్.. వర్టెక్స్ కింగ్ స్టన్ పార్క్ ప్రాజెక్టును తీర్చిదిద్దింది. ప్రతి ప్రాజెక్టును అతిసుందరంగా తీర్చిదిద్దుతుందనే ఖ్యాతినార్జించడం వల్లే.. వర్టెక్స్ హోమ్స్ ఎక్కడ నిర్మాణాన్ని ఆరంభించినా వేడిపకోడిల్లా అమ్ముడవుతుంటాయి. ఇందుకీ ప్రాజెక్టు కూడా మినహాయింపేం కాదు.
ఇతర ప్రాజెక్టులివే..
కూకట్‌పల్లిలో ఐదు లక్షల చదరపు అడుగుల్లో వర్టెక్స్ ప్రీమియో ప్రాజెక్టును కొనుగోలుదారులకు అప్పగిస్తున్నారు. దాదాపు ఐదు లక్షల చదరపు అడుగుల్లో అభివృద్ధి చేస్తున్న వర్టెక్స్ ప్రిస్టీన్ ప్రాజెక్టు ప్రస్తుతం శ్లాబు పనులు జరుగుతున్నాయి. శంషాబాద్ విమానాశ్రయం వద్ద సుమారు 300 ఎకరాల్లో గిగా సిటీ అనే లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాటింగ్ ప్రాజెక్టును అభివృద్ధి చేసింది. దీనికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కూడా లభించింది. ఎయిర్‌పోర్టు చేరువలో లగ్జరీ తరహా నిర్మాణాల్లో నివసించాలని భావించేవారికి ఇది చక్కగా నప్పుతుంది. ఇదే అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని.. హైదరాబాద్‌లోనే ప్రప్రథమంగా ఐదు వందల ఎకరాల్లో శాటిలైట్ టౌన్‌షిప్పును సంస్థ అభివృద్ధి చేస్తోంది. ఇబ్రహీంపట్నంలోని గురు నానక్ ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలో ఓ అంతర్జాతీయ స్థాయిలో ఈ ప్రాజెక్టును డెవలప్ చేయాలన్న లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంది.
వర్టెక్స్ హోమ్స్ గురించి క్లుప్తంగా..
– 28 ఏళ్ల అనుభవం
– 10 వేల హ్యాపీ కస్టమర్లు
– ఇప్పటివరకూ: 60 లక్షల చ.అ. స్థలం అభివృద్ధి
– ప్రస్తుతం: 55 లక్షల చ.అ. స్థలం అభివృద్ధి
– అప్ కమింగ్ ప్రాజెక్ట్స్:
– వర్టెక్స్ విరాట్: 23.18 లక్షల చ.అ.
– వర్టెక్స్ 33 వెస్ట్ : 7,39, 000 చ.అ.
– వర్టెక్స్ బొగెన్‌విల్లే: 2,00,000 చ.అ.
– మూడేళ్లలో.. 500 ఎకరాల్లో శాటిలైట్ టౌన్షిప్
ఫ్యూచర్ శ్రీశైలం రోడ్డుదే
ప్రస్తుతం కోకాపేట్ తరహాలో భవిష్యత్తులో శ్రీశైలం రోడ్డు అభివృద్ధి అయ్యేందుకు పూర్తి ఆస్కారముంది. ఫార్మా సిటీ, టెక్నాలజీ ఆధారిత సంస్థలు, సివిల్ ఏవియేషన్ వంటి వాటితో ఈ ప్రాంతం గణనీయంగా అభివృద్ధికి ఆస్కారముంది. ప్రస్తుతం సుమారు రెండు వేల ఎకరాల స్థలం కన్వర్షన్ అయ్యి ఉంది. కాబట్టి, భవిష్యత్తులో ఈ ప్రాంతం అద్భుతంగా వృద్ధి చెందుతుంది. నాణ్యమైన నిర్మాణాలకు సరికొత్త చిరునామాగా అవతరిస్తుందనడంలో సందేహం లేదు.
– వెంకటరాయవర్మ, ఎండీ, వర్టెక్స్ హోమ్స్
సెకండ్ జనరేషన్ షురూ
సంస్థ ఆరంభం నుంచి మేం నాణ్యమైన నిర్మాణాల్ని చేపట్టడం మీదే దృష్టి సారించాం. మా వద్ద కొన్నవారు ఎప్పుడూ హ్యాపీగా ఉంటారు. మేం పాటించిన నాణ్యతా ప్రమాణాల్ని భవిష్యత్తులోనూ కొనుగోలుదారులకు అందించాలన్న ఉన్నతమైన లక్ష్యంతో మా పిల్లలూ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టేలా ప్రోత్సహించాం. వీరు సాంకేతికపరంగా ఉన్నతమైన చదువులు చదవడంతో మేం ఊహించిదానికంటే మెరుగైన ఫలితాల్ని అందుకుంటున్నారు.
– మురళీమోహన్ రావు, జేఎండీ, వర్టెక్స్ హోమ్స్