హైదరాబాద్ రియల్ రంగంలో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ.. మై హోమ్ సంస్థ మాత్రం తమ ప్రత్యేకతను ఎప్పటికప్పుడు చాటి చెబుతుంది. మార్కెట్లో అమ్మకాలు జరగకపోయినా.. ప్రతికూల పరిస్థితులు నెలకొన్నా.. ఈ సంస్థ మీద ప్రతికూల ప్రభావం పడదు. ఈ విషయం మరోసారి నిరూపితమైంది. నగరానికి చెందిన మై హోమ్ సంస్థ తెల్లాపూర్‌లో గతవారం మై హోమ్ విపినా ప్రాజెక్టును ప్రారంభించింది. సుమారు 20.61 ఎకరాల్లో నిర్మించే 3720 ఫ్లాట్లలో దాదాపు వెయ్యి ఫ్లాట్లను మొదటి వారంలోనే విక్రయించింది. ఇందులో వచ్చే మొత్తం ఎనిమిది టవర్లను జి+46 అంతస్తుల ఎత్తులో నిర్మిస్తోంది. 2 బెడ్రూమ్ ఫ్లాట్ల విస్తీర్ణం 1325 చదరపు అడుగులు కాగా.. 2.5 బీహెచ్‌కే ఫ్లాట్లు 1655 చదరపు అడుగులు.. త్రీ బెడ్‌రూమ్ ఫ్లాట్లు 2095 మరియు 2180 చదరపు అడుగుల్లో కడుతున్నారు. మై హోమ్ సయూక్ తర్వాత ఇదే అతిపెద్ద ప్రాజెక్టు కావడంతో ఐటీ నిపుణులు, ప్రవాసులు తదితరులు పోటీపడి ఫ్లాట్లను కొనుక్కోవడం విశేషం.
This website uses cookies.