Categories: TOP STORIES

1027 బయ్య‌ర్లు.. రూ. 482 కోట్లు..

  • సాహితీ ఇన్‌ఫ్రా దారుణం
  • అన్ని ప్రాజెక్టులూ ప్రీలాంచులే

సాహితీ సంస్థ మొత్తం ఎన్ని ప్రాజెక్టుల్లో.. ఎంత‌మంది కొనుగోలుదారుల‌ను మోసం చేసిందో తెలుసా? పోలీసులు ఎఫ్ఐఆర్‌లో న‌మోదు చేసిన వివ‌రాల ప్ర‌కారం.. అమీన్‌పూర్‌లోని శార్వ‌ణీ ఎలైట్ ప్రాజెక్టు కాకుండా మ‌రో తొమ్మిది ప్రాజెక్టుల్ని చేప‌ట్టింది. మాదాపూర్‌, నాన‌క్‌రాంగూడ‌, కొంప‌ల్లి, గచ్చిబౌలి, మేడ్చ‌ల్‌, బంజారాహిల్స్‌, నిజాంపేట్‌, మోకిలా, హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లో చేప‌ట్టిన తొమ్మిది ప్రాజెక్టుల్లో 1027 బ‌య్య‌ర్ల నుంచి సుమారు రూ. 482 కోట్ల‌ను వ‌సూలు చేసింది. మ‌రి, ఈ ప్రాజెక్టులు పూర్తి కాక‌పోవ‌డంతో అందులో కొన్న‌వారు అనేక ఇబ్బందులు ప‌డుతున్నారు. మాదాపూర్లోని కాక‌తీయ హిల్స్ ప్రాజెక్టులో ఫ్లాట్లు కొన్న‌వారిలో పోలీసు అధికారులూ ఉన్నార‌ని స‌మాచారం. ఆంధ్ర‌ప్ర‌దేశ్లో ప‌ని చేసే వివిధ విభాగాల్లో ప‌ని చేసే ఉన్న‌తాధికారులూ సాహితీ సంస్థ‌లో ఫ్లాట్లు కొన్నార‌ని తెలిసింది. మ‌రి, ఏయే ప్రాజెక్టులో ఎంత‌మంది బ‌య్య‌ర్లు ఫ్లాట్ల‌ను కొన్నారు? ప్రాజెక్టుల వారీగా పెట్టిన పెట్టుబ‌డి ఎంతో మీరే ఓ లుక్కెయ్యండి.

This website uses cookies.