Categories: TOP STORIES

రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగంలో 11 ఇంటర్‌ఛేంజ్‌లు

రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి కేంద్ర ప్రభుత్వం టెండర్లు పిలవడంతో ఇక ఈ ప్రాజెక్టు పట్టాలెక్కబోతోంది. ఇప్పటికే భూసేకరణ దాదాపు పూర్తి అవ్వడంతో రోడ్డు నిర్మాణమే తరువాయి అని చెప్పాలి. ఆర్ఆర్ఆర్ ఉత్తరభాగంలో నిర్మించే రోడ్డుకు 11 జాతీయ, రాష్ట్ర రహదారులు అనుసంధానం కానున్నాయి. ఫోర్ లేన్ గ్రీన్‌ఫీల్డ్‌ రీజినల్‌ ఎక్స్‌ప్రెస్‌వేగా వ్యవహరించే ఈ రహదారికి అనుసంధానంగా ఉండే మార్గాల ద్వారా.. హైదరాబాద్ సిటీతో పాటు నగర శివారులోకి కూడా రాకుండానే నేరుగా ఇతర రాష్ట్రాలకు ప్రయాణం చేయవచ్చు.

మొత్తం 7 జిల్లా కేంద్రాలకు కూడా నేరుగా వెళ్లవచ్చు. ట్రిపుల్ ఆర్ ఇంటర్ స్టేట్ వాహనాలకు ఎంతో దూరాభారం తగ్గనుంది. ఫలితంగా హైదరాబాద్‌ ప్రాంత పరిధిలో వాహనాల తాకిడి తగ్గే అవకాశాలున్నాయి. ఇక రీజినల్ రింగ్ రోడ్డు కనెక్టివిటీ పెరగడంతో ఎకనామిక్‌ కారిడార్‌గా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందనుంది. ట్రిపుల్ ఆర్ రహదారితో అనుసంధానమయ్యే జిల్లాల్లోనూ రియల్ ఎస్టేట్ తో పాటు వ్యాపారరంగం మరింత వృద్ధి చెందనుంది. ఆర్ఆర్ఆర్ తో వచ్చే ఇంటర్‌ఛేంజ్‌ల దగ్గర వివిధ ఆకృతుల్లో రోడ్లను నిర్మించనుండడంతో ఈ ప్రాంత రూపురేఖలు కూడా పూర్తిగా మారిపోనున్నాయి.

రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం పనులు మొత్తం ఐదు ప్యాకేజీల్లో చేపడుతున్నారు. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల మీదుగా భారత్‌ మాల పరియోజన కార్యక్రమంలో భాగంగా నేషనల్ హైవేస్ అధారిటీ ఆఫ్ ఇండియా ట్రిపుల్ ఆర్ ను నిర్మించనుంది. రోడ్లు, భవనాల శాఖకు సంబంధించిన ఎన్‌హెచ్‌ డివిజన్‌ సూచనలు, సలహాలు కూడా తీసుకుని దీన్ని డిజైన్‌ చేశారు. ప్రధానంగా ఔటర్‌ రింగ్‌ రోడ్డు తో పాటు ఎన్‌హెచ్‌ రహదారులు, ఇతర జిల్లా కేంద్రాలకు వెళ్లే మార్గాలను దృష్టిలో పెట్టుకుని ఇంటర్‌ఛేంజ్‌లను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 11 ఇంటర్‌ఛేంజ్‌లతో పాటు టోల్‌ ప్లాజాలు, రెస్ట్‌రూంలు, సర్వీసు రోడ్లు, బస్‌బేలు, ట్రక్‌ బేలు నిర్మించనున్నారు. ట్రిపుల్ ఆర్ ను ప్రస్తుతం నాలుగు వరుసలుగా నిర్మిస్తున్నా.. భవిష్యత్తులో ఆరు, ఎనిమిది వరుసలుగా పెంచాలనే ప్రతిపాదనలు ఉన్నాయి.

ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగంలో 11 చోట్ల వచ్చే ఇంటర్ చేంజర్స్..

1- జాతీయ రహదారి 65- హైదరాబాద్-పూణె మధ్య సంగారెడ్డి దగ్గర సింగిల్ ట్రంపెట్‌
2- హైదరాబాద్-నాదేడ్ జాతీయ రహదారి 161 దగ్గర డబుల్ ట్రంపెట్
3- హైదరాబాద్-మెదక్ రహదారి- నర్సాపుర్ దగ్గర డైమండ్ ఇంటర్ చేంజర్
4- హైదరాబాద్-నాగ్ పూర్ రహదారి 44 పై మాసాయిపేట్ దగ్గర క్లోవర్ లీఫ్ ఇంటర్ చేంజర్
5- తూప్రాన్-గజ్వేల్ రహదారిపై గజ్వేల్ దగ్గర రోటరి కమ్ ఫ్లై ఓవర్ ఇంటర్ చేంజర్
6- హైదరాబాద్-మంచిర్యాల రహదారిపై చేర్యాల దగ్గర క్లోవర్ లీఫ్ ఇంటర్ చేంజర్
7- ప్రజ్ఞాపూర్- భువనగిరి రహదారిపై భునగిరి దగ్గర రోటరి కమ్ ఫ్లై ఓనవర్ ఇంటర్ చేంజర్
8- యాదాద్రి-కీసర రహదారిపై వర్గల్ దగ్గర రోటరి కమ్ ఫ్లై ఓనవర్ ఇంటర్ చేంజర్
9- హైదరాబాద్- వరంగల్ రహదారిపై భవనగిరి దగ్గర డబుల్ ట్రంపెట్ ఇంటర్ చేంజర్
10- భువనగిరి-నల్గొండ రహదారిపై జగదేవ్ పూర్ దగ్గర రోటరి కమ్ ఫ్లై ఓనవర్ ఇంటర్ చేంజర్
11- హైదరాబాద్- విజయవాడ జాతీయరహదారిపై చౌటుప్పల్ దగ్గర సింగిల్ ట్రంపెట్ ఇంటర్ చేంజర్

This website uses cookies.