ట్రిపుల్ వన్ జీవో పరిధిలో ఉన్న 80 శాతం భూములు ఇప్పటికే రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు అధికారులు, అనధికారికంగా తక్కువ దరకు స్వంతం చేసుకున్నారని మాజీ హుడా ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి విమర్శించారు. ఎఫ్టీఎల్‌లో టిఆర్ఎస్ పార్టీ మంత్రులు, మాజీ మంత్రులు, పార్టీ నాయకులు, ఫామ్ హౌసులు నిర్మించుకున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తరతరాలుగా వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు మేలు చేయకుండా పేద రైతులు తమ భూములను తెగనమ్ముకునే వరకు ట్రిపుల్ వన్ జీవోను అడ్డం పెట్టుకుని.. ధనవంతులకు, రాజకీయ నాయకులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అండగా నిలిచింది. బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కా ప్రణాళికలతోనే ట్రిపుల్ వన్ జీవోను సంపూర్ణంగా ఎత్తివేసిందని ఆరోపించారు. భూదాన బోర్డును రద్దు చేసిన లక్షా 45 వేల ఎకరాల భూమిని చట్ట విరుద్దంగా పారిశ్రామిక వేత్తలకు అమ్ముతుందని విమర్శించారు. దళితులకు చెందిన అసైన్డ్ భూములను వేలం వేసి అమ్ముతున్నారని.. ధరణి పోర్టల్ ను ఆసరా చేసుకుని లక్షల ఎకరాల పేదల భూములను నిషేదిత జాబితాలో పెట్టి టిఆర్ఎస్ నాయకులు సొంతం చేసుకుంటున్నారని తెలిపారు. ట్రిపుల్ వన్ జీవో ఎత్తివేసి ఒక పెద్ద భూ కుంభ కోణానికి తలపడిందన్నారు.
This website uses cookies.