Categories: Celebrity Homes

ద్రవిడ నేపథ్యంతో నా ఇల్లుండాలి

నటి అభిజ్ఞ వూతలూరు

స్వతంత్రంగా ఉండే మహిళలు అన్నింటి కంటే ముఖ్యంగా ఓ ఇంటికి యజమాని అయి ఉండాలని తెలుగు నటి, గీతా సుబ్రమణ్యం ఫేమ్ అభిజ్ఞ వూతలూరు పేర్కొన్నారు. సొంత ఇంటికి సంబంధించి ఆమె తన అభిప్రాయాలను పంచుకున్నారు. తన కలల సౌధం ఎలా ఉండాలనుకుంటున్నారో వివరించారు.

‘నేను నాలుగో తరగతి చదువుతున్నప్పుడు ఓ విలాసవంతమైన ఇల్లు నాకు బాగా స్ఫూర్తినిచ్చింది. మా నాన్న నన్ను తన స్నేహితులలో ఒకరి ఇంటికి తీసుకెళ్లారు. ఆయన ఓ ఐఏఎస్ అధికారి. బోహేమియన్ స్టైల్ లో మూడంతుస్తుల ఆ బంగ్లా నాకు బాగా గుర్తుంది. ఆ ఇంట్లో చాలా మొక్కలు ఉన్నాయి. అవి నన్ను బాగా ఆకట్టుకున్నాయి. అప్పట్లో ఇండోర్ ప్లాంట్స్ కలిగి ఉండే ఫ్యాషన్ లేదు’ అని చెప్పారు.
వాస్తవానికి ఆమె తన కలల సౌధం గురించి ఇంకా ప్లాన్ చేయలేదు. కానీ అది ఎలా ఉండాలో మాత్రం ఆమెకు కొన్ని ఆకాంక్షలు ఉన్నాయి. ‘నా ఇల్లు చాలా థీమ్ ఓరియెంటెడ్ గా ఉండాలని కోరుకుంటున్నాను. నా కుటుంబం నాతో కలిసి ఉంటే నా థీమ్ దక్షిణాది లేదా ద్రావిడ నేపథ్యంతో ఉంటుంది. ఒకవేళ నేను ఒంటరిగా జీవిస్తే మాత్రం నా చిన్ననాటి ఫాంటసీ అయని బొహేమియన్ థీమ్ ఎంచుకుంటాను’ అని అభిజ్ఞ వివరించారు.

ఇల్లు అనేది సున్నితంగా, క్లాసీగా ఉండాలనేది ఆమె భావన. ‘నేను పాతకాలపు మనిషిని. అందువల్ల పల్లెటూరి అనుభూతి కలిగి ఉండేలా వ్యక్తిగత బంగ్లాను ఇష్టపడతాను. నా జీవితం చాలా అడ్వాన్స్ గా, పట్టణ ఆధారితంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో నేను ఇంటికి వచ్చినప్పుడు అది నా సాంస్కృతిక మూలాలను గుర్తుచేసేలా ఉండాలి’ అని తెలిపారు. అభిజ్ఞ హృదయానికి దగ్గరగా ఉండే మొక్కల గురించి ఆలోచించినట్టుగానే ఆ ఇంట్లో నివసించే వ్యక్తుల గురించి కూడా ఆలోచిస్తారు. ‘నా ఉపకరణాలు ఏవైనా సరే మధ్యయుగంగా ఉండాలి. అవి మున్ముందు చిక్కులు తీసుకొస్తాయి. అద్భుతమైన హస్తకళ నా ఉపకరణాల సంక్లిష్టతలను తెలియజేస్తుంది. బహుశా గోమేదికాలు, పాక్షిక విలువైన రాళ్లతో తయారు చేసినవి కావొచ్చు. నిజానికి నా ఇంట్లో కళా రంగం విస్తరించి ఉండాలి’ అని అభిజ్ఞ పేర్కొన్నారు.

ఆమె కలల గమ్యస్థానం గురించి అడిగినప్పుడు.. ఆమె వెంటనే పారిస్ అని బదులిచ్చారు. అక్కడి భవనాలు, బాల్కనీలంటే చాలా ఇష్టమన్నారు. పారిస్ సందర్శించినప్పుడు వారి ఇళ్లలో కూడా వారి సాంస్కృతిక సంపదను చూస్తారని వివరించారు. అది తనకు చాలా భయానక భావాన్ని కలిగిస్తుందన్నారు. ఇక శిల్పకళ పట్ల గట్టి ప్రేమనే పెంచుకున్నారు. దీనివల్లే పాత కళా సామగ్రిని ఆమె ఇంటికి జోడిస్తున్నారు. అలాగే వాస్తు అనేది నిజంగా ముఖ్యమా.. కాదా అని అంతా ఆలోచిస్తూ ఉంటారు. అభిజ్ఞపై అది బాగా పనిచేస్తుంది. ఆమె ఆ బాధ్యత తీసుకున్నారు. అదే సమయంలో తన కొత్త ఇంట్లో ఆనందాన్ని మాత్రమే ఆకర్షించాలని కోరుకుంటున్నారు. ఇక పరిశ్రమలో ఆమెకు అనన్యా పాండే ఇల్లు బాగా ఇష్టమని చెప్పారు.

This website uses cookies.