HMDA Commissioner Suspended APO BV KrishnaKumar
తప్పుడు భూరికార్డు సృష్టించిన ప్రభుత్వ భూములను ఆక్రమించిన అక్రమార్కుల తీరును రాష్ట్ర హైకోర్టు తప్పు పట్టి వారి రిట్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది. ఆ భూములు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ)కు చెందుతాయని గురువారం (14వ తేదీన) తీర్పు ఇచ్చింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో హెచ్ఎండిఏకు ఉన్న 181 ఎకరాల భూముల్లో దాదాపు 50 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు గత కొన్ని రోజులుగా కొందరు ప్రయత్నించారు.
సంబంధంలేని సర్వే నెంబర్ల ను చూపి హెచ్ఎండిఏ ఆధీనంలో ఉన్న భూముల్లో పొజిషన్ కోసం ప్రయత్నించారు. రాష్ట్ర ప్రభుత్వం, హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ కమిషనర్, హెచ్ఎండిఏ ఎస్టేట్, లీగల్, ఎన్ఫోర్స్ మెంట్ ఉన్నతాధికారులు భూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, న్యాయపరమైన అంశాలను పరిగణలోకి తీసుకొని గత ఏడాది కాలంగా హైకోర్టులో తమ వాదనలు వినిపిస్తున్నారు. వాద ప్రతివాదనల అనంతరం హైకోర్టు డివిజనల్ బెంచ్ నవంబర్ 18 వ తేదీన తీర్పును రిజర్వ్ ఫర్ ఆర్డర్స్ లో పెట్టింది. తుది తీర్పు ను గురువారం (14వ తేదీన) గౌరవ హైకోర్టు వెల్లడిస్తూ ఆక్రమణదారుల రిట్ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నట్లు వెల్లడించింది.
శంషాబాద్లోని 181 ఎకరాల భూములను హెచ్ఎండిఏ 1990 సంవత్సరంలో ఆనాటి అవసరాల నిమిత్తం ట్రక్ టెర్మినల్ పార్క్ ఏర్పాటు కోసం ల్యాండ్ ఎక్వివైజేషన్ (LA) కింద హెచ్ఎండిఏ తీసుకుంది. శంషాబాద్ లోని ఈ భూములపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) కు సర్వహక్కులు ఉన్నాయి. ఇక్కడి భూముల్లోని దాదాపు 20 ఎకరాల్లో హెచ్ఎండిఏ నర్సరీ పనిచేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు హెచ్ఎండిఏకు సంబంధించిన 181 ఎకరాల్లో రెండు(2) ఎకరాల భూమిని ఆ పరిసరాల ప్రజల సౌకర్యార్థం వెజ్, నాన్ వెజ్ మార్కెట్ కు కేటాయించడం జరిగింది.
This website uses cookies.