Categories: TOP STORIES

రూ.87 ల‌క్ష‌లకే.. 2 బీహెచ్‌కే

ఆఫీస్‌ ప్రెజర్స్‌.. విసిగించే ట్రాఫిక్‌.. చెవులు పగలకొట్టే సౌండ్ పొల్యుషన్‌- వీటంన్నిటిని బయటపడి రిలాక్స్‌ అవ్వాలంటే ఉండే ఇల్లు డెఫనెట్‌గా హ్యాపీ హోమ్‌ అవ్వాల్సిందే. చుట్టూ పచ్చని చెట్లు, ఫ్రెష్‌ ఎయిర్‌, పారే నీటి సవ్వడులు, మైండ్‌ని రిఫ్రెష్‌ చేసే లోగోస్‌, కొటేషన్స్‌, ఆర్ట్‌ ఇలా అన్ని వినూత్నంగా ఉంటే ఎలాంటి చికాకైనా సెకన్‌లో ఎగిరిపోవడం ఖాయం. సరిగ్గా ఇలాంటి కాన్సెప్ట్‌తో డిజైన్‌ చేసిందే గిరిధారి హ్యాపీనెస్‌ హబ్‌. కిస్మత్‌పూర్ టీజీపీఏ జంక్షన్‌కి సమీపంలో 5.47 ఎకరాల్లో చేపట్టారు ఈ హ్యాపీనెస్‌ ప్రాజెక్ట్‌ని. ఉన్న స్థలంలో ఇరుకుగా వేల ఫ్లాట్స్‌ కట్టేయకుండా.. ఇందులో కేవలం 567 యూనిట్లను మాత్రమే నిర్మిస్తున్నారు. జీ ప్లస్‌ 5 అంతస్థుల ఎత్తులో 3 టవర్లు ఉంటాయిందులో. 1033 నుంచి 1601 చ‌ద‌ర‌పు అడుగుల్లో 2 బీహెచ్‌కే, 3 బీహెచ్‌కే ఫ్లాట్ల‌ను డిజైన్ చేశారు. క్లబ్‌హౌస్‌ను హ్యాపీ బాడీ, మైండ్‌, సోల్‌, హార్ట్‌ అనే సరికొత్త కాన్సెప్ట్‌తో నిర్మిస్తున్నారు.

This website uses cookies.