సంపాదన మొదలుపెట్టగానే చాలామందికి వచ్చే ఫస్ట్ థాట్ సొంతిల్లు కొనుక్కోవాలని. చేతిలో ఎంతో కొంత క్యాష్ పెట్టుకుని ముందు వెనకా ఆలోచించకుండా రంగంలోకి దిగే వారు కొందరైతే.. అనుమానాలు, భయాల్లో సాగదీస్తుంటారు ఇంకొందరు. మరీ ఎక్కువ కాకపోయినా ఆస్థుల కొనుగోలు విషయంలో కనీస ఆలోచన చేయాల్సిందే. పొరబాటున దెబ్బ పడితే తేరుకోవడం కష్టం. ఇంతకీ సొంతిల్లు కొనుక్కోవడంలో ఎదురయ్యే సమస్యలేంటి..? వాటిని అధిగమించడానికి ఉన్న పరిష్కారాలేంటి..?
సొంతిల్లు అనేది చాలామందికి లైఫ్ గోల్. ఒకప్పుడు సంగతేమో కానీ ప్రస్తుతమైతే ఇంటిని సొంతం చేసుకోవడం అనుకున్నంత సులభం కాదు. ల్యాండ్ రేట్స్ విపరీతంగా పెరిగిపోయాయ్. కావాల్సిన లొకేషన్‌లో దొరికితే అదో వండర్ కిందే లెక్క. ఇన్ని కష్టాల్లోనూ జీవితాంతం సంపాదించిన డబ్బును ఇంటి కోసమే ఖర్చు పెట్టేవాళ్లు ఎందరో. అందుకే ప్రాపర్టీ కొనుగోలు విషయంలో అడుగడుగునా జాగ్రత్తగా వ్యవహరించాలి. అయినప్పటికీ ఇల్లు కొనుగోలు చేసే సమయంలో అనుమానాలు.. ప్రశ్నలు వెంటాడుతూనే ఉంటాయ్. బిల్డర్‌కి గుడ్ విల్ ఉందా..? లొకేషన్‌కు భవిష్యత్‌లో డిమాండ్ ఉంటుందా..? లోన్ విషయంలో బ్యాంక్‌లు ఏమైనా పేచీ పెడతాయా..? అంతచేసి కొన్న తర్వాత అపార్ట్‌మెంట్‌లో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు కదా..! ఇలా అనేక భయాలు ఉంటాయి బయ్యర్లలో. అయితే పెరిగిపోతున్న అద్దెలతో పొల్చితే సొంత ఇల్లు కొనుక్కోవడమే మంచిదనే అభిప్రాయం చాలామందిలో ఉంది.
సొంతంగా ఇల్లు కావాలి.. కొనుగోలు చేయాలని అనుకున్న తర్వాత కలల ఇంటి విషయంలో పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలి. మీ బడ్జెట్‌లో.. మీ స్థోమతకు తగ్గ ఇంటిని వెదుక్కుంటే భవిష్యత్‌లో ఇబ్బంది పడాల్సిన అవసరముండదు. ఇల్లు కొంటున్నామంటే ముందు చూసుకోవాల్సింది ప్రాపర్టీ ఉన్న ఏరియానే. ఆఫీస్.. పిల్లల చదువు, అవసరాలు అంటూ తిరుగుతూనే ఉండాలి. అలాంటప్పుడు ఎక్కడో ఊరవతల కాకుండా.. ఆఫీస్ ప్లేస్‌కి.. పిల్లల ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్స్‌కి వీలైనంత దగ్గరగా ఉండేలా ప్లాన్ చేసుకుంటే మంచిది. అలాగే రవాణా సదుపాయాలు ఎలా ఉన్నాయ్..? కొనుగోలు చేయాలనుకునే ఏరియాకి ఫ్యూచర్‌లో ఎలాంటి డిమాండ్ ఉంటుంది..? అభివృద్ధి ఏ స్థాయిలో జరుగుతుందో అంచనా వేయగలగాలి. ఇక బడ్జెట్ చాలా కీలకం. ఎవరికైనా ఇంటిని మించిన ఆస్తి లేదు. అదే సమయంలో భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కూడా. కాబట్టి అనవసరపు ఖర్చులు తగ్గించుకుని.. బడ్జెట్ విషయంలో పక్కా ప్లానింగ్‌తో వెళ్లాలి. ఇల్లుతో పాటు మంచినీరు, విద్యుత్ సదుపాయాలు కూడా ముఖ్యమే. పార్కింగ్ స్పేస్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. నిర్మాణంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేస్తున్నట్లైతే మనకు నచ్చిన మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. కన్‌స్ట్రక్షన్ కంప్లీటైన హౌస్ అయితే లోటుపాట్లు చూసి కొనుగోలు చేయాలో వద్దో నిర్ణయించుకోవచ్చు. బిల్డర్ ట్రాక్ రికార్డ్ చెక్ చేసి రంగంలోకి దిగితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
సొంతిల్లు కొనుగోలు చేయాలనే కోరిక ఉండటం వేరు. ఆ కలను నిజం చేసుకోడానికి అందుకు తగ్గట్టు అమౌంట్ రెడీగా ఉంచుకోవడం మరో విషయం. చాలా సందర్భాల్లో మన బడ్జెట్ అంచనాలకు- ప్రాపర్టీ మార్కెట్ రేట్‌కు మ్యాచ్ అవదు. ఇలాంటి సమయాల్లోనే బ్యాంక్ లోన్స్ వైపు చూస్తుంటారు. నిజానికి ప్రస్తుత రోజుల్లో బ్యాంక్ లోన్ తీసుకోకుండా సొంతిల్లు కొనడం అసాధ్యం కూడా. ఇన్‌కమ్‌కు తగ్గట్టు స్మాల్ అమౌంట్ లేదా పెద్ద మొత్తం ఎంతో కొంత బ్యాంక్ లోన్ తీయాల్సిందే. వెరిఫికేషన్స్ అన్ని పూర్తయ్యాక ప్రాపర్టీ మీద 70 నుంచి 90 శాతం లోన్స్‌ను శాంక్షన్ చేస్తుంటాయి బ్యాంక్‌లు. వడ్డీ రేట్లు.. డౌన్ పేమెంట్ కట్టుకోడానికి సిద్ధం చేసుకొన్న తర్వాత ఎంత మొత్తంలో లోన్ వస్తుంది.. ఈఎంఐల రూపంలో ఎంత కట్టుకోవాలనే లెక్కలు తేలిపోతాయ్. మొదట్లో ఈఎంఐలు కట్టడం కాస్త ఇబ్బంది అనిపించినా.. శాలరీ లెక్కలు బట్టి అడ్జస్ట్ చేసుకుంటాం కాబట్టి తర్వాతర్వాత రొటీన్ అయిపోతుంది ఈ వ్యవహారం.
ఇక ఏరియాను బట్టి ఇళ్ల ధరల్లో మార్పులుండటం సహజం. ఆదిభట్ల, షామీర్‌పేట్, పటాన్‌చెరు, అమీన్‌పూర్, కొల్లూరు లాంటి ప్రాంతాల్లో తక్కువ ధరకే ఫ్లాట్స్ వస్తున్నాయ్. ఈ ప్రాంతాల్లో 50 నుంచి 80 లక్షల మధ్యలోనే మంచి టూ బీహెచ్‌కే అపార్ట్‌మెంట్ యూనిట్స్‌ను డెవలప్ చేస్తున్నారు బిల్డర్లు. ఇక కొండాపూర్, మాదాపూర్, మియాపూర్ లాంటి చోట్ల కూడా కోటి కోటీన్నర మధ్యలో టూ బీహెచ్‌కేలు దొరుకుతున్నాయ్. వీటిని నిర్మిస్తోంది నగరంలోని ప్రముఖ కంపెనీలే. వీరు డెవలప్ చేస్తోన్న ప్రాజెక్ట్‌ల్లో అఫర్డబుల్ బడ్జెట్‌లోనే ప్రీమియం యూనిట్లు సిద్ధమవుతున్నాయ్. అలాంటి ప్రాజెక్ట్‌లు ఎక్కడ ఉన్నాయో.. వాటి వివరాలు చూద్దాం.
ప్రాజెక్ట్- జీహెచ్‌ఆర్ కలిస్టో
లొకేషన్- కొల్లూరు
ప్రైస్ రేంజ్- రూ. 74 లక్షల నుంచి మొదలు
జీహెచ్‌ఆర్ ఇన్‌ఫ్రా కొల్లూరులో డెవలప్ చేస్తోన్న ప్రాజెక్ట్ జీహెచ్‌ఆర్ కలిస్టో. ఇందులో టూ బీహెచ్‌కే, 2.5 బీహెచ్‌కే, త్రీ బీహెచ్‌కే ఫ్లాట్స్ 1195 నుంచి 1915 చదరపు అడుగుల విస్తీర్ణంలో రానున్నాయ్. 74 లక్షల రూపాయల నుంచి ధరలు ప్రైస్ రేంజ్ ఉంది. ఈ ఏడాది చివరి నాటికి ప్రాజెక్ట్‌ను కంప్లీట్ చేసి పొసెషన్ స్టార్ట్ చేస్తామంటోంది కంపెనీ.
ప్రాజెక్ట్- ముప్పాస్ మెలోడీ
లొకేషన్- తెల్లాపూర్
ప్రైస్ రేంజ్- రూ. 78.20 లక్షల నుంచి మొదలు
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు అతి దగ్గర్లో ఉండే తెల్లాపూర్‌లో అందుబాటు ధరల్లోనే లగ్జరీ ఫ్లాట్స్ అందిస్తోంది ముప్పాస్ మెలోడీ. 8.33 ఎకరాల్లో ఉన్న ఈ ప్రాజెక్ట్‌లో టూ, 2.5, త్రీ బీహెచ్‌కే ఫ్లాట్స్ డెవలప్ చేస్తున్నారు ప్రైస్ స్టార్టింగ్ రేంజ్ 78.20 లక్షల రూపాయలుగా ఉంది.
ప్రాజెక్ట్- రాధే స్కై
లొకేషన్- కొల్లూరు
ప్రైస్ రేంజ్- రూ. 86 లక్షల నుంచి మొదలు
ఓన్‌హౌస్ డ్రీమ్‌తో పాటు ఇన్వెస్ట్‌మెంట్‌పరంగానూ బెస్ట్ ఛాయిస్‌గా నిలుస్తోంది రాధే స్కై ప్రాజెక్ట్. కొల్లూర్‌లో లొకేటై ఉన్న ఈ లగ్జరీ ప్రాజెక్ట్‌లో 1325 నుంచి 2 వేల 610 స్క్వేర్‌ఫీట్ స్పేషియస్‌లో టూ బీహెచ్‌కే, త్రీ బీహెచ్‌కే, 3.5 బీహెచ్‌కే ఫ్లాట్స్‌ను డిజైన్ చేశారు. రాధే స్కైలో 86 లక్షల రూపాయల నుంచి ఫ్లాట్స్ ధర ప్రారంభమవుతున్నాయ్.
ప్రాజెక్ట్- గిరిధారి హ్యాపీనెస్ హబ్
లొకేషన్- కిస్మత్‌పూర్
ప్రైస్ రేంజ్- రూ. 87 లక్షల నుంచి మొదలు
అఫర్డబుల్ ప్రైసెస్‌లోనే లగ్జరీ లివింగ్ స్పేస్‌లు క్రియేట్ చేసి కస్టమర్లకు విలాసవంతమైన గృహాలను అందిస్తుంది గిరిధారి హోమ్స్. కిస్మత్‌పూర్‌లో రానుంది గిరిధారి హ్యాపీనెస్ హబ్. 1033 నుంచి 1601 స్క్వేర్‌ఫీట్స్ విస్తీర్ణంలో టూ బీహెచ్‌కే, త్రీ బీహెచ్‌కే డైమెన్షన్స్ ఉండనున్నాయ్. ఇందులో స్టార్టింగ్ ప్రైస్ రేంజ్ 87 లక్షల రూపాయలు.
ప్రాజెక్ట్- బోధివృక్ష
లొకేషన్- టీజీపీఏ జంక్షన్
ప్రైస్ రేంజ్- రూ. 93 లక్షల నుంచి మొదలు
శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్ చేస్తోన్న రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ద బోధి వృక్ష. HMDA అప్రూవ్ పొందిన ఈ లగ్జరీ ప్రాజెక్ట్ టీఎస్‌పీఏ జంక్షన్ సమీపంలో ఉంది. ఇందులో 1088 నుంచి 1975 చదరపు అడుగుల విస్తీర్ణంలో టూ బీహెచ్‌కే, త్రీబీహెచ్‌కే రానున్నాయ్. ఇందులో 93 లక్షల నుంచి ప్రారంభ ధరగా ఉంది.
ప్రాజెక్ట్- ఎస్‌ఎంఆర్ వినయ్ ఐకానియా
లొకేషన్- కొండాపూర్
ప్రైస్ రేంజ్- రూ. 1.31 కోట్ల నుంచి మొదలు
ఐటీ హబ్ అయిన కొండాపూర్‌లో కోటిన్నర లోపు బడ్జెట్‌లో ఫ్లాట్స్ కావాలనుకునే వారికి బెస్ట్ ఛాయిస్ ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియా. ఇప్పటికే ఇందులో పొసెషన్ స్టార్ట్ అయింది. ఇందులో ప్రారంభ ధర రూ. 1.31 కోట్ల నుంచి ఉంది. ఫ్లాట్ డైమెన్షన్‌ను బట్టి ప్రైస్ రేంజ్‌లో ఛేంజెస్ ఉన్నాయ్.
gated communityప్రాజెక్ట్- క్యాండియర్ ట్విన్స్
లొకేషన్- మియాపూర్
ప్రైస్ రేంజ్- రూ. కోటి 50 లక్షల నుంచి మొదలు
సిటీ హార్ట్ ల్యాండైన మియాపూర్‌లో రీజనబుల్ ప్రైస్‌లో లగ్జరీ అండ్ లావిష్ అపార్ట్‌మెంట్స్.. అది కూడా స్కై స్క్రేపర్‌లో ఎక్స్‌పెక్ట్స్ చేస్తారా..? కానీ బయ్యర్ల ఆశల్ని నిజం చేస్తోంది క్యాండియర్ ట్విన్స్. మియాపూర్‌లో ఉన్న ఈ ప్రాజెక్ట్‌లో కోటిన్నర రేంజ్‌లోనే త్రీ బీహెచ్‌కే ప్రీమియం యూనిట్లు లభిస్తున్నాయ్. ఇది బయ్యర్లకు నిజంగా బంపర్ ఆఫరే. యూనిట్ సైజ్ 1590 నుంచి 2 వేల 60 స్క్వేర్‌ఫీట్స్ స్పేషియస్‌లో ఉండనుంది. ఈ ప్రాజెక్ట్‌లన్నింటికి ప్రధాన బ్యాంక్‌లన్నీ హోమ్‌లోన్ సదుపాయాన్ని అందిస్తున్నాయ్.