ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథార్టీ (ఏపీ రెరా) చైర్ పర్సన్, నలుగురు సభ్యుల నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఆయా పోస్టులకు అర్హులైన వ్యక్తులు దరఖాస్తు చేసుకోవాలని ఏపీ రెరా సెర్చ్ కమిటీ చైర్మన్ అజయ్ జైన్ ఉత్వరులు జారీ చేశారు. తమ వివరాలు, అవసమైన డాక్యుమెంట్లను సీల్డ్ కవర్లలో పెట్టి అజయ్ జైన్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ టూ గవర్నమెంట్, హౌసింగ్ డిపార్ట్ మెంట్ అండ్ చైర్మన్, ఏపీ రెరా సెర్చ్ కమిటీ, రూమ్ నెం.101, గ్రౌండ్ ఫ్లోర్, బిల్డింగ్ నెం.5, ఏపీ సచివాలయం, వెలగపూడి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ – 522 503 అనే చిరునామాకు పంపాలని సూచించారు. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు www.ap.gov.in వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. మే 7వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తులు అందేలా తమకు పంపాలని స్పష్టంచేశారు.