Categories: LATEST UPDATES

ఏపీకి 20 లక్షల ఇళ్లు మంజూరు

ఇల్లు లేని ప్రతి భారతీయుడికి సొంతింటి కల నెరవేర్చే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు, హౌసింగ్, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పురి తెలిపారు. ఆదివారం విశాఖపట్నంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారులతో ఆయన మట్లాడారు. అందరికీ ఇల్లు పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కి మొత్తం 20 లక్షల ఇళ్లు మంజూరు చేసినట్టు వివరించారు. ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో అత్యధికంగా ఇళ్లు మంజూరైన రాష్ట్రంలో ఏపీ అగ్రస్థానంలో ఉంది.

అవసరమైన మరిన్ని ఇళ్లు మంజూరు చేస్తాం’ అని పురి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన 42,324 మంది లబ్ధిదారులకు రూ.203 కోట్ల మొత్తాన్ని బదిలీ చేశారు. అలాగే రాష్ట్రంలోని పీఎంఈవై లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు, మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద దేశంలో 9 కోట్ల మంది లబ్ధి పొందనున్నారని, ఈ పధకంలో భాగంగా లబ్ధిదారులకు మూడు సిలెండర్లు ఉచితంగా ఇస్తామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

This website uses cookies.