హైదరాబాద్ నిర్మాణ రంగం కుప్పకూలిందని.. అమ్మకాలు జరగట్లేదని.. జోరుగా ప్రచారం జరగుతున్న ప్రస్తుత తరుణంలో.. మై హోమ్ సంస్థ సరికొత్త రికార్డును సృష్టించింది. వారం రోజుల్లో సుమారు పదిహేను వందల ఫ్లాట్లను విక్రయించి.. తామెందుకు ఈ రంగంలో నెంబర్ వన్నో చాటి చెప్పింది. నగర రియల్ ఎస్టేట్ రంగంలో ఎక్కడ చూసినా.. మై హోమ్ తాజా అమ్మకాల మీదే చర్చ జరుగుతోంది. మార్కెట్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల్ని పటాపంచలు చేస్తూ.. అమ్మకాల్లో ఇంతటి ఘన విజయాన్ని ఎలా సాధించింది? నిర్మాణ రంగమంతా ఒక్కసారిగా నివ్వెరపోయేలా చేయడానికి ప్రధాన కారణాలేమిటి?
హైదరాబాద్ రియల్ రంగంలో మై హోమ్ సంస్థ గురించి చాలామందికి తెలియని అంశం ఏమిటంటే.. ఈ సంస్థ ఆవిర్భావం నుంచే పక్కా ప్రణాళికలతో వ్యవహరిస్తుంది. లొకేషన్ ఎంపిక దగ్గర్నుంచి ప్రాజెక్టు పూర్తయ్యి కొనుగోలుదారులకు హ్యాండోవర్ చేసేంత వరకూ ప్రణాళికాబద్ధంగా అడుగులేస్తుంది. కష్టార్జితాన్ని పణంగా పెట్టి ఫ్లాట్లు కొనే వారికి ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదనే నియమాన్ని ఆరంభంలోనే పెట్టుకున్న సంస్థ.
ఒక్కసారి మై హోమ్ వద్ద ఫ్లాట్ కొంటే చాలు.. ఎవ్వరైనా అంతటితో ఆగిపోయే ప్రసక్తే ఉండదు. వారంతా తమ బంధుమిత్రులు, సహచరులు.. ఇలా తెలిసిన వారందరితోనూ ఫ్లాట్లను కొనిపిస్తారు. దాదాపు మూడు దశాబ్దాల నుంచి నిబద్ధతతో నిర్మాణాల్ని చేపడుతున్న సంస్థ కావడం వల్ల.. మై హోమ్ ఎక్కడ ప్రాజెక్టును ప్రారంభించినా హాట్ కేకుల్లా ఫ్లాట్లు అమ్ముడవుతంటాయి. అసలెందుకీ సంస్థ ప్రత్యేకం? ఎందుకు బయ్యర్లు ఈ సంస్థను అంతగా ప్రేమిస్తారనే అంశాన్ని నిశితంగా పరిశీలిస్తే పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
మై హోమ్ సంస్థ ప్రత్యేకత ఏమిటంటే.. చెప్పిన సమయానికి ప్రాజెక్టును హ్యాండోవర్ చేస్తుంది. పదేళ్ల క్రితం ఆరంభమైన ప్రాజెక్టుల్ని నేటికీ చెక్కుతున్న సంస్థలున్న తరుణంలో.. ఈ కంపెనీ నిర్ణీత గడువులోపే ప్రాజెక్టును సకల హంగులతో పూర్తి చేస్తుంది. మార్కెట్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా.. రియల్ రంగం ఒడిదొడుకులకు లోనైనా.. ప్రాజెక్టును మాత్రం సకాలంలో పూర్తి చేస్తుంది. ఈ సంస్థ వద్ద ఫ్లాట్ కొనుగోలు చేస్తే తప్పకుండా డెలివరీ అవుతుందనే నమ్మకం కొనుగోలుదారుల్లో ఏర్పడింది. అందుకే, చాలా మంది ఈ సంస్థను ఎంచుకుంటారు.
మై హోమ్ సంస్థ ఎక్కడ ప్రాజెక్టుల్ని ఆరంభించాలని అనుకున్నా.. వ్యూహాత్మక ప్రాంతాల్ని ఎంచుకుంటుంది. ప్రస్తుతం మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉన్న ప్రాంతాలతో పాటు.. భవిష్యత్తులో అభివృద్ధికి ఆస్కారమున్న ప్రాంతాల్ని ఎంపిక చేసుకుంటుంది. మై హోమ్ నవద్వీప, మై హోమ్ జ్యుయల్, అవతార్, విహంగా.. ఇలా ఏ ప్రాజెక్టుల్ని చూసినా ప్రతిఒక్కరికీ విషయం అర్థమవుతుంది. ప్రస్తుతం సయూక్ ప్రాజెక్టు కూడా హాట్ లొకేషన్‌లోనే ఉండటం గమనార్హం. ఇక్కడ్నుంచి తెల్లాపూర్ నుంచి గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్టులకు సులువుగా చేరుకోవచ్చు. శంషాబాద్ విమానాశ్రయానికి అరగంటలో వెళ్లిపోవచ్చు. ఈ అంశాన్ని గమనించి చాలామంది ఇందులో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఆసక్తి చూపెట్టారు.
మై హోమ్ ఆరంభించే ప్రాజెక్టుల్లో న్యాయపరమైన ఇబ్బందులేం ఉండవని కొనుగోలుదారుల గట్టి నమ్మకం. పైగా, ఈ సంస్థ ఒక స్థలంలో ప్రాజెక్టును చేపట్టాలనే నిర్ణయానికి వచ్చే ముందు.. ఆయా భూమికి సంబంధించిన లీగల్ అంశాలన్నీ పక్కాగా పరిశీలిస్తుంది. అంతా సవ్యంగా ఉంటేనే ప్రాజెక్టును ఆరంభిస్తుంది. ఈ విషయం అటు పెట్టుబడిదారులతో పాటు ఇటు బయ్యర్లకు తెలుసు.
ఆధునిక జీవనాన్ని కోరుకునేవారికి అన్ని రకాల ఆధునిక సదుపాయాల్ని అందించడంలో మై హోమ్ ఎప్పుడూ ముందంజలో ఉంటుంది. హైదరాబాద్‌లో అసలెవరూ ఊహించిన రోజుల్లోనే.. మై హోమ్ నవద్వీప ప్రాజెక్టును అత్యాధునికంగా తీర్చిదిద్దిన ఘనచరిత్ర ఈ సంస్థ సొంతం. అంతకుముందు ఏ సంస్థా ఇవ్వని రీతిలో.. ఆధునిక సౌకర్యాలకు పెద్దపీట వేసింది. నవద్వీపలో స్విమ్మింగ్ పూల్, మోడ్రన్ జిమ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ల్యాండ్ స్కేపింగ్ గార్డెన్స్ వంటివి చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది.
మై హోమ్ సంస్థ ఏ ప్రాజెక్టును ప్రారంభించినా నివాసితులకు భద్రతను కల్పించేలా ప్రణాళికల్ని రచిస్తుంది. అందులో నివసించేవారు భద్రంగా ఉండేలా కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తుంది. దాదాపు దశాబ్దంన్నర క్రితమే.. మాదాపూర్‌లోని నవద్వీపలో పూర్తి స్థాయి భద్రతా విభాగాన్ని.. దాదాపు దశాబ్దంన్నర క్రితమే ఏర్పాటు చేసిన ఘనత ఈ కంపెనీకే దక్కుతుంది. అందులో నివసించే వారంతా తమ చిన్నారులు కింద ఆడుకోవడానికి వెళితే.. మెయిన్ గేటు దాటి బయటికి వెళ్లే అవకాశమే లేదని చాలామంది గట్టి నమ్మకంతో ఉంటారు.
కొన్ని నిర్మాణ సంస్థలు బయ్యర్లతో విచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. ఫ్లాట్లను విక్రయించిన తర్వాత వారిని అస్సలు పట్టించుకోవు. కానీ, మై హోమ్ సంస్థ సిబ్బంది ఇందుకు భిన్నం. ప్రీ సేల్స్ అయినా పోస్ట్ సేల్స్ అయినా కొనుగోలుదారులతో ఎప్పుడూ ఫ్రెండ్లీగా వ్యవహరిస్తారు. అన్నివేళలా అందుబాటులో ఉంటూ.. తమ స్థాయిలో పూర్తి సహాయ సహకారాల్ని అందజేస్తారు. అందుకే, ఈ సంస్థతో బయ్యర్లకు మంచి అనుబంధం ఏర్పడుతుంది.
This website uses cookies.