దేశంలోని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు గత రెండేళ్లలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు చూడగా.. వచ్చే రెండేళ్లలో ఇవి రూ.3 లక్షల కోట్లకు చేరతాయని అంచనా. అటు రెసిడెన్షియల్ ప్రాపర్టీలతో పాటు ఇటు వాణిజ్యపరమైన ప్రాపర్టీలపైనా డెవలపర్లు గట్టిగా దృష్టి సారించిన నేపథ్యంలో రియల్ పెట్టుబడులు మూడు ట్రిలియన్లకు చేరడం చాలా సులభమని నిపుణులు పేర్కొంటున్నారు. 2024, 2025 సంవత్సరాల్లో రియల్ పెట్టుబడులు రూ.3 లక్షల కోట్లకు చేరడం ఖాయమని స్పష్టం చేస్తున్నారు.
కోవిడ్ తర్వాత రియల్ రంగం గాడిన పడి ఊపందుకుంది. 2024 క్యూ1లో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో దాదాపు 1.30 లక్షల ఇళ్లు అమ్ముడయ్యాయి. 2023లో మొత్తం 4.8 లక్షల ఇళ్లు అమ్ముడుకాగా, ఈ ఏడాది 5 లక్షల మార్కు దాటడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే ఆఫీస్ స్పేస్ లీజింగ్ సైతం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో డెవలపర్లకు భరోసా ఉన్నందున ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి మొగ్గు చూపిస్తారని.. అదే సమయంలో భారత్ లో రియల్ హాట్ స్పాట్లుగా కొత్త పట్టణాలు కూడా అభివృద్ధి పథాన పయనిస్తున్నందున పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరుస్తారని చెబుతున్నారు. కరోనా తర్వాత కూడా భారత రియల్ రంగం జోరుగా సాగుతుండటంతో రియ్ ఇన్వెస్టర్లలో భరోసా ఏర్పడిందని.. దాని ఫలితంగానే గత రెండేళ్లలో రూ.లక్ష కోట్లు పెట్టుబడులు వచ్చాయని పేర్కొంటున్నారు.
This website uses cookies.