-
21.48 ఎకరాలు
-
11 టవర్లు.. 2,530 ఫ్లాట్లు
-
ఎత్తు 29 అంతస్తులు
-
ఫ్లాట్ల విస్తీర్ణం.. 1280- 2895 చ.అ.
-
3 క్లబ్‌హౌజులు
హైదరాబాద్ నిర్మాణ రంగంలో సుమారు మూడు దశాబ్దాల అనుభవం గల వాసవి గ్రూప్.. ఈ నెల 4న అంటే సోమవారం రోజున.. వాసవి సరోవర్ అనే బ్యూటీఫుల్ గేటెడ్ కమ్యూనిటీని అట్టహాసంగా ఆరంభించనుంది. హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో జరిగే ఈ లాంచ్‌కు నిర్మాణ రంగంలోని అతిరథ మహారథుల సమక్షంలో ప్రారంభం కానుంది. అటు కోర్ సిటీ.. ఇటు హైటెక్ సిటీ.. మధ్యలో ఉండే కూకట్‌పల్లిలో.. సుమారు 21.48 ఎకరాల్లో ఈ ప్రాజెక్టుని డెవలప్ చేస్తున్నారు. భాగ్యనగర రియల్ రంగానికే సరికొత్త ట్రెండ్‌ను వాసవి సంస్థ ఈ ప్రాజెక్టు ద్వారా పరిచయం చేస్తోంది. ఇప్పటివరకూ బడా ప్రాజెక్టుల్లో రెండు క్లబ్ హౌజుల్ని మాత్రమే చూశాం. కానీ, ఇందులో మాత్రం ఏకంగా మూడు క్లబ్ హౌజుల్ని వాసవి గ్రూప్ ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రాజెక్టు స్పెషాలిటీస్ తెలుసుకుంటే.. ఆతర్వాతే సొంతింటి ఎంపికలో మీరు తుది నిర్ణయం తీసుకుంటారు.
హైదరాబాద్‌లోనే ప్రప్రథమంగా అల్ట్రా స్పేసిషియస్ లేక్ వ్యూ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీకి.. వాసవి గ్రూప్ శ్రీకారం చుట్టింది. రెరా అనుమతి పొందిన ఈ ప్రాజెక్టును సుమారు 21. 48 ఎకరాల్లో కడుతోంది. ఇందులోని పదకొండు టవర్లలో దాదాపు 2,530 ఫ్లాట్లు వస్తాయి. ఒక్కో టవర్ ఎత్తు 29 అంతస్తుల దాకా ఉంటుంది. చుట్టుపక్కల చక్కటి వాతావారణం గల ఈ ప్రాజెక్టులో.. వివిధ సైజుల్లో టూ, త్రీ, ఫోర్ బెడ్‌రూం ఫ్లాట్లను నిర్మిస్తారు. ఫ్లాట్ల సైజు విషయానికి వస్తే 1280 చదరపు అడుగుల్లో టూ బెడ్రూమ్ ఆరంభమవుతాయి. గరిష్ఠంగా 2,895 చదరపు అడుగుల్లో ఫ్లాట్లు లభిస్తాయి.