-
కృత్రిమంగా పెంచేసిన గజం ధర
-
కొందరు రియల్టర్లు, ఏజెంట్ల మాయ
-
వాళ్లు పలికిన రేటును తొలగించాలి
-
ఆ ధరను ప్రామాణికంగా తీసుకోవద్దు!
హెచ్ఎండీఏ మోకిలాలో నిర్వహించిన వేలం పాటలో పాల్గొన్న స్థానిక రియల్టర్లు, ఏజెంట్లు కృత్రిమంగా ధరల్ని పెంచారనే విషయం మరోసారి స్పష్టమైంది. ఎందుకంటే, ఇక్కడ ప్లాట్లను కొనుగోలు చేసిన సామాన్య మధ్యతరగతి ప్రజలకు బ్యాంకు రుణాలు మంజూరు కాకపోవడమో ప్రధాన కారణమని హెచ్ఎండీఏ అధికారికంగా చెబుతోంది. అయితే, కోకాపేట్ వేలంలో పాల్గొన్న బిడ్డర్లకు పిలిచి మరీ రుణాల్ని మంజూరు చేసిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు.. మోకిలాలో ప్లాట్లు కొన్నవారికి ఎందుకు మంజూరు చేయవనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. వేలంలో ప్లాట్లను దక్కించుకున్న చాలామందికి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే అవసరమే పెద్దగా ఉండదు. కాకపోతే, బిడ్డర్లు కృత్రిమంగా ధరల్ని పెంచేందుకే ఈ వేలంలో పాల్గొన్నారనే విషయం తెలిసిందే.