ఈజిప్టులోని షార్మ్ ఎల్ షేక్‌లోని లాంబోర్గిని కన్వెన్షన్ సెంటర్లో అక్టోబరు 4 నుంచి 8 తేదీల్లో 21వ క్రెడాయ్ న్యాట్‌కాన్‌ను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి అధిక సంఖ్య క్రెడాయ్ బిల్డర్లు పాల్గొంటారు. హెచ్ డీఎఫ్సీ మెయిన్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న ఈ క్రెడాయ్ న్యాట్‌కాన్‌కు ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ ఎర్గోలు స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈసారి న్యాట్‌కాన్ ఈవెంట్ గుజరాత్ క్రెడాయ్ ఆధ్వర్యంలో జరుగుతోంది.
మన దేశంలో రియాల్టీ ప్రయాణం, కొత్తతరం నాయకులు, ఆవిష్కర్తలు మరియు టార్చ్ బేరర్లు నాలుగు రోజుల న్యాట్‌కాన్ తమ విజన్‌ను పంచుకుంటారు. అక్టోబరు 5న జరిగే ఛారిత్రాత్మక బిజినెస్ మీట్లో ఈజిప్టు ప్రధానమంత్రి పాల్గొంటున్నారు. ఇరుదేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మరింత బలోపేతం అయ్యేందుకు క్రెడాయ్ న్యాట్‌కాన్ తోడ్పడుతుంది.