poulomi avante poulomi avante

హైద‌రాబాద్‌లో.. ఆఫీసు స‌ర‌ఫ‌రా అధికం

కుష్‌మ‌న్ అండ్ వేక్‌ఫీల్డ్
ఎండీ అన్షుల్ జైన్‌..

హైద‌రాబాద్ ఆఫీసు స్పేస్ విభాగంలో స‌ర‌ఫ‌రా అధిక‌మైంద‌ని.. ఇదే అతి పెద్ద స‌మ‌స్య‌గా అభివ‌ర్ణించారు కుష్‌మ‌న్ అండ్ వేక్‌ఫీల్డ్ ఎండీ అన్షుల్ జైన్‌. ఆయ‌న ఈజిప్టులోని ష‌ర్మ్ ఎల్ షేక్‌లో రియ‌ల్ ఎస్టేట్ గురు కింగ్ జాన్స‌న్ కొయ్య‌డ‌తో మాట్లాడుతూ నాణ్య‌మైన ఆఫీసు స‌ముదాయాల‌కు గిరాకీ మెరుగ్గా ఉన్న‌ప్పటికీ.. వివిధ సంస్థ‌లు కోరుకునేలా స‌రైన ఆఫీసు స్పేస్ అందుబాటులో లేద‌న్నారు. ఈ విభాగంలోకి నాన్ ఇన్స్‌టిట్యూష‌న‌ల్ ప్లేయ‌ర్లు అడుగుపెట్టార‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. వ‌చ్చే ప‌న్నెండు నుంచి ప‌ద్దెనిమిది నెల‌ల్లో భార‌త‌దేశంలో ఆఫీసు మార్కెట్ గ‌ణ‌నీయంగా అభివృద్ధి చెందుతుంద‌ని తెలిపారు. ఈ త్రైమాసికంలో ఆఫీసు స‌ముదాయాల‌కు మంచి గిరాకీ పెరిగింద‌న్నారు. కొత్త జీసీసీల సంఖ్య అధిక‌మ‌వుతాయ‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు. 55 నుంచి అర‌వై శాతం ఉద్యోగులు ఆఫీసుల‌కు రావ‌డం ఆరంభించార‌ని.. ఈ సంఖ్య సేవ‌ల రంగంలోనే మ‌రింత‌గా పెర‌గాల్సిన ఆవ‌శ్య‌క‌త ఉంద‌న్నారు. ఆఫీసుకు ర‌మ్మ‌ని ఉద్యోగుల మీద ఒత్తిడి చేస్తే.. అమెరికాలో కొంద‌రు నిర‌స‌న వ్య‌క్తం చేశార‌ని తెలిపారు. సింగ‌పూర్‌లో ఉద్యోగుల‌కు ఆఫీసుల‌కు వ‌స్తున్నార‌ని అన్నారు.

* గ‌త రెండు త్రైమాసికాల‌తో పోల్చితే జులై- సెప్టెంబ‌రు త్రైమాసికంలో వాణిజ్య లీజింగ్ కార్య‌క‌లాపాలు మెరుగ‌య్యాయ‌ని తెలిపారు. అమెరికా మార్కెట్ మంద‌గ‌మ‌నం వ‌ల్ల త‌గ్గుముఖం ప‌ట్టిన రిక్వెస్ట్ ఫ‌ర్ ప్ర‌పోజ‌ళ్లు ఈ త్రైమాసికంలో పెరిగింద‌న్నారు. ఈ ఏడాది మొత్తం లీజింగ్ కార్య‌క‌లాపాలు ప‌ది నుంచి ప‌దిహేను శాతం అభివృద్ధి చెందుతాయ‌ని వెల్ల‌డించారు. ఏడు న‌గ‌రాల్లో ఆఫీసు లీజింగ్‌లో 46 శాతం వృద్ధి క‌నిపించింద‌న్నారు. ప్ర‌స్తుతం భార‌త‌దేశంలో భార‌త కంపెనీలే వాణిజ్య స‌ముదాయాల్ని ఎక్కువ‌గా తీసుకుంటున్నాయ‌ని.. అమెరికాలో ఈ సంస్థ‌లు మెరుగైన ప‌నితీరును క‌న‌బ‌ర్చ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని తెలిపారు. వ‌చ్చే ప‌ద్దెనిమిది నెల‌ల్లో అమెరికాకు చెందిన జీసీసీ కంపెనీలు భార‌త‌దేశంలోకి అడుగుపెట్టేందుకు పూర్తి అవ‌కాశాలున్నాయ‌ని వెల్ల‌డించారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles