క్రెడాయ్ హైదరాబాద్ బృందం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎంకే హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి క్రెడాయ్ హైదరాబాద్ ప్రతినిధులతో మాట్లాడుతూ.. రియల్ ఎస్టేట్ పరిశ్రమకు అనుకూలమైన వాతావరణాన్ని పెంపొందించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. రియాల్టీ రంగం ఎదుర్కొంటున్న పలు సమస్యల్ని ఈ సందర్భంగా క్రెడాయ్ బృందం సీఎంకు వివరించింది.
హైదరాబాద్ వృద్ధి చెందడానికి అవసరమయ్యేలా డెవలపర్ల సహకారం తీసుకుంటానని సీఎం చెప్పినట్లు క్రెడాయ్ హైదరాబాద్ విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. సీఎంను కలిసినవారిలో క్రెడాయ్ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, ప్రెసిడెంట్-ఎలెక్ట్ జైదీప్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బి. జగన్నాథరావు, ఉపాధ్యక్షులు కోటి, రాంబాబు, మురళీమోహన్, సంయుక్త కార్యదర్శులు క్రాంతి కిరణ్ రెడ్డి, నితీష్ రెడ్డి తదితరులున్నారు.