హైదరాబాద్‌లో పెరిగిన భూముల ధరల నేపథ్యంలో.. విల్లాల్లో నివసించడం కొంత ఖరీదైన వ్యవహారంగా మారింది. అయినప్పటికీ, నగరానికి చెందిన పలు నిర్మాణ సంస్థలు.. కొనుగోలుదారుల అభిరుచి మేరకు కొన్ని ప్రాంతాల్లో లగ్జరీ విల్లాల్ని నిర్మిస్తున్నాయి.
- కిస్మత్పూర్లో అర్బన్ లీగ్ అనే సంస్థ 22.5 ఎకరాల్లో.. 226 రివర్సైడ్ విల్లాల్ని డెవలప్ చేస్తోంది. ఫోర్, ఫైవ్ బీహెచ్‌కే యూనిట్లు ఇందులో వస్తాయి. లావిష్ క్లబ్‌హౌజ్‌ను సుమారు 47 వేల చదరపు అడుగుల్లో అభివృద్ధి చేస్తోంది.
- ఆర్వీ నిర్మాణ్ సంస్థ రావిర్యాల్లో.. ఆర్వీ క్రిషాంగ్ అనే లగ్జరీ విల్లా కమ్యూనిటీని.. దాదాపు 20 ఎకరాల్లో డెవలప్ చేస్తోంది. ఇందులో మొత్తం 168 విల్లాలను డెవలప్ చేస్తారు.
- కొల్లూరు వెలిమలలో.. గ్రీన్‌మార్క్ మేఫేర్ సన్‌రైజ్ విల్లాస్ ప్రాజెక్టును 63 ఎకరాల్లో డెవలప్ చేస్తున్నారు. ఇందులో వచ్చే యూనిట్లు 558 కాగా.. ఒక్కో విల్లాను 3888 నుంచి 6111 చదరపు అడుగుల విస్తీర్ణంలో డెవలప్ చేస్తారు.
- ప్రణీత్ సంస్థ గాగిల్లాపూర్‌లో ప్రణీత్ ప్రణవ్ గ్రోవ్ పార్క్ అనే లగ్జరీ విల్లా కమ్యూనిటీని సుమారు 71 ఎకరాల్లో ఆరంభించింది. ఇందులో వచ్చే మొత్తం 884 విల్లాలు. నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్న ఈ ప్రాజెక్టులో ఒక్కో విల్లాను 2176 నుంచి 4566 చదరపు అడుగుల్లో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాదిలోపు నిర్మాణాన్ని పూర్తి చేయడానికి సంస్థ ప్లాన్ చేస్తోంది.
- హాల్‌మార్క్ ఇన్ఫ్రాకాన్ సంస్థ ఉస్మాన్‌నగర్‌లో ఇరవై ఎకరాల్లో హాల్‌మార్క్ ఇంపీరియా అనే లగ్జరీ విల్లా కమ్యూనిటీని డెవలప్ చేస్తోంది. ఇందులో 130 విల్లాలు వస్తాయి. ఒక్కో విల్లా విస్తీర్ణం.. 5255 నుంచి 5355 విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు.
- హైదరాబాద్ కోర్ ఏరియాలో విల్లాస్‌లో నివసించాలని కోరుకునేవారికి.. వర్టెక్స్ సంస్థ నలగండ్లలో కింగ్స్టన్ పార్కును ఆరంభించింది. సుమారు నలభై ఎకరాల్లో 250 విల్లాల్ని డెవలప్ చేస్తోంది. 307, 340, 460 గజాల్లో 4020 నుంచి 5725 చదరపు అడుగుల్లో విల్లాల్ని డిజైన్ చేసింది.