అన్వితా గ్రూప్ ప్రత్యేకత ఏమిటంటే.. నిర్మాణ నిబంధనల్ని పాటిస్తూ.. నాణ్యత మీద దృష్టి సారిస్తుంది. అందుకే దుబాయ్, డాల్లస్ వంటి నగరాల్లోని పలు ప్రాజెక్టుల్లో ముఖ్యభూమిక పోషించింది. దాదాపు ఇరవై ఎనిమిదికి పైగా ల్యాండ్ మార్క్ ప్రాజెక్టుల్లో నిర్మాణ పనులు, ఇంటీరియర్ ఫిటవుట్స్ పనుల్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఇలా ఘనమైన ట్రాక్ రికార్డు గల అన్వితా గ్రూప్.. హైదరాబాద్‌లోకి ప్రవేశించి.. కొల్లూరులో అన్వితా ఇవానా అనే లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీని ఆరంభించింది.
కొల్లూరులో ఆరంభమైన అన్వితా ఇవానా గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది డిసెంబరులో కొనుగోలుదారులకు అందించాలన్న లక్ష్యంతో అన్వితా ఇవానా సంస్థ కృతనిశ్చయంతో ఉన్నది. మొదటి ఫేజులో భాగంగా జరుగుతున్న రెండు టవర్ల నిర్మాణ పనుల్లో భాగంగా.. మొదటి టవర్‌లో 16వ అంతస్తులో శ్లాబు పనులు జరుగుతుండగా.. 13వ అంతస్తులో బ్రిక్ వర్క్ జరుగుతోంది. మరోవైపు, లోపలి భాగంగా ప్లాస్టరింగ్ పనిని కూడా మొదలెట్టారు. ఇక రెండో టవర్ విషయానికి వస్తే.. 12 అంతస్తులో శ్లాబు పనులు జరుగుతుండగానే.. మరోవైపు ఇంటర్నల్ ప్లాస్టరింగ్ పదో ఫ్లోరులో జరుగుతోంది. మరో మూడు వారాల్లో ఎక్స్టర్నల్ ప్లాస్టరింగ్ పనులు కూడా జరుగుతాయి. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే.. హెచ్ఎండీఏ మార్టిగేజ్ ఫ్లాట్లను మినహాయిస్తే.. ఇందులో సుమారు 27 ఫ్లాట్లు మాత్రమే అమ్మకానికి ఉన్నాయి.