poulomi avante poulomi avante

రియల్ గమ్యస్థానం.. మన హైదరాబాద్

  • 2024లోనూ అభివృద్ధి బాటలో భాగ్యనగరం

రియల్ ఎస్టేట్ కు కీలకమైన గమ్యస్థానంగా మన హైదరాబాద్ మారుతోంది. ఈ రంగంలో శరవేగంగా దూసుకెళ్తోంది. గతేడాది స్తిరాస్థి రంగంలో చక్కని పురోగతి సాధించిన భాగ్యనగరం.. 2024లో తదుపరి స్థాయికి వెళుతుందని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ముంబై, పుణెలతో హైదరాబాద్ కూడా మంచి వృద్ధి సాధిస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఉపాధి విభాగంలో పెరుగుతున్న కార్పొరేటీకరణ రియల్ వృద్ధికి బాగా ఉపకరిస్తోంది. ఇటీవల కాలంలో బలమైన సంఘటిత రంగంలో ఉపాధి అవకాశాలు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. అలాగే హైదరాబాద్ లో అభివృద్ధి చెందుతున్న ఐటీ రంగానికి తోడు.. అద్భుతమైన మౌలిక సదుపాయాలు ఉండటం దేశ, విదేశీ పెట్టుబడుదారులకు ఆకర్షణీయమైన నగరంగా మారింది.

ఐటీ, పారిశ్రామిక కారిడార్ విస్తరణ ఫలితంగా ఐటీ కారిడార్ తోపాటు పలు కీలక ప్రాంతాల్లో నివాసాలకు డిమాండ్ బాగా ఉంది. నిజానికి ఐటీలో హైదరాబాద్ ముందుకు దూసుకెళ్తోంది. ప్రభుత్వ నివేదికల ప్రకారం 2022-23లో రాష్ట్రం ఐటీ, ఐటీ ఆధారిత సేవల ఎగుమతుల్లో 31 శాతం వృద్ధి నమోదు చేసింది. దీంతో సహజంగానే పెట్టుబడిదారుల చూపు హైదరాబాద్ పై పడింది. పైగా ప్రాజెక్టు రోల్ అవుట్ కూడా బాగుండటం మరో సానుకూలమైన అంశం. 2020-21లో విక్రయం కాని ఇన్వెంటరీ 35వేల యూనిట్లకు పైగా ఉన్నప్పటికీ.. నగరం కొత్త ప్రాజెక్టుల విషయంలో ముందుంది. అలాగే అనుమతుల విషయంలో టీఎస్ ఐపాస్, ఐసీటీ వంటి విధానాలు రియల్ మార్కెట్ కు ప్రయోజనం చేకూర్చాయి. ప్రాజెక్టుల పూర్తి రేటు 74 శాతం ఉండటం విశేషం. అలాగే రాబోయే రెండు మూడేళ్లలో 1.3 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలు ఉంటాయని పరిశ్రమ అంచనా. ఈ అంశాలన్నీ 2024లో ప్రాపర్టీ అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంలో వృద్ధిని పెంచుతాయని చెబుతున్నారు.

హైదరాబాద్ లో కమర్షియల్, ఆఫీస్ స్పేస్ కు మంచి డిమాండ్ ఉంది. 2023లో ఆఫీస్ స్పేస్ ఆక్యుపెన్సీలో 4.3 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో 21 శాతం వాటాతో హైదరాబాద్ రెండో స్థానంలో నిలవడమే ఇందుకు నిదర్శనం. అలాగే 2023లో నగరంలో కొత్తగా 8.2 మిలియన్ చదరపు అడుగులు ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి వచ్చింది. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లోని అందుబాటులోకి వచ్చిన మొత్తం ఆఫీస్ స్పేస్ లో ఇది 34 శాతం. మరోవైపు హైదరాబాద్ లో మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగంగా జరుగుతుండటం కూడా రియల్ రంగానికి ఊపునిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డుతోపాటు కొత్త రీజనల్ రింగ్ రోడ్డు వంటి అంశాలు హైదరాబాద్ ను రియల్ పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మార్చాయి.
అలాగే అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవడంలోనూ హైదరాబాద్ ముందుంది.
స్మార్ట్ సిటీ మోడ్ లోకి ప్రవేశించిన నగరం.. ఏఐ, ఐఓటీ వంటి అధునాతన సాంకేతికతలను స్వీకరించి రియల్ ఎస్టేట్ రంగాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళ్తోంది. తద్వారా కస్టమర్లకు అంతులోని మంచి అనుభూతిని కలిగిస్తోంది. అదే సమయంలో అటు పర్యావరణ అనుకూల విధానాలనూ అవలంభిస్తోంది. తద్వారా ఏ ఒక్క అంశంలోనూ వెనకబడకుండా రియల్ రంగ వృద్ధికి దోహదపడుతోంది. ఇక్కడి డెవలపర్లు కూడా విలాసవంతమైన, విశాలమైన, స్మార్ట్ హోమ్ ల నిర్మాణం విషయంలో రాజీపడకుండా ఉండటం, కొనుగోలుదారుల ప్రాధాన్యతలకు అనుగుణంగా తమను తామ మార్చుకుంటుండటంతో హైదరాబాద్ రియల్ రంగం పురోగతిలో పయనిస్తోంది.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles