హైదరాబాద్‌లో లగ్జరీ, అల్ట్రా లగ్జరీ, ఊబర్ లగ్జరీ నిర్మాణాల జోరు పెరిగింది. రెండు వేల చదరపు అడుగుల్లోపు కట్టే ప్రాజెక్టుల్ని లగ్జరీ నిర్మాణాలుగా పేర్కొంటారు. ఆతర్వాతి స్థాయి నుంచి మూడు నుంచి నాలుగు వేల చదరపు అడుగుల్లో కట్టేవాటిని అల్ట్రా లగ్జరీ నిర్మాణాలంటారు. నెలకు ముప్పయ్ నుంచి నలభై లక్షలు సంపాదించేవారు వీటిని ఎక్కువగా కొంటారు. ఇక, సుమారు ఐదు వేలు లేదా ఆపై దాటిన విస్తీర్ణంలో కట్టే అపార్టుమెంట్లను ఊబర్ లగ్జరీ ప్రాజెక్టులుగా పిలుస్తారు. వీటిని లావిష్ ప్రాజెక్టులుగా అభివర్ణిస్తారు. వీటి అమ్మకాలు గతేడాది ఎక్కువే జరిగాయి. అందుకే, మారిన పరిస్థితుల నేపథ్యంలో, ఈ విభాగపు బిల్డర్లంతా ప్రస్తుతం నిర్మాణ పనుల మీద దృష్టి పెడుతున్నారు. మరి, నగరంలో అల్ట్రా లగ్జరీ ప్రాజెక్టులను నిర్మిస్తున్న పలు ప్రాజెక్టుల వివరాలు మీకోసం..
మూడింట్లో తేడాలివే..
హైదరాబాద్‌లో బిల్డర్లు లగ్జరీ, అల్ట్రా లగ్జరీ, ఊబర్ లగ్జరీ ఫ్లాట్లను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కాకపోతే, వీటి మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటనే విషయాన్ని తెలియకుండానే చాలామంది ఫ్లాట్లను కొనుగోలు చేస్తుంటారు. ఇక నుంచి ఎవరైనా హైదరాబాద్‌లో ఫ్లాట్లను కొనాలనే నిర్ణయానికి వస్తే.. మూడు రకాల ఫ్లాట్ల మధ్య ఉండే ప్రాథమిక తేడాలు ఇలా ఉంటాయని గుర్తుంచుకోండి.
లగ్జరీ అల్ట్రా లగ్జరీ ఊబర్ లగ్జరీ
టైల్స్ విట్రీఫైడ్ డబుల్ ఛార్జ్డ్ విట్రీఫైడ్ 2.5 * 2.5 లార్జ్ ఫార్మాట్/ ఇటాలియన్ గ్రానైట్
మెయిన్ డోర్ హైట్ 6 అడుగులు 6-7 అడుగులు 8 అడుగులు
సీలింగ్ ఎత్తు 9.5 అడుగులు 9.5- 10.5 అడుగులు 10.5- 11.5 అడుగులు
ఫ్లోర్‌కు ఎన్ని ఫ్లాట్లు? 8-10 4-5 1-2
అమెనిటీస్ విస్తీర్ణం 60000 చ.అ. (గరిష్ఠం) 1 లక్ష చ.అ లక్ష ప్లస్ చ.అ.
ప్రైవేసీ పెద్దగా ఉండదు ప్రాథమిక ప్రైవసీ ఓకే పూర్తి స్థాయి ప్రైవసీ
ఎలివేటర్లు 3:1 2:1 1:1
ఏసీ నో వీఆర్వీ వీఆర్వీ/ వీఆర్ఎఫ్ వీఆర్వీ
రాజపుష్ప ఇన్ఫినియా
మంచిరేవుల
బి + 55 అంతస్తులు
6 టవర్లు.. 1522 ఫ్లాట్లు
3,4,5 బీహెచ్‌కే ఫ్లాట్స్
3080- 5725 ఎస్ఎఫ్టీ
మై హోమ్ నిషధ
కోకాపేట్
45 అంతస్తులు
8 టవర్లు.. 1398 ఫ్లాట్లు
3, 4 బీహెచ్‌కే ఫ్లాట్స్
3450- 4617 ఎస్ఎఫ్టీ
ఎస్ఏఎస్ డౌన్‌టౌన్
నానక్‌రాంగూడ
54 అంతస్తులు
2 టవర్లు.. 418 ఫ్లాట్లు
4 బీహెచ్‌కే ఫ్లాట్స్
2715- 4080 ఎస్ఎఫ్టీ
పౌలోమీ అవాంతే
కోకాపేట్
జి ప్లస్ 22
3 టవర్లు.. 475 ఫ్లాట్లు
3 బీహెచ్‌కే ఫ్లాట్స్
1550- 2576 ఎస్ఎఫ్టీ
విండ్సర్ పార్క్
నానక్‌రాంగూడ
ఎస్+36 ఫ్లోర్స్
7 టవర్లు.. 1491 ఫ్లాట్స్
3 బీహెచ్‌కే ప్లస్ మెయిడ్
2130- 3400 ఎస్ఎఫ్టీ
టీమ్ ఫోర్ ఆర్కా
పొప్పాల్‌గూడ
43 ఫ్లోర్స్
6 టవర్స్.. 1150 ఫ్లాట్స్
3, 4 బీహెచ్‌కే ప్లస్ మెయిడ్
2095- 4365 ఎస్ఎఫ్టీ
- అవగాహన కోసమే. తుది ధర కోసం బిల్డర్‌ను సంప్రదించండి.