poulomi avante poulomi avante

3 బీహెచ్ కేలు.. బాల్కనీలు..

  • ఎక్కువమంది ఆకాంక్షలివే
  • ఫిక్కీ-అనరాక్ సర్వేలో వెల్లడి

మారుతున్న కాలంతోపాటే ఇళ్ల కొనుగోలుదారుల అభిరుచులు, ఆకాంక్షల్లో కూడా గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 50 శాతం మంది మిలీనియల్స్ (28 ఏళ్ల నుంచి 43 ఏళ్ల మధ్య వయసున్నవారు) 3 బీహెచ్ కే ఇళ్లనే ఇష్టపడుతుండగా.. జెన్ ఎక్స్ (44 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్నవారు)లో 75 శాతం మంది బాల్కనీలు కావాలనుకుంటున్నారు. అలాగే 58 శాతం మంది మిలీనియల్స్, 39 శాతం మంది జెన్ ఎక్స్ కొనుగోలుదారులు ఇంటి కొనుగోలు కోసం ఇతర పెట్టుబడుల నుంచి వచ్చే లాభాలను వినియోగించాలని భావిస్తున్నారు. ఈ విషయాలు ఫిక్కీ-అనరాక్ సంయుక్తంగా చేపట్టిన సర్వేలో వెల్లడయ్యాయి.

గతేడాది జూలై నుంచి డిసెంబర్ మధ్య దేశంలోని వివిధ నగరాలకు చెందిన దాదాపు 5,510 మందితో ఆన్ లైన్ లో ఈ సర్వే నిర్వహించారు. 38 శాతం మంది కొనుగోలుదారులు 2 బీహెచ్ కే వైపు మొగ్గు చూపించినట్లు ఇందులో తేలింది. ప్రాపర్టీ ధరలు పెరుగుతున్నప్పటికీ, పెద్ద అపార్ట్ మెంట్లకు కూడా డిమాండ్ నిరంతరంగా కొనసాగుతోంది. పైగా వీటి కొనుగోళ్లు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీల్లో 3 బీహెచ్ కేలకు ఎక్కువ ఆదరణ ఉంటోంది. ముంబైలో 2 బీహెచ్ కే ఇళ్లకు 44 శాతం మంది ఓటేశారు. అలాగే సింగిల్ బెడ్ రూమ్ ఇళ్లకు ముంబైలో 17 శాతం మంది మొగ్గు చూపించగా..

పుణెలో 10 శాతం మంది వాటిని కావాలనుకుంటున్నారు. మరోవైపు రూ.కోటిన్నర కంటే ఎక్కవ ధర కలిగిన లగ్జరీ ఇళ్లకు కూడా డిమాండ్ పెరిగింది. దాదాపు 20 శాతం మంది ఇంత ధర పెట్టి ఇల్లు కొనడానికి ఆసక్తి కనబరిచారు. ఇది 2021 ద్వితీయార్థంలో 12 శాతం మాత్రమే ఉంది. ఇక రూ.45 లక్షల నుంచి రూ90 లక్షల బడ్జెట్ లో ఇళ్లకు అత్యధికంగా 33 శాతం మంది మొగ్గు చూపించారు. కాగా, అందుబాటు ధరల ఇళ్ల‌కు డిమాండ్ తగ్గుతోంది. వీటి అమ్మకాలు 2020 ద్వితీయార్థంలో 40 శాతం ఉండగా.. 2021 ద్వితీయార్ధంలో 25 శాతానికి, 2023 ద్వితీయార్థంలో 21 శాతానికి తగ్గుతూ వచ్చాయి. గతేడాది దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో సగటున‌ ఫ్లాట్ సైజులు 11 శాతం వృద్ధి చెందాయి.

2022లో 1175 చదరపు అడుగుల నుంచి 2023లో 1300 చదరపు అడుగులకు పెరిగాయి. కరోనా తర్వాత సబర్బన్ ఏరియాల్లో ఇల్లు కొనాలనుకునేవారి సంఖ్య పెరుగుతోంది. 2021 ద్వితీయార్థంలో 25 శాతం మంది సబర్బన్ ఏరియాలకు ప్రాధాన్యత ఇవ్వగా.. 2023 ద్వితీయార్థంలో వీరి సంఖ్య 30 శాతం ఉంది. అలాగే సర్వేలో పాల్గొన్నవారిలో 75 శాతం మంది తమ ఇళ్లు విశాలంగా ఉండాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా హాయిగా గాలిని ఆస్వాదించడానికి బాల్కనీలు కావాలంటున్నారు.
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా పరిణామాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ భారత్ లో ఆర్థిక పరిస్థితులు సానుకూలంగా ఉన్న నేపథ్యంలో పెట్టుబడిదారులు మళ్లీ రియల్ మార్కెట్లోకి వస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ వైపు చూస్తున్నారు. సర్వేలో పాల్గొన్నవారిలో 57 శాతం మంది సైతం రియల్ ఎస్టేట్ ఉత్తమ పెట్టబడి ఎంపికగా పేర్కొన్నారు. రియల్ రంగం తర్వాత 29 శాతం మంది స్టాక్ మార్కెట్ మంచిదని పేర్కొన్నారు. అలాగే బంగారం కూడా మంచి పెట్టుబడి ఎంపిక అని 6 శాతం మంది చెప్పారు.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles