హైదరాబాద్‌లో స్తంభించిన రియాల్టీ అనే కథనాన్ని రియల్ ఎస్టేట్ గురించి మార్చి 16న కథనాన్ని ప్రచురించిన నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో నిలిచిపోయిన లేఅవుట్, భవన నిర్మాణ అనుమతులకు ఎట్టకేలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. డిసెంబరు నుంచి నిలిచిపోయిన బిల్డింగ్ కమిటీ ఎట్టకేలకు సమావేశమైంది.
శివబాలకృష్ణ వ్యవహారంతో అనుమతులన్నీ నిలిపివేసిన రాష్ట్ర ప్రభుత్వం.. నిర్మాణ రంగం స్తంభించిన విషయాన్ని గుర్తించి కీలక నిర్ణయం తీసుకుంది. ఫలితంగా, డిసెంబరు నుంచి నిలిచిపోయిన అనుమతులకు ఇక నుంచి మోక్షం లభించే అవకాశముంది.