poulomi avante poulomi avante

లీకేజీ.. సీపేజీ.. తెలిసేది ఇప్పుడే

ఫ్లాట్లు కొన‌డానికిదే బెస్ట్ టైమ్‌
ఇంటి నాణ్యత, పరిసరాలపై అవ‌గాహ‌న‌

వానా కాలం మొదలు కాగానే.. చాలామంది సొంతింటి ఎంపిక‌ను వాయిదా వేస్తుంటారు. కానీ, వ‌ర్షాలు ప‌డేట‌ప్పుడు ప్రాజెక్టును సంద‌ర్శిస్తేనే మీకు నాణ్య‌త గురించి తెలుస్తుంది. అక్క‌డి చుట్టుప‌క్క‌ల ప‌రిస‌రాల‌పై అవ‌గాహ‌న పెరుగుతుంద‌ని గుర్తుంచుకోండి.

వర్షాకాలం ఏ పని చేయాలన్నా కొంత ఇబ్బందే. ఎప్పుడు వాన పడుతుందో తెలియదు. తీరా బయటకు వెళ్లాక వర్షం పడితే ఇక అంతే సంగతులు. మిగతా పనులను పక్కన పెడితే వానాకాలంలో ఇంటిని కొనేందుకు కొనుగోలుదారులు పెద్దగా ఆసక్తి చూపించరు. నిర్మాణ రంగ సంస్థలు సైతం తమ కస్టమర్లకు కన్ స్ట్రక్షన్ ప్రాజెక్టును చూపించేందుకు ఇష్టపడవు. అందుకు అనుగుణంగానే వర్షాకాలంలో రియల్ ఎస్టేట్ రంగం నెమ్మదిస్తుంది. ఇళ్ల అమ్మకాలు బాగా పడిపోతాయి. ఐతే కొనబోయే స్థిరాస్తి ప్రాజెక్టు గురించి వాస్తవ పరిస్థితి తెలుసుకోవాలంటే మాత్రం వానాకాలంలో వెళ్లి చూడటమే సరైందని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. కొత్త ఇంటిలో నిర్మాణ లోపాలేమైనా ఉన్నా, వర్షానికి ఎక్కడైనా లీకేజీ అవుతున్నా అప్పుడే తెలిసిపోతుంది. దీంతో నిర్మాణ నాణ్యతను అంచనా వేసి ఇంటి కొనుగోలు విషయంలో ఒక నిర్ణయానికి రావొచ్చని అంటున్నారు.

ఇక వానాకాలంలో సహజంగానే గృహాల అమ్మకాలు తక్కువుంటాయి. దీంతో బిల్డర్‌ తో ఎక్కువగా బేరమాడేందుకూ అవకాశం ఉంటుంది. వచ్చే కొద్ది మంది వినియోగదారులను చేజార్చుకోకూడదనే నిర్మాణ సంస్థలు చూస్తుంటాయి. నిజంగా కొనే ఆసక్తి ఉందా లేదా చూసి ఇంటి ధరలు తగ్గిస్తుంటారు. ఇక మనం కొనబోయే ఇంటిని వానాకాలంలో చూడటం ద్వారా ఆయా స్థలాలు, ఫ్లాట్లు, ఇళ్ల చుట్టూ ఉన్న మౌలిక వసతులు ఎలా ఉన్నాయో తెలుస్తుంది. నిర్మాణరంగ సంస్థలు చాలా వరకు చెరువు పరిధి, వరద కాలువ మార్గంలో, ఎఫ్‌టీఎల్‌ పరిధిలో చాలా వెంచర్లు, నిర్మాణప్రాజెక్టులు చేపట్టి విక్రయిస్తున్నారు. ఇటువంటి ప్రాజెక్టుల్లో ఇంటిని కొనుగోలు చేస్తే ఎప్పుడో ఒకప్పుడు ముంపు తప్పదు. భారీ వర్షాలు పడినప్పుడు నీట మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటి ప్రాంతంలో ఇల్లు కొంటే ఆస్తుల విలువ కూడా పడిపోతుంది. ఇలాంటి చోట వెంటనే నివాసం ఉండొచ్చా, లేదంటే అక్కడ అభివృద్ధి చెందడానికి ఎంత సమయం పడుతుంది అన్న అంశాల్లో క్లారిటీ వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

లోతట్టు ప్రాంతాల్లో కొనుగోలు చేస్తున్నట్లయితే.. వరద ముప్పు లేని అపార్టుమెంట్ల‌ను కొనుగోలు చేయడం మంచిది. పార్కింగ్‌ కోసం గ్రౌండ్‌ ఫ్లోర్‌ వదిలిన, నిబంధనలు పాటించిన వాటిలోనే కొనుగోలు చేయాలి. సాధారణ రోజులతో పోలిస్తే వర్షాకాలంలో అక్కడి రోడ్లు ఎలా ఉన్నాయో, రవాణా సదుపాయాల పరిస్థితిపై స్పష్టమైన అంచనాకు రావచ్చు. రహదారులు సరిగ్గా లేవని గుంతలమయంగా ఉన్నాయని గుడ్డిగా తిరస్కరించవద్దు. ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి ఆ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి ఎలా ఉంటుందో కచ్చితంగా అంచనా వేయాలి. ఈ రంగంలో అవగాహన ఉన్న వారితో చర్చించి ఇంటి కొనుగోలు విషయంలో నిర్ణయం తీసుకోవాలి.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles